28, అక్టోబర్ 2010, గురువారం

ఏ శ్వాస లో చేరితే

నేనున్నాను సినిమాలోని కీరవాణిగారు స్వరపరచిన ఈ పాట చిత్రగారి గళం నుంచి జాలువారింది. తన మనసుని వేణుమాధవునికి ఎంత చక్కగా తెలియపరచినదో.....ఈ పాటలో చూడండి అదేలెండి చదవండి. మనసుకి నచ్చే పాటలు అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతాయి. వాటిని మీతో పంచుకునే ప్రయత్నంలో....అప్పుడప్పుడు ఇలా....

వేణుమాధవా ఆ ..ఆ...వేణు మాధవా.....ఆ ..ఆ..
ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై
ఆ మోవిపై నే మౌనమై
నిను చేరని మాధవా.. ఆ.. ఆ..

శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
చరణం :
మునులకు తెలియని జపములు జరిపినదా .... మురళి సఖి
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువున నిలువునా తొలిచిన గాయమునే తన జన్మకి
తరగని వరముల సిరులని తలచినదా

కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిది వెదురు తానూ పొందింది
వేణు మాధవా నీ సన్నిధి

శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో
చరణం :
చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి
నలు వైపులా నది రాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగులుసడి వినబడక హృదయానికి
అలజడితో ఆణువణువూ తడబడదా
ఆ.. ఆ..ఆ ..ఆ...ఆ..

నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మాది నివేదించు నిముషమిది
వేణు మాధవా నీ సన్నిధి

గ గ రి గ రి స రి గ గ రి రి స రి
గ ప ద సా స ద ప గ రి స రి
గ ప ద ప ద గ ప ద స ద ద ప గ రి గా
గ ప ద స స గ ప ద స స
ద ప ద రి రి ద ప ద రి రి
ద స రి గ రి స రిగా రి స రి గ రి గ రి స రి గా
నీనున్నాను స ద ప గ గ గ పా పా
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప ద రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ
స రి గ ప ద రి గా
రాధికా హృదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

మనసు పలికే చెప్పారు...

నాకు ఈ పాట చాలా చాలా ఇష్టం అండీ..:) సిరివెన్నెల గారి సాహిత్యం కదూ.. వీలుంటే ఒకసారి http://virajaajula-sirivennela.blogspot.com/2010/07/blog-post.html చూడండి..:)

చెప్పాలంటే...... చెప్పారు...

నాక్కుడాను....బోల్డు ఇష్టం. లింక్ చూడటానికి ఇచ్చినందుకు థాంక్ యు....థాంక్ యు

Hima bindu చెప్పారు...

నాకు ప్రాణం ఈ పాటంటే .

హను చెప్పారు...

lyrics chala bagumTayi nijamgaa hatsoff....

అశోక్ పాపాయి చెప్పారు...

వచ్చేశారా అప్పుగారు వచ్చేశార తను సిరివెన్నెల సాహిత్యం ఎక్కడైన ఉంటే చాలు అమంతం వాలిపోతారు.

అశోక్ పాపాయి చెప్పారు...

నేను కూడ అంతేనండి కాని కొంచెం డిఫ్రెంట్ మీరు రాసిన టపాలో చిన్ని కృష్ణుని వేణుగానం వినిపించగానే పరుగేత్తుకుంటు వచ్చాను మరి...చాల మంచి పాటను వినిపించారు మంచి వేణుగానం కూడ....))

చెప్పాలంటే...... చెప్పారు...

అందరికి థాంక్ యు థాంక్ యు....నాకు నచ్చిన పాట మీ అందరికి కుడా ఎంతో....నచ్చినందుకు....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner