14, డిసెంబర్ 2010, మంగళవారం

స్వప్నమో కాదో...!!

కలో కలవరమో తెలియని
అయోమయంలో నిదుర కాని
మెలుకువ లోని ఒక స్వప్నం
వేకువలో నిజమయ్యేనా!!
కమ్మని అమ్మ లాలి పాట
నను పరవశింప చేసేనా!!
అమ్మ చల్లని చేతి స్పర్శలోని
వెచ్చదనం నా కందేనా!!
కలైన ఈ కలవరింత లోని
కమ్మదనం, అమ్మదనం అచ్చంగా నాదైతే!!
మెలుకువలోని మరిన్ని నా స్వప్నాలు
వేకువ పొద్దులో నిజమౌతాయి....!!

16 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

జాన్ విన్సెంట్ రాజ్ చెప్పారు...

So Nice.................
Adbutham ga rasaru meeru

జాన్ విన్సెంట్ రాజ్ చెప్పారు...

Amma thanam, kammathanam rendu okate..........

జాన్ విన్సెంట్ రాజ్ చెప్పారు...

Ahsdsthsnsm yokka varam ammathanam :)

చెప్పాలంటే...... చెప్పారు...

విన్సెంట్ గారు,
ముందుగా ధన్యవాదాలు నా కవిత నచ్చినందుకు...అమ్మదనం కమ్మదనం ఒక్కటి కాదండి..కమ్మదనం చాలా వాటిల్లో వుంటుంది..తినే తిండిలో, వినే పాటల్లో, పొందే ప్రేమలో.....ఇలా..కాదంటారా!!

లత చెప్పారు...

చాలా బావుందండీ .
సింపుల్ గా బాగా రాస్తారు మీరు

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా సంతోషం లత గారు నా కవితను, నన్ను మెచ్చుకున్నందుకు....

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలా బాగుందండి.

చెప్పాలంటే...... చెప్పారు...

కవిత నచ్చినందుకు థాంక్ యు వేణు శ్రీకాంత్ గారు

Yogi చెప్పారు...

Chala bagundhi andi mee Kavitha,,

భాను చెప్పారు...

బాగుందండి

కెక్యూబ్ వర్మ చెప్పారు...

మెలుకువలోని మరిన్ని నా స్వప్నాలు
వేకువ పొద్దులో నిజమౌతాయి....!!

కొత్తగా, బాగుందండీ ఫీలింగ్..

చెప్పాలంటే...... చెప్పారు...

నచ్చినందుకు ధన్యవాదాలండి యోగి గారు,కెక్యూబ్ గారు,
భాను గారు

అశోక్ పాపాయి చెప్పారు...

బాగుందండి మీరు రాసిన అమ్మ ప్రేమ

చెప్పాలంటే...... చెప్పారు...

మరి అమ్మప్రేమ ఎప్పుడూ....ఎలా రాసినా బాగుంటుంది....థాంక్ యు నచ్చినందుకు

శోభ చెప్పారు...

"అమ్మ చల్లని చేతి స్పర్శలోని
వెచ్చదనం నా కందేనా!!"... ఎంత అద్భుతమైన వ్యక్తీకరణ.. సూపర్బ్.. చాలా బాగా రాస్తున్నారు.. అభినందనలు..

చెప్పాలంటే...... చెప్పారు...

నా కవిత మీకు అంత బాగా నచ్చినందుకు నా ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner