28, జూన్ 2014, శనివారం

ప్రాణం పరితపిస్తోంది....!!

మాటలే రాని నాకు మౌనం
తోడుగా ఉంటే కాదని చెప్పి
అక్షరాల చెలిమిని అందంగా
అమర్చి నాకందించిన నువ్వు...!!
భావాల ఆటల బంధాల జతలో
చేరిన నీ నా జ్ఞాపకాల సాన్నిహిత్యం
మరుగున పడిన మరో మనసుని
మళ్ళి నిదుర లేపుతుందేమో...!!
అలవాటు పడిన జీవితం కొత్తగా కనిపిస్తూ
నన్ను నాకే సరి కొత్తగా చూపిస్తూ మౌనాల
 అర్ధాల  భాష్యాలు వినిపిస్తూ చూపించే
 సరి కొత్త కావ్యమే రూపు దాల్చినదేమో...!!
పక్కనే నువ్వున్నా పలుకులే లేని
కధల సంగతి చెప్పాలని ఉన్నా
మాటలే మరచిన నాకు మూగతనాన్ని
కానుకగా ఇచ్చిన సంగతి నువ్వు మరచినట్లుంది....!!
అయినా ఎక్కడో ఓ చిన్న ఆశ
నీతో మాటల సంద్రాలు అలలై
నా కలల వాకిళ్ళ నుండి నిజాలుగా
నిన్ను చేరాలని చూస్తూ ప్రాణం పరితపిస్తోంది....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chandra Vemula చెప్పారు...

నీ, నా జ్ఞాపకాల సాన్నిహిత్యం మరుగున పడిన మరో మనసుని మళ్ళి నిదుర లేపుతుందేమో...!! నా జీవితం నాకే కొత్తగా కనిపిస్తూ నన్ను నాకే సరి కొత్తగా చూపిస్తూ మౌనాల అర్ధాల భాష్యాలు వినిపిస్తూ చూపించే సరి కొత్త కావ్యమే రూపు దాల్చినదేమో...!!
బాషమీద పట్టు
భావ స్పష్టీకరణ
ఎంత చక్కని భావ వ్యక్తీకరణ
అభినందనలు మంజు గారు

చెప్పాలంటే...... చెప్పారు...

మీకు నా మనఃపూర్వక ధన్యవాదాలు అండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner