9, ఏప్రిల్ 2010, శుక్రవారం

ప్రపంచాన్ని నడిపించే బలమైన ఆయుధం

ఈ ప్రపంచం లో డబ్బులు అవసరం లేని మనిషి అంటూ వుండరంటే అది అతిశయోక్తి కాదు. మన డబ్బులు మనకి ఎంతో ఎదుటి వాళ్ళ డబ్బులు కుడా అంతే అని ఆలోచిస్తే ఈ గొడవలు, పోట్లాటలు వుండవు. మనకి రావాల్సిన డబ్బులు మాత్రమే గుర్తు ఉంచుకుని మనం ఇవాల్సినవి మాత్రం మర్చిపోతున్నాం....ఇది న్యాయం కాదు...ఒకళ్ళ సొమ్ము తిని తినలేదు అన్నా తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టినా మరు జన్మలో కుక్క అయి పుట్టి అయినా బాకీ తీర్చాలి....అని నా ప్రగాడ నమ్మకం. ఈ రోజుల్లో ప్రతి బంధం, అనుబంధం కుడా డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయి..కాదంటారా!! డబ్బు వుంటే కొన్ని మాత్రమే దొరుకుతాయి అన్ని కాదు....ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కుడా కొంత మంది మాత్రం డబ్బు చుట్టూనే తిరుగుతారు...డబ్బు కోసం ఏమైనా చేస్తారు..వాళ్ళకి ఏ బంధం కుడా గుర్తు రాదు డబ్బే లోకం...డబ్బే సమస్తం...!! ఈ రోజుల్లో ప్రపంచాన్ని నడిపించే బలమైన ఆయుధం డబ్బే. ఒకప్పుడు మనిషి అవసరం కోసం డబ్బుని సృష్టిస్తే ఈ రోజు అదే మనిషిని ఆడిస్తోంది. ఇదీ డబ్బు మహిమ...!!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

బుచికి బుచికి. ఏవిటోలా ఉంది. ఏదో ఇదిగా ఉంది. ఇది చదివిన కాణ్ణించి పెయ్యలో ఇకారంగాఉంది. well done.

Time చెప్పారు...

some quotes abt money....
"money can make many things...
but not all"

చెప్పాలంటే...... చెప్పారు...

meru anndi nijame kadaa!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner