13, డిసెంబర్ 2010, సోమవారం

తెలుగు బ్లాగుల ద్వితీయ వార్షికోత్సవ కొన్ని కబుర్లు.....

నిన్నటి తెలుగు బ్లాగుల ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా కలిసిన తెలుగు బ్లాగర్లు కొంతమంది...కిందనుంచి కుడినుంచి భార్గవగారు, శ్రీనివాస్ గారు, తాడేపల్లిగారు, నరసింహంగారు, జ్వాలాముఖిగారు, రావుగారు, జ్వాలాముఖి గారి స్నేహితులు, పైన ఎడమ నుంచి శ్రీనివాసరాజు, రహ్మానుద్దిన్ షేక్ గారు, రవిచంద్రగారు, రవిచంద్ర అర్ధాంగి నీలిమ, మంజు, మాలాకుమార్ గారు, ఉమగారు....ఫోటోలో సుజాత గారు లేరు ఎందుకంటే ఆవిడే ఫోటో తీసారు...-:).
కొద్దిగా అంటే బానే ఆలస్యంగా అందరూ వచ్చారు.ముందుగా నేను లోపలి వెళ్ళేటప్పటికే నరసింహం గారు తెలుగు బ్లాగర్ల కోసమా అని అడిగారు.ముందుగా నాకు ముఖ పరిచయం అయినది నరసింహం గారితోనే. చాలా సేపు ఎదురు చూసిన తరువాత రావు గారు పలకరించారు.ఈ లోపల మాలానే అందరికోసం వెతుక్కుంటున్న మాలాకుమార్ గారు కనిపించారు. మా పరిచయాలయిన తరువాత మిగిలిన వాళ్ళు అందరూ కలిసారు. బ్లాగుల గురించి, ఈ తెలుగు స్టాల్ గురించి చర్చించారు. ఆఖరులో జ్యోతిగారు కుడా వచ్చారు....ఇవండీ కృష్ణకాంత్ పార్కులోని నిన్నటి సాయకాలపు కొన్ని కబుర్లు.....

15 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

సుజాత వేల్పూరి చెప్పారు...

అయితే ఈ ఫొటో బాగానే తీశానూ! నా బ్లాగులో పెట్టింది సరిగా రాలేదు.

రాధిక(నాని ) చెప్పారు...

ఇంచక్కా మీరు వెళ్లారు ఆ సమావేశానికి .కాస్త దగ్గర్లో ఐతే నేను వచ్చేదానిని .బాగున్నాది ఫోటో.

thinking brain చెప్పారు...

enti medam moham baga chikkipoyintlundi.sprouts tinandi.health baguntundi.moham lo life vastundi...

Unknown చెప్పారు...

బాగా వ్రాసారండి.నెనర్లు.నేను తిరిగి రైలు అందుకోవాల్సిఉండి త్వరగా వెళ్ళిపోయాను.కాని దురదృష్టవశాత్తూ రైలు కూడా మిస్సయ్యి ఈరోజు జన్మభూమిలో పెద్దాపురం చేరాం.మీకు ఈ పరిచయం వ్రాసినందుకు నా ధన్యవాదాలు

Unknown చెప్పారు...

బాగా వ్రాసారండి.నెనర్లు.నేను తిరిగి రైలు అందుకోవాల్సిఉండి త్వరగా వెళ్ళిపోయాను.కాని దురదృష్టవశాత్తూ రైలు కూడా మిస్సయ్యి ఈరోజు జన్మభూమిలో పెద్దాపురం చేరాం.మీకు ఈ పరిచయం వ్రాసినందుకు నా ధన్యవాదాలు

durgeswara చెప్పారు...

మితృలను కలుసుకునే అవకాశం మిస్సయ్యాను

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు నరసింహం గారు...
సుజాత మీరు ఫోటోలు బాగా తీసారండి...
అందుకే కబుర్లు చెప్పాను మీరు రాలేక పోయారని రాధికా
ఆలోచించే గారు... మీ సలహా పాటించడానికి ప్రయత్నిస్తాను -:)
దుర్గేశ్వర గారు, ఈ సారి మిస్ కాకండి వీలైతే పుస్తక ప్రదర్శనకు రండి...ఈ తెలుగు స్టాల్ కి

TB చెప్పారు...

ledu bane vundi ninna sariga chulledu.em anukokandi...

చెప్పాలంటే...... చెప్పారు...

సరే అండి

మాలా కుమార్ చెప్పారు...

అంతా బాగానే వుంది కానీయండి , ఇలా ఒక చోట బ్లాగర్స్ మీటింగ్ వుంది అని ఓ బానర్ కట్టటమో , లేదా గేట్ దగ్గర , టికెట్ కౌంటర్ లో చెప్పటమో , ఏదో వక ఏర్పాటు చేస్తే బాగుండేది . కనీసం అరగంటైనా వెతికాను ఎక్కడా అని . విసుగొచ్చి తిరిగి వెళ్ళిపోదామనుకునేటప్పటికి మీరు కనిపించారు ! అప్పటికీ 3 గంటలకు అంటే 3.30 కు వచ్చాను ! ఐనా తిప్పలు తప్పలేదు . ఆర్గనైజర్స్ సరిగ్గా ఏర్పాటు చేస్తే బాగుంటుంది .

చెప్పాలంటే...... చెప్పారు...

మళ్ళిసారి ఆ పొరపాటు జరగకుండా చూడాలి. నేను 3.00 కే వచ్చాను, నరసింహం గారు కనిపించ బట్టి సరిపాయింది లేక పొతే తిరిగి వెళ్లి పోయేదాన్ని మాలాగారు.

శోభ చెప్పారు...

సమావేశానికి హాజరైన బ్లాగర్లందరికీ నమస్కారం. దగ్గరగా ఉండినట్లయితే నేనూ తప్పకుండా వచ్చేదాన్ని. అన్నట్టు ఫొటో చాలా బాగా వచ్చింది.. సుజాతగారు చాలా బాగా తీశారు.

శ్రీనివాస కుమార్ సర్.. ఎలా ఉన్నారు? ఫొటోలో మిమ్మల్ని చూడగానే భలే సంతోషం వేసింది. మీ సహచరి, బాబు బాగున్నారా? మీ బ్లాగు అడ్రస్ వీలయితే ఇవ్వగలరు..

చెప్పాలంటే...... చెప్పారు...

రావాలని వుండి రాలేక పోయిన వారి కోసమే ఈ టపా రాసాను....థాంక్ యు శోభా రాజు గారు

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

i missed it

చెప్పాలంటే...... చెప్పారు...

మేము కుడా మిమ్మల్ని మిస్ అయ్యాము అండి...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner