2, ఫిబ్రవరి 2010, మంగళవారం

చిన్నారి వైష్ణవి - మానవత్వం మరచిన మృగాలు.

చిన్నారి వైష్ణవి ని పొట్టన పెట్టుకున్న కిరాతకుల్ని వాళ్ళు చేసినట్లే వాళ్ళని కుడా చంపాలి. ఇదే అందరు కోరుకునేది. గతకాలం లో శ్రీలక్ష్మి, ఆయేషా, మనీషా .......ఇలా ఎందరో మనకు తెలియకుండా రోజు బలి అవుతూనే వున్నారు. మనోహర్ ని కుడా యాసిడ్ పోసో లేదా కత్తితో ఖండాలు గా నరికితే ఈ రోజు ఈ దారుణం జరగకుండా వుండేదేమో! ఆయేషా కేస్ గురించి ఇప్పటి వరకు ఒక్క అడుగు కుడా ముందుకు పోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనపడక పోతేనే మన పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం చాలా తొందరగా స్పందించి కనుక్కున్నారు కదా!! ఇది కుడా అలానే ఐంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే అంత టైం తీసుకున్నప్పుడు సామాన్యుని గతి ఏమిటి?
అంతా అయిపోయాక విఫలమయ్యాం అని చెప్పుకోడం తప్ప ఏమి వుండటం లేదు. కౄరులకు క్షమాభిక్ష పెట్టడం మళ్ళి సమాజం లోకి స్వేచ్చ గా వదిలేయడమే మన ప్రభుత్వం చేస్తోంది ఇప్పుడు.
ఇది ఎంత వరకు న్యాయం గా వుందో ఒక్క సారి ఆలోచించండి ప్రతి ఒక్కరు....!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Nrahamthulla చెప్పారు...

చిన్నారి వైష్ణవి కొలిమిలో మసైన తరువాత పరిశీలనలో తేలిన విషయాలుఃప్రకాశం బ్యారేజి, కనకదుర్గవారధి,కృష్ణానది ఎన్నో హత్యలకు మూగసాక్షులుగా ఉన్నాయి.
విజయవాడ నగర నేరగాళ్లు హత్యలు చేసి మృతదేహాలను తాడేపల్లిమండలం సీతానగరం లో పడవేస్తున్నారు.మహిళలను వంచించి, మోసగించి వారిని శారీరకంగా, ఆర్థికంగా దోచుకుని తాడేపల్లి ఏరియావైపు తీసుకువచ్చి దారుణంగా హతమారుస్తున్నారు.విజయవాడ-మంగళగిరి బైపాస్‌రోడ్డు వెంబడి మృతదేహాలను కాల్చివేస్తున్నారు.కృష్ణానది దాటించి కృష్ణాయపాలెం వద్ద మృతదేహాలను గోనెసంచిలో కుక్కి కొండవీటివాగులో గిరాటేసి వెళ్లిపోతున్నారు. కృష్ణానదిలో తేలియాడే శవాలను ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు నెట్టివేసుకుంటూ తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు.మంగళగిరి నుంచి కృష్ణాకెనాల్‌ జంక్షన్ వరకు హతుల మృతదేహాలను రాత్రివేళల్లో రైల్వేట్రాక్‌పై పడవేస్తున్నారు.కిడ్నాప్‌ చేసి తాడేపల్లి బకింగ్‌హామ్‌ కెనాల్‌ వద్ద వాహనాలు మార్చి తీసుకువెళుతున్నారు. తాడేపల్లిని కూడా విజయవాడ పోలీసు పరిధిలోకి తేవాలి.

అజ్ఞాత చెప్పారు...

ముద్దులొలికే చిన్నారీ..ఎంత బాధ అనుభవించావో చని పోయే ముందు..తలచుకొంటేనే కన్నీళ్లు ఆగట్లేదమ్మా...నీకు, నాకు ఏ రక్త సంబంధం లేక పోయినా మనసు కకా వికలమైపోయింది తల్లీ... నిన్ను కాపాడుకోలేక పోయినందుకు మమ్మల్నందర్నీ క్షమించమ్మా..

అజ్ఞాత చెప్పారు...

ఒక్క మానవహక్కుల ముండాకొడుకు ఇప్పుడు పెదవి విప్పడే.

పరిమళం చెప్పారు...

మానవత్వం మంటగలిసింది దారుణం !

తాడేపల్లి చెప్పారు...

ఇది వర్గీయ/ జెండర్ దృష్టితో చూడాల్సిన కేసు కాదు. ఆధునికకాలంలో బాంధవ్యాలు ఎలా డబ్బు చుట్టూ తిరుగుతున్నాయో, ఎలా పాడైపోతున్నాయో తెలిపే కేసు. వాళ్ళు ప్రభాకరరావుని నిర్వంశం చేయదల్చుకుని అతని కూతురితో పాటు అతని కొడుకైన తేజేష్ ని కూడా కిడ్నాప్ చేశారు. కానీ తేజేష్ సమయస్ఫూర్తిగా తప్పించుకొని పారిపోయాడు. ఆ పని చిన్నారి వైష్ణవి వల్ల కాలేదు.

Sudheer చెప్పారు...

hi anna blog keka undi
naku baga nachindi
nenu kuda oka blog chesanu
adi kuda oka sari chudu
www.crazy500.blogspot.com
na id sudheer.463@gmail.com
kepp in touch with me

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner