28, జనవరి 2010, గురువారం
చిన్ననాటి తీపి గురుతులు....
విజయనగరం దగ్గరలో పల్లెటూరు, ఆ ఊరికి రెండు మైళ్ళ దూరంలో గవర్నమెంట్ హైస్కూల్ లో టెన్త్ వరకు చదివాము. బాగా వెనుక పడిన ప్రాంతం అప్పుడు. చాలా తక్కువ మంది చదివేవాళ్ళు. రెండు ప్రైవేటు బస్సులు తిరుగుతూ ఉండేవి విజయనగరం వరకు. అన్ని మామిడి తోటలు, చెరుకు పొలాలు, వేరుసెనగ, ఇంకా చాలా తోటలు ఉండేవి మా వూరు నుంచి స్కూల్ వున్న వూరు వరకు. వేసవి లో ఒంటిపూట బడులప్పుడు బస్సు వుండేది కాదు పొద్దున్నే. నడుచుకుంటూ వాక్కాయలు, పుల్లరేగుకాయలు తింటూ, మామిడి కాయలు దొంగతనంగా కోసుకుని ఉప్పు కారం తో తింటే అబ్బాఆ రోజులే భలే ఉండేవి. తెలుగు మాస్టర్ గారు నాతోనే పాఠం చదివించే వారు, ఒక్క తప్పు అయినా చదువుతానేమో అని. టెన్త్ వరకు నేనే చదివేదాన్ని ఒక్క తప్పు లేకుండా....ఇక్కడ ముఖ్యం గా కొంత మంది గురించి చెప్పాలి. మా హింది టీచర్ గారి గురించి చెప్పాలి. మాకు పాఠాలే కాకుండా జీవితం లో జరిగే ఎన్నో విషయాలను, కధలను, కబుర్లను, చెప్పే వారు. లెక్కల మాస్టర్ గారు చాల బాగా లెక్కలు చెప్పే వారు. ఈయన అంటే అందరికి భయం. ఇక సైన్సు , సోషల్ మాములు గా చెప్పే వాళ్ళు. స్కూల్ లో చిన్న చిన్న పోట్లాటలు జరుగుతూ వుండేవి.
ఇంకా వుంది.....
ఇంకా వుంది.....
వర్గము
జ్ఞాపకాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మాదీ విజయనగరమేనండీ....మీదెక్కడ?
మీ చిన్నప్పటి రోజులని ఇంకా కొంచం వివరంగా రాస్తే బావుంటుందేమో ఆలోచించండి.
మామిడికాయలు, రేక్కాయాలు, తేగలు నాకూ గుర్తున్నాయి
పినవెమలి అండి సౌమ్య గారు ఇంకా వివరం గా రాస్తూ పొతే పెద్ద నవల అవుతుంది అని రాయలేదు.మీకు అనిపించినట్లే నాకు అనిపించింది. ఏదైనా కానివ్వండి థాంక్స్ మీ ప్రత్యుత్తరానికి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి