22, అక్టోబర్ 2010, శుక్రవారం

ఆకులో....

నా చిన్నప్పుడు నాకెంతో ఇష్టమైన మేఘసందేశం సినిమా లోని పాట వీలుంటే ఒక్కసారి విని చూడండి ఎంత బావుంటుందో...ఇక్కడ మాత్రం పాట చదవడానికి మాత్రమే...

ఆకులో
ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో
గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజల నీ పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేతినై
పరువంపు విడిచేదే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా
ఆకులో
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా
ఆకులో

10 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అశోక్ పాపాయి చెప్పారు...

manchi paatanu andincharandi.

thinking brain చెప్పారు...

ee pata enduku rasaru?meeku estama?enko sari check cheyandi.ee pata rasindi veturi kadu.jandhyala papaiah shastri anukunta.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు అండి...

చెప్పాలంటే...... చెప్పారు...

నాకు చాలా చాలా ఇష్టమైన పాటల్లో ఈ పాట కుడా ఒకటి...రాసింది వేటూరి గారే...

గీతిక చెప్పారు...

ఇది వ్రాసింది వేటూరి గారు కాదు... దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

Satya Gopal చెప్పారు...

ఈ పాట వ్రాసింది వేటూరి గారు కాదు... దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే..

చెప్పాలంటే...... చెప్పారు...

గూగులమ్మలో చుస్తే వేటూరి గారు అని వుంది పొరపాటుకి క్షమించండి...

చెప్పాలంటే...... చెప్పారు...

ఈ పాట వ్రాసింది ఇద్దరునూ వేటూరి గారు ... దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. మీ అందరి స్పందనకు సంతోషం

Unknown చెప్పారు...

NENU EE PATA BAGA PADATANU TELUSAAAAA...........

చెప్పాలంటే...... చెప్పారు...

నిజమా ఐతే ఎప్పుడూ వినిపిస్తున్నారు నాకు......

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner