18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

నువ్వే...నువ్వే...!!

పెదవి దాటని పలుకుల్లో నువ్వే...
గొంతు పలకలేని స్వరం లోనూ నువ్వే...
మదిలో చెలరేగే ఉహల్లో నువ్వే...
మనస్సు పుటల్లో తడిమే జ్ఞాపకమూ నువ్వే...
ఆస్వాదించే ప్రతి అనుభూతి లోనూ నువ్వే...
చిరుగాలి చిరు స్పర్శలో నువ్వే...
చిరునవ్వులో విరిసే పువ్వులలో నువ్వే...
తొలి పొద్దులో నువ్వే...మలి సందెలోనూ నువ్వే...
పున్నమి వెన్నెలలో నువ్వే...
నిశి రాతిరి చీకటిలోనూ నువ్వే...
తొలకరి చినుకుల్లో మెరిసే హరివిల్లులో నువ్వే...
వాసంత సమీరం...వణికించే చలీ నువ్వే...
వేసవి తాపం... గ్రీష్మ రోషం... నువ్వే...
అందెల సవ్వడి నువ్వే...ఆనంద రాగం నువ్వే...
విషాద గీతం నువ్వే...విరచిత కవనం నువ్వే...
నా గెలుపు నువ్వే... నా ఓటమీ నువ్వే...
అనురాగం నువ్వే..ఆత్మీయతా నువ్వే...
ప్రేమా...ప్రాణం...రెండు నువ్వే..
నేనే నువ్వు...అయినా నువ్వు నువ్వే...
నాతోనే ఎప్పుడూ వుండే నువ్వు నువ్వే...!!!

13 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

చాలా చాలా బావుంది మంజు గారూ
నాకు ఖడ్గం సినిమా లోని నువ్వు నువ్వు పాట వెంటనే గుర్తొచ్చింది,
ఇంక మీరు పాటలు రాసెయ్యొచ్చు
ఇది కాంప్లిమెంటేనండోయ్

చెప్పాలంటే...... చెప్పారు...

మీ కాంప్లిమెంట్స్ కి బోల్డు ధన్యవాదాలు లత గారు.....నాకు ఆ పాట చాలా ఇష్టమండి. ఇంక పాటలు రాసేయమంటారా....ఏదో మీ అభిమానం అలా అనిపించేస్తోంది...థాంక్యు

సో మా ర్క చెప్పారు...

మంజు......గారూ! పలుకు పలుకులో....
చలువ పందిళ్ళు పరిచింది.
మీ కవిత.ఇక వేగంగా కొన.........సాగించండి.

Unknown చెప్పారు...

పెదవి దాటని పలుకుల్లో నువ్వే...
గొంతు పలకలేని స్వరం లోనూ నువ్వే...
నాకు చాల చాలా బాగా నచ్చిందండి ..........

చెప్పాలంటే...... చెప్పారు...

సోమార్క గారు,
చాలా సంతోషమండి నచ్చినందుకు
సుందర్ గారు,
థాంక్యు థాంక్యు నచ్చినందుకు :)

గిరీష్ చెప్పారు...

mee blagu chala andam ga undi andi, bommalu chala bagunnai..
me tapaalu kooda bagunnay

చెప్పాలంటే...... చెప్పారు...

అంత బాగా నచ్చినందుకు థాంక్యు గిరీష్ గారు

కెక్యూబ్ వర్మ చెప్పారు...

మీ కవితలు, మీ నిర్మొహమాట విమర్శలు, ఫోటోలు మొత్తమ్మీద బ్లాగు చాలా ఆహ్లాదకరంగా వుందండీ...

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా చాలా సంతోషమండి నచ్చినందుకు కేక్యూబ్ గారు

Time చెప్పారు...

really good...
.
.
.
no words to explain hw good it is...

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా సంతోషం ముక్తేష్ గారు నచ్చినందుకు

Unknown చెప్పారు...

bavundandi..mee nuvve nuvve. Khadgam song lo evi kuda add cheste baguntundemo anipinchindi

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు శైలు నచ్చినందుకు అంత గొప్పగా లేదేమో ఆ పాటా నాకు చాల ఇష్టం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner