7, జూన్ 2014, శనివారం

నా మది సవ్వడి....!!

ఎందరున్నా ఎవరులేని ఏకాంతానికి
అతిధిగా వచ్చిన నువ్వెవరు....??
ముక్కలైన మనసు అద్దంలో కనిపించే
ఎన్నో ప్రతిబింబాల గురుతుల గమనాలు
వెంబడిస్తూనే ఉన్నాయి పారిపోదామన్న
నా ప్రయత్నానికి అడ్డు తగులుతూ...
గుచ్చుకున్న గాయాలను మాన్పడానికి
చేస్తున్న ప్రతి యత్నము బెడిసికొడుతూనే
మళ్ళి మళ్ళి ఏడిపిస్తోంది నన్ను వెక్కిరిస్తూ....
అలా అయిన ప్రతి సారి నాలో ఏదో తెగింపు
గెలవాలన్న ఆరాటం నాకు ధైర్యానిస్తూ...
జారుతున్న ప్రతి కన్నీటి బొట్టుని కదిలిస్తే
చెప్పే కధల కావ్యాలను వినిపించడానికి
నీతో పంచుకోవడానికి నా స్వార్ధం కోసం
అనుకోని అతిధిగా ఆహ్వానించినా....
స్వీకరించిన నాలోని నీకు నా మది సవ్వడి
పదే పదే వినిపించనక్కరలేదేమో కదా....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chandra Vemula చెప్పారు...

ముక్కలైన మనసు అద్దంలో కనిపించే ఆ ప్రతిబింబాల జ్ఞాపకాలు చిత్రం లా కదిలి .... పారిపోదామన్న ప్రయత్నాన్ని అడ్డు కోకుండా .....
మనసు అద్దం ముక్కలుకాకుంటే ఎంత బాగుండు నో కదా!

చెప్పాలంటే...... చెప్పారు...

:) నిజమే అండి కాని మనసు అడ్డం ముక్కలు కాని అదృష్టవంతులు కొందరే .... ధన్యవాదాలు మీ స్పందనకు చంద్ర గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner