11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

"పాడుతా తీయగా " గురించి....కొన్ని మాటలు

నాకెంతో ఇష్టమైన "పాడుతా తీయగా " మొన్నటి సోమవారం ఎపిసోడ్ చూసాక ఇది రాయకుండా ఉండలేక పోతున్నాను. ఈ టపా ఎవరినైనా బాధ పెడితే క్షమించండి. నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం, వినడం చాలా ఇష్టం. సంగీతం గురించి తెలియదు కాని రేడియోలో వచ్చే లలిత సంగీతం, సాముహిక గేయాలు, బయట ఎవరైనా మంచి పాటలు పాడితే వారి దగ్గర నేర్చుకోవడం, టివిలు వచ్చినంక ఇలా పాటల ప్రోగ్రామ్స్ అన్ని చూడటం అలవాటు.
ఇంతకు ముందు శ్రీ వేటూరి గారు నిర్వహించిన ఈ టివి వారి "పాడుతా తీయగా " లో మొదటి సారి రాఘవేంద్ర పాడటం చూసాను, ఎందుకో తెలియదు పాడే విధానం, విమర్శలను కుడా ఆనందంగా తీసుకోవడం అంత చిన్న వయస్సు లో ఆ పరిణితి నాకు బాగా నచ్చింది. వాడు తనకు నచ్చిన పాటలు పాడతాడు అవి అందరికి నచ్చవు కాని పాటని ఎలా పాడుతున్నాడు, ప్రజెంట్ చేసే విధానం ఎలా వుంది, వాడి వయస్సుకు పాడుతున్న పాటకు ఎంత వరకు న్యాయం చేస్తున్నాడు అని చూడకుండా జడ్జిలకు నచ్చిన పాటలు పాడలేదని మార్కులు తక్కువ వేయడం చూసాను. జి టివి వారు నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో కుడా ఇదే జరిగింది దానిలో అతి వినయానికి కుడా ఎక్కువ మార్కులు వేసారు లెండి.
ఇక మొన్న సోమవారం జరిగిన "పాడుతా తీయగా " చుస్తే అంతకు ముందు రెండు మూడు ఎపిసోడ్లలో ప్రధమంగా నిలిచిన రాఘవేంద్ర మొన్న అంతకు ముందు ఎపిసోడ్లకు కలిపి అందరి కన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్నాడంటే నమ్మశక్యంగా లేదు. మరీ మొన్నటి ఎపిసోడ్లో అందరి కన్నా తక్కువ వచ్చాయి.ఎపిసోడు మొత్తం చూసాను కాని మార్కులు మాత్రం న్యాయంగా వేయలేదు. రాఘవేంద్ర వి మూడు షోస్ చూసాను కాని మొన్న తన మార్కులు విని మొఖంలో ఆ అపనమ్మకాన్ని, ఆశ్చర్యాన్ని చూసి నాకే ఎంతో బాధ వేసింది. బాలు గారిని, ఉష గారిని విమర్శించే అంత సంగీత పరిజ్ఞానం లేక పోవచ్చు కాని పాట వింటుంటే బాగా పాడారో లేదో మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. బాలు గారు కుడా ఇలా పక్షపాతం చుపిస్తున్నారంటే నమ్మలేక పోతున్నాను. దయచేసి మేము ఎంతో అభిమానించే "పాడుతా తీయగా " ని కుడా అన్ని టివి షోల్లా చెయ్య వద్దు. ప్రతిభకు పట్టం కట్టండి కాని పలుకుబడికి, అతివినయానికి మార్కులు వేయవద్దు.
రాఘవేంద్రా!!! నీకు నచ్చే పాటలు కాకుండా జడ్జిలకు నచ్చే పాటలు పాడి వారిని మెప్పించి ప్రధముడిగా రావాలి. ఇంతకు ముందు రెండు సార్లు నీకు రాలేదని నువ్వు, మీ ఇంట్లో వాళ్ళు బాధ పడ్డారో లేదో కుడా నాకు తెలియదు కాని నేను చాలా భాద పడ్డాను...షో మొదలవగానే నీ పాట కోసం ఎదురు చూసే వాళ్ళలో మొదటి దాన్ని, నిన్ను మెచ్చుకుంటుంటే మా పిల్లల్ని మెచ్చుకున్నట్లు గా అనుకుంటాను. కౌసల్య గారు నీతో పాడాలని వుంది ఛాన్స్ వస్తే అంటే ఎంత సంతోషం తో పొంగి పోయానో. కనీసం పోన్లో అయినా అభినందిద్దామంటే నీ నెంబరు తెలియదు. బాగా పాడు గుడ్ లక్....

(ఆదివారం పొద్దుట మళ్ళి వస్తుంది ఈ టివిలో వీలైతే చూడండి)

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

meeru cheppindi nootiki nuru paallu nijam..ide vishyam monna episode avvagaane maa intlo andaram anukunnam...baalu gaaru kuda athi vinayaaniki pramukyam istunnaaru...peru enduku le gaani oka episode lo devadas song paadina candidate meeda koncham ekkuva abhimaanam chupistunnaranipistundi.
Raagavendra chaala baaga paadadutunnadu.. tanu enchukune paatalaku paripurna nyayam chestunnaadu..
last time kuda ilaage jarigindi..RAJESH ane athanu final winner avutaadani evaru uhinchala..aa show lo kuda baalu gaaru modata nundi athani meeda special interest chupinchevaaru...kaneesam ee saari inaa alaa jaraga kudadani asiddam...manaku vaari antha sangeetha gnaanam lekapovachhu kaani prathiba ku anyayam jaragakudadu ...

చెప్పాలంటే...... చెప్పారు...

నా టపాకు మీ కామెంట్ కు ధన్యవాదాలు.... ఈ టివి కుడా ప్రతిభకు న్యాయం చేయడం లేదని మరి మరో సారి కుడా ఋజువు చేసుకుంటుందేమో....చూద్దాం!!

Ennela చెప్పారు...

నేను అర్థం పర్థం లేకుండా మట్లాడితే క్షమించండి..చాలా యేళ్ళ తరవాత పాడుతా తీయగా నెట్లో చూసాను కొన్ని ఎపిసోడ్లు(రాజేష్ గెలిచిన బ్యాచ్ వి)..శ్రీ లక్ష్మి అని ఒకమ్మాయి చివరి దాకా వస్తుంది అనిపించింది..గాలికీ కులమేదీ అని ఎంత బాగా పాడిందో..(మిగిలిన పాటలు కూడా)..ఆ అమ్మాయి ఎందుకు ఎలిమినేట్ అయ్యిందో కూడా అర్థం కాలేదు..నాకు సడెన్ గా ఆసక్తి పోయింది ...మిగిలినది అంతా బాగున్నా, ఎలిమినేషన్స్ సిష్పక్షపాతంగా లేవు అనిపించింది మొత్తం మీద!

voleti చెప్పారు...

పాడుతా తీయగా ఎప్పుడో కలుషితం అయిపోయింది. చెప్పేవాడికి వినేవాడు లోకువ అని బాలు చెప్పే కధలు వినలేక పోతున్నాం. పిల్లల తో ఆటలాడు కుంటున్నారు.. కాదేది కలుషితానికి అనర్హం అని ఇలాంటి మంచి ప్రోగ్రాములు కూడా చెండాలంగా తయారయ్యాయి.

అజ్ఞాత చెప్పారు...

/పిల్లల తో ఆటలాడు కుంటున్నారు.. /
కాక, పెద్దలతో ఆడుకోవాలంటారా? :) :P

చెప్పాలంటే...... చెప్పారు...

అవునండి అందుకే బాధగా వుంది
పిల్లలతో ఏంటండి పెద్దలతో కుడా ఆడుకుంటున్నారుగా

చెప్పాలంటే...... చెప్పారు...

ఎన్నెల గారు మీరు అర్ధం లేకుండా మాట్లాడటం కాదు కరక్టు గానే చెప్పారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner