28, ఫిబ్రవరి 2011, సోమవారం
ఆలంబన!!
అలజడి రేపిన కలవరంలో
అప్పుడప్పుడు పలకరించే నీ పిలుపు
అలసిన మనసుకు ఆలంబన!!
అలల తాకిడికి చెల్లాచెదురైన
ఆలోచనలు మేలి ముత్యాలుగా
తీరాన్ని చేరాలంటే నీ దోసిలే
స్వాతి చినుకుల ఆల్చిప్ప!!
పడిలేచే కడలి కెరటం
గెలుపు ఓటములకు సాక్ష్యమైతే
గెలిచే వరకు ఓటమిని ఆస్వాదిస్తూ
ఓటమి పాఠంతో గెలుపు బావుటా
ఎగరేయమని ధైర్య స్తైర్యాలనిచ్చిన
నీ పలుకుల వాడి,వేడి సెగలు
అనుక్షణం సాధించాల్సిన లక్ష్యాన్ని
గుర్తు చేస్తూనే వుంటాయి......!!
అప్పుడప్పుడు పలకరించే నీ పిలుపు
అలసిన మనసుకు ఆలంబన!!
అలల తాకిడికి చెల్లాచెదురైన
ఆలోచనలు మేలి ముత్యాలుగా
తీరాన్ని చేరాలంటే నీ దోసిలే
స్వాతి చినుకుల ఆల్చిప్ప!!
పడిలేచే కడలి కెరటం
గెలుపు ఓటములకు సాక్ష్యమైతే
గెలిచే వరకు ఓటమిని ఆస్వాదిస్తూ
ఓటమి పాఠంతో గెలుపు బావుటా
ఎగరేయమని ధైర్య స్తైర్యాలనిచ్చిన
నీ పలుకుల వాడి,వేడి సెగలు
అనుక్షణం సాధించాల్సిన లక్ష్యాన్ని
గుర్తు చేస్తూనే వుంటాయి......!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
very good expression..chala bagundi
మీ కవితలు అన్నీ చాలా బావుంటున్నాయండీ.చాలా బాగా రాస్తున్నారు
మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషం గా వుంది ప్రవీణగారు లత గారు థాంక్యు
meeru rase kavitalanninti lo edo teliayani badha dagi vunnatluga anpistuntundi.adi badha leka bhavala valaka pota?kavitvam bavuntundi.kani dani venaka edo antarleenamga mee vyaktigatam vunda anpistundi.kani pata bhavalani sari kotta vidhamga rastaru...
నాకేం బాధ లేదు నాకు ఎలా రాయాలని అనిపిస్తే అప్పటికీ అలా వస్తుంది అంతే. నాకు వ్యక్తిగతమైన భావాలని కవితల్లో రాయడం కాదు నాకు అనిపించింది రాస్తూ వుంటాను అంతే.....నచ్చినందుకు థాంక్యు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి