23, ఫిబ్రవరి 2011, బుధవారం

ఆ క్షణం....!!

నిశ్శబ్దం నీకు నాకు మద్యన
నిను తలవని క్షణమే లేదు నా ఊసులలో
మరలి రానంటోంది మనసు నీ నుండి దూరంగా
దూరమైనా దగ్గరైనా నీతోనే నేను..నాతోనే నువ్వు
దిగంతాల దూరమైనా పక్కనున్న క్షణమైనా
నీ సమక్షంలోనే ఎప్పుడూ...
నీ చుట్టూనే నిరంతరం...
నేనెవ్వరో మరచిన ఆ క్షణం నుంచి...ఈ క్షణం వరకు
నన్ను నేను చూసుకుందామంటే
కనిపించని నేను...కనుల ఎదుట నువ్వు
నేనే నువ్వై....నా అస్థిత్వాన్ని కోల్పోయానని
నీకు తెలిసేదెన్నడో!!

10 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

చాలా బావుందండీ

చెప్పాలంటే...... చెప్పారు...

:) థాంక్యు లతా

luksss meee చెప్పారు...

nice.......
naaku chaaala nachindi :)

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు అండి...:)

మాలా కుమార్ చెప్పారు...

బాగుందండి .

చెప్పాలంటే...... చెప్పారు...

కవిత నచ్చినందుకు చాలా చాలా .. థాంక్యులు థాంక్యులు మాలా గారు

thinking brain చెప్పారు...

nice poetry.carry on..

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు

, చెప్పారు...

నిశ్చబ్దం anna word cusi...anthe!
----------------------------

నువ్వు నిశ్చబ్దమైనపుడు నాలో నువ్వు శబ్దమవుతున్నావ్!
గుండె గగనతలమంతా ఎడతెగని మహా విస్ఫోటనాలతో పగులుతున్నపుడు,
విశ్వాంతరాళాల్లోకి నల్లని వానరాతిరిలా పరుచుకుంటోన్న యేదో రహస్యం లాంటి నిశ్చబ్దం.

జీవితానికావలితీరాలనుంచి స్తబ్దతా గీతాలు నిశ్చబ్దంగా ప్రవహిస్తో శబ్దం నిశ్చలమవుతో నిశ్చబ్దమై నన్ను ఆపాదమస్తకం అలుముకుంటోంది.

చెలీ!
ఏ నిశ్చబ్దశబ్ద ప్రకంపనాల మధ్య
ఏమిటి నీకళ్లు చెమ్మగిల్లుతున్నాయ్.

నువ్వూ నేననే మహా రూపోత్సవపు స్వప్నాలన్నీ శబ్దమవుతున్న వేళ
నీ నిశ్చబ్ద మహా భినిష్క్రమణం వేళ కాని వేళ !

దహాస్!
నువ్వు నిశ్చబ్దమైన వేళ
నా గుండె దహించిన మృత్యు హేల !

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా చాలా బావుంది మాటలు లేవు మీ కవిత చూసి ఎంత బాగారాసారో!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner