22, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఈ.టి.వి లో పాడుతా తీయగా గురించి....

నిన్న రాత్రి .టి.వి లో పాడుతా తీయగా ప్రోగ్రాం చూసిన తరువాత ఇది రాయకుండా ఉండలేక పోతున్నాను. బాలు గారిని విమర్శించే అంత పాండిత్యం నాకు లేదు కాని పిల్లలు పాడిన పాటలను బాలు గారు విమర్శించడం ఎంత మాత్రం సమంజసం కాదు. నచ్చిన పాటలు పాడమని పిల్లలకు చాయిస్ ఇచ్చినప్పుడు పాట మనకు నచ్చిందా లేదా అని చూడకుండా పాటకు...పాడే వారు ఎంత వరకు న్యాయం చేసారో చూస్తే బావుంటుంది లేదా అన్ని బాలు గారికి నచ్చిన పాటలే ఇచ్చి పాడమంటే సరి పోతుంది. దానికి మళ్ళి ఇన్ని తతంగాలు అవసరమా!! అన్ని మనకు నచ్చిన పాటలే వుండవు కదా!! అంత మాత్రాన ఆ పాటలు పాడటం బాలేదు అంటే ఎలా? పాటని ప్రజెంట్ చేయడం లో కాని పాడటం లో కాని లోపాలుంటే చెప్పాలి కాని పాటనే బాలేదు అంటే...అది కరక్ట్ కాదు. మన ఇష్టాలు, అభిరుచులు అందరికి అలానే ఉండాలంటే ఎలా వీలవుతుంది? పాటలను, సాహిత్యాన్ని ఎంచడం మాని పాడే పాటకు ఎంత వరకు న్యాయం చేస్తున్నారు అని బాలు గారు చుస్తే బావుంటుంది.....

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

తన ఫీలింగ్స్ చెప్పడంలో తప్పు ఏమీ లేదు గాని ఈ సారి కొంచెం అతి అని మాకూ అనిపించింది.....

Vijay Bhaskar చెప్పారు...

ఆయనకున్న హక్కుని కాదనలేం కాని, నిన్న కొంచం నాకూ అతిగానే అనిపించింది. ఈ పోటీల్లో సాధారణం గా, డైరెక్టర్ ఓకే చేసాకే పిల్లలు ఆ పాటలు పాడటం జరుగుతుంది. వాళ్లకి ఒక లాంటి పాటలు వద్దు అనుకున్నప్పుడు ఆ స్థాయిలోనే ఫిల్టర్ చేస్తే సరి. పసి వాళ్ళు అంతకష్ట పడి పాడాక, ఇదో చెత్త పాట, మీరు బానే పాడారు.. అనడం సమంజసం కాదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, "పంచ దార బొమ్మ" పాటని, భువన చంద్ర రాసినట్టు ప్రస్తావించారు బాలు, నిజానికి ఆ పాటను రాసింది చంద్ర బోస్.

sneha చెప్పారు...

మీరన్నది నిజమే

చెప్పాలంటే...... చెప్పారు...

ప్రోగ్రాం లో ఆ అతి బాగా ఎక్కువ చేస్తున్నారు అదే బాలేదు. ప్రతి పాట అందరికి నచ్చాలని లేదుగా ఎలా పాడారో చూసి సలహా ఇస్తే ఆయన పెద్దరికానికి విలువ వుంటుంది

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు చెప్పింది నిజమేనండి విజయ్ భాస్కర్ గారు పాట ఇష్టం లేనప్పుడు ముందే చెప్పొచ్చుగా..అదే అందరమూ అనుకునేది. బాలు గారికే ఈ పాట ఎవరు రాసారో సరిగ్గా తెలియనప్పుడు ఇంక మనం చేయగలిగినది ఏముంది? :)

చెప్పాలంటే...... చెప్పారు...

నిజానికి ఓటు వేసినందుకు థాంక్యు స్నేహా...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner