28, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఓ తల్లి వ్యధ

నాకు తెలిసిన ఓ తల్లి చాలా బాగా బతికింది ఒకప్పుడు. ఇప్పుడు ఎలా బతకాలో తెలియని అయోమయం లో బతకాలా వద్దా అన్న సందిగ్ధం లో బతుకు వెళ్ళదీస్తోంది...రాని చావు కోసం ఎదురు చూస్తూ…….. ముగ్గురు ఆడపిల్ల తరువాత లేక లేక కొడుకు పుట్టాడని ఎంతో మురిసి పోయారు ఆ తల్లిదండ్రులు. అందరికన్నా చిన్నవాడని అపురూపం గా పెంచుకున్నారు. పెద్ద పిల్లలకి పెద్దగా చదువు చెప్పించక పోయినా చిన్నవాళ్ళిద్దరికీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేటట్లు టీచర్ ట్రైనింగ్ చెప్పించారు. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం....కాక పొతే తరువాత పార్టీలని కొంత సొమ్ము, వ్యాపారమని కొంత సొమ్ము పెట్టి మొత్తం నాశనమైంది పిల్లలు పెరిగేసరికి. కొడుకు కి యాక్సిడెంట్ అయి కొన్ని నెలలు మంచం లోనే వుంటే బతుకుతాడో లేదో తెలియని కొడుకు కోసం ఆ తల్లి పడిన వేదన చెప్పనలవి కానిది. తల్లి, పెద్ద కూతురు వాళ్ళ పిల్లలు ఒక సంవత్సరం కష్ట పడితే కాని మామూలు మనిషి కాలేదు. పుట్టిన పిల్లాడికి చేసినట్లు అన్ని ఆ పాతికేళ్ళ కొడుకుకి ఎంతో ఓర్పుతో, ఓపిక తో ఆ తల్లి, అక్క, అక్క పిల్లలు చేసిన సేవలు మనిషి జన్మ ఎత్తిన వాడు ఎవడు మర్చి పోలేడు. కాని ఈ మనిషి అది మర్చి పోయి అక్క కూతురిని చేసుకోకుండా కట్నం కోసం వేరే ఆవిడని చేసుకుని ఆవిడ అడుగుజాడలలో తల్లికి, అక్క చెల్లెళ్ళకు దూరం గా ఉద్యోగాన్ని మార్చుకుని అస్సలు వీళ్ళు ఎవరో తెలియనట్లు బతుకుతున్న గొప్ప బాద్యత గల ఉపాద్యాయ వృత్తిలో వున్నాడు ఈ రోజు. కనీసం తల్లికి అవసరానికి ఆదుకోకుండా వున్న ఇల్లు అమ్మి ఆ డబ్బులు కుడా ఎంత మంది చెప్పినా వినకుండా కొడుకు కి ఇచ్చిన కన్నతల్లి నెల రోజుల నుంచి అనారోగ్యం పాలైతే కనీసం చూడటానికి కుడా రాని ఆ కొడుకుని ఎవరితో పోల్చాలి? ఎంత మంది ఎన్ని సార్లు ఫోనులు చేసి చెప్పినా నెల రోజుల నుంచి తల్లిని చూడటానికి సెలవు దొరకని ప్రభుత్వ ఉపాద్యాయుడు . బాధ్యతాయుతమైన వృత్తిలో వుండి ఎంతో ఆదర్శవంతుడిని అని చెప్పుకునే ఈ కొడుకుకి తనకోసమే జీవితాన్ని ధారపోసిన తల్లి చివరి దశలో వుంటే చూసుకోవాల్సిన బాధ్యతా లేదా!! ఇలాంటి కొడుకులకు బుద్ధి చెప్పే చట్టం ఏదైనా వుంటే ఎంత బావుంటుంది!!!! తల్లిని చూడటానికి కుడా పెళ్ళాం అనుమతి తీసుకునే ఇలాంటి కొడుకులున్న మన సమాజం లో కనీస మానవత్వపు విలువలు మంటగలుస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? పెళ్ళాం మీద ఈగ వాలనియని ఈ కొడుకు తన ప్రాణాన్నే ఫణంగా పెట్టి బతికించిన తల్లి ఋణం ప్రపంచంలో ఏ కొడుకు తీర్చుకోనంత బాగా తీర్చుకున్నాడు. మనం రోజు చూస్తూనే ఉన్నాము ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా సభ్య సమాజంలో జరుగుతూనే వున్నాయి కాని వీటికి పరిష్కారం ఏంటో మాత్రం అంతుపట్టడం లేదు……సమాధానం లేని ప్రశ్నలుగానే ఎన్నో జీవితాలు ముగుస్తున్నాయి……….!!

ఏమిచ్చినా తీర్చుకోలేని కల్మషం లేని తల్లి రుణాన్ని వెల కట్టకుండా కొడుకులు కూతుర్లు బాధ్యతలను మరచిపోరని ఆశతో.....

9 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

ఆ.సౌమ్య చెప్పారు...

ప్చ్, ఏమి చెయ్యాలో తెలీడం లేదు. ఇలాంటివాళ్ళు ఎక్కువయిపోయారు ఇప్పుడు. మీరు చెప్పిన చివరి వాక్యం బాగుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

ఇలాంటి వాళ్ళను ఏమి చేయలేకపోతున్నామే అనే బాధ.....మన భాద్యతను గుర్తుచేసుకుందామని ఆ చివరి మాట....నచ్చినందుకు సంతోషం.....

శిశిర చెప్పారు...

చాలా బధాకరమైన సంఘటనండి. మనుషులు బంధాలు, అనుబంధాలు మరచిపోతున్నారు.

చెప్పాలంటే...... చెప్పారు...

ఇప్పుడు బంధాలు, అనుబంధాలు అన్ని డబ్బుతోనే కొలుస్తున్నారు అందరు కాదు కొంతమంది....

అజ్ఞాత చెప్పారు...

అమ్మా - ఇది ఇంటింటి కథ. వ్యవసాయము పల్లెపట్టులు మాత్రమే ఆధారంగా ఉన్న పాతకాలంలో, ఇంకా యంత్రాలు మానవ సంబంధాలకి ప్రత్యామ్నాయం కాని కాలంలో, మనుషులకి మనుషులే తోడు. కుటుంబమే మనిషి అస్తిత్వానికి మూల సూత్రం. అందరూ తలో చెయ్యీ వేస్తేనే గానీ తిండి గింజలు ఇంటికి వచ్చేవి కావు. ఆ కాలంలో సమిష్టి కుటుంబం వినా మరో ఆధారం లేదు - పిల్లలు, పెద్దలు, వృద్ధులూ అందరికీ.

స్వతంత్రం వచ్చాక, పరిశ్రామీకరణ పెరిగాక, తరతరానికీ వలస పోవడం ఒక జీవిత విధానమైనాక, చదువులూ, ఉద్యోగాలూ మనుషులు ఎవరికి వారొక "వ్యక్తిత్వాన్ని" బిల్డప్ చేసుకునే అవకాశాలు వచ్చాక, బాంకులు ఎవరికి వారికో ఎకౌంట్ ఏర్ప్రచుకోవడం నేర్పాక, ఆడవారు వ్యష్టి కుటుంబాలకోసం అందరినీ దూరం చేసుకోవడం మొదలెట్టాక వచ్చిన పర్యవసానాలివి.

ఇది కొద్ది పాటీ సంధి కాలం. ఈ Trends ముందుగా ఊహించని వాళ్ళు పిల్లలే సర్వస్వమనుకొని, రక్తాన్నీ, చెమటనీ, సంపాదననీ అంతా ధారపోసి పిల్లలని పెంచారు. పాతకాలానికైతే ఇది చెల్లిందేమో గానీ, ఈ కాలానిని ఇది చెల్లదనే చెప్ప్పాలి. కొడుకులు తల్లిదండ్రుల బాగోగులు చూడరు. కూతుళ్ళు కొంతలో మిన్న కానీ - వాళ్ళూ ఈ కాలాన్ని బట్టి తమవంతు తాము రాబట్టుకోవాలనే స్వార్థానికేమీ అతీతులు కారు.

ప్రతీ ఇంటా వున్నారిలాంటి ప్రబుద్ధులు. నాకూ ఉన్నారు ఇలాంటి సోదరులిద్దరు. నా పై తరంలో ప్రతీ కుటుంబలోనూ చూశానిది. నా తరంలోనూ ప్రతీ కుటుంబంలోనూ చూశాను.

ఇటీవల వచ్చిన మరో సాంఘిక పరిణామం - ఆడ్వాళ్ళు (అంటే భార్యలు) కూడా ఉద్యోగం చేసి సంపాదించే మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లల బాగోగులూ, ఇంటిపనులు చూసుకోడం కోసం ముసలి తల్లిదండ్రులనీ, అత్తమామలనీ పనివాళ్ళుగా వాడుకోవడం బాగా ప్రబలింది. ఇది మనవల మీది ప్రేమతోనూ, మమకారంకోసమూ వారికోసమే జరుగుతున్న మంచివిషయంగా బయటికి కనబడుతుంది. కానీ పిల్లల్నీ, ఇంటినీ ముసలివాళ్ళకి వదిలి ఊరంతా బలాదూర్ తిరిగే కొడుకు-కోడళ్ళ జంటలనీ, కూతురు-అల్లుళ్ళ జంటలని చాలా మందిని ఎరుగుదును నేను.

- భవదీయుడు

అజ్ఞాత చెప్పారు...

క్షమించండి. వ్యాఖ్య పోస్టు చేశాక నా Browser - "Error! Page Not Found" అని పదే పదే ప్రకటించడంతో Post Button ని పదే పదే నొక్కాను. కానీ తెరవెనకాల అది మళ్ళీ మళ్ళీ నా వ్యాఖ్యని తిరగరాసింది. దయ చేసి ఈ పునరావృతాలని తీసి వేయండి.

- భవదీయుడు

అజ్ఞాత చెప్పారు...

blog lo chusina vari sankya add cheyalante ela andi.this is chakradhar.(http://namanobavalu.blogspot.com)

చెప్పాలంటే...... చెప్పారు...

http://www.wix.com loki velli sign up chesi counter select chesukondi code html gadjet lo paste cheste vastundi.

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా బాగా చెప్పారు అనుబంధాల గురించి.... మీరు చెప్పినది చాలా నిజం ఒకప్పుడు ఎంతో బాగున్నవి ఇప్పుడు ఇలా ఐపోయాయి....

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner