13, డిసెంబర్ 2010, సోమవారం

మనసారా...

మొన్ననే మనసారా సినిమా చూసాను. ఓ మామూలు ప్రేమ కధని రవిబాబు తనదైన స్టైల్ లో చాలా బాగా తీసారు. ప్రేమకు అందం,డబ్బు, ధైర్యం...లాంటివి అక్కరలేదు, అందం లేని పిరికి వాడు కుడా ప్రేమను గెలిపించుకోవచ్చు అని ఒక కొత్త తరహాలో తనదైన బాణిలో తెరకెక్కించిన సినిమానే మనసారా...పాటలు కుడా వినసొంపుగా ఎంతో బావున్నాయి. కేరళ లోని అతి ప్రాచీన కళ అయిన కళరి పోటితో మొదలైన సినిమా దానితోనే ముగుస్తుంది. కళరి పోటిలో బంగారు పతకం సాధించిన వాడితో ఓ పిరికి వాడు ప్రేమను గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ మనసారా...సినిమా. చివరి వరకు మాటలు కాని, పాటల సంగీతం కాని, ఫోటోగ్రఫి కాని ఎంత బాగుందంటే....ఎక్కడా అసభ్యత అనేది లేకుండా తీసిన ఓ మంచి సినిమా!!
ఇక్కడ నాకు అర్ధం కాని విష్యం ఒక్కటే....చాలా రివ్యూస్ చూసాను కాని ఒక్కటి కుడా నిజాయితీగా అనిపించలేదు. మరి మంచి సినిమాలకు కుడా సరిగ్గా రాయలేనప్పుడు ఇక ఎందుకో ఈ వెబ్సైట్లు.....!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అశోక్ పాపాయి చెప్పారు...

మేము కూడ చూసి చెపుతాం...:))

చెప్పాలంటే...... చెప్పారు...

తప్పకుండా చూసి చెప్పండి.....-:)

thinking brain చెప్పారు...

meeru chepparuga tappakunda chustanu.aina ee review lu rase vallu baga hype vunna cinemalake baga rastaru.eppudu kottalato cinemalu teese ravi babu gari lanti valla cinemala gurinchi sariga rayaru...

చెప్పాలంటే...... చెప్పారు...

అలా అనే అనిపిస్తోంది సినిమా రివ్యూస్ చూస్తుంటే....బాగున్న దాన్ని కుడా బాలేదని రాయడం ఎందుకో!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner