24, ఫిబ్రవరి 2011, గురువారం

కొన్ని పరిచయాలు.....అలా...

మేము చదువుకునేటప్పుడు ఇప్పటిలా ఈ మెయిల్స్, బ్లాగులు, బజ్జులు,సెల్ పోనులు, ఎస్.ఎం.ఎస్ మెసేజ్ లు లేవు. ఉత్తరాలు మాత్రమే ఉండేవి, అదీ మా ఊరిలో అయితే పోస్టు ఆఫీసు కుడా లేదు. వేరే ఊరు వెళ్లి పోస్టు చేయాలి. ఉత్తరం వస్తే మాత్రం ఇంటికి తెచ్చి ఇచ్చేవారు పోస్టుమాన్. నాకు ముగ్గురు కలం స్నేహితులు అదేనండి పెన్ ప్రెండ్స్ వుండేవారు. నా చిన్నప్పటి నేస్తానికి నేస్తం ఒకరు, ఆ నేస్తం నేస్తం మరొకరు, ఇంకొకరు నా ఇంజనీరింగ్ ప్రెండ్ ఉత్తరం రాస్తే అదీ వేరే ఊరు వెళ్లి, వాళ్ళు అది చూసి పక్కన పడేయకుండా జాగ్రత్తగా మళ్ళి నాకు పంపుతూ మరో ఉత్తరం దానితో పాటు రాసారు. అలా అయిన కలం స్నేహం చాలా రోజుల వరకు నడిచింది. ఇప్పుడు ఎక్కడ వుందో తెలియదు.
ఇక నా చిన్నప్పటి నేస్తం నేస్తం గురించి అయితే ఎనిమిది సంవత్సరాలు చూడకుండా రాసుకున్న ఉత్తరాలు, చెప్పుకున్న కబుర్లు, పోట్లాటలు, కవితలు ఇలా ఎన్నో....!! చిన్ననాటి నేస్తం పెళ్ళికి వెళ్ళినప్పుడు చూడటం నిజంగా ఆ రోజు ఎంత బాగుందో!! తరువాత నా పెళ్ళికి రావడం, మళ్ళి నా కోసం తన నేస్తం తో కలిసి రావడం....ఒక్కోసారి ఇవన్ని గుర్తువస్తోంటే భలే వుంది. నిజంగానే కొన్ని పరిచయాలు అలా మంచి జ్ఞాపకంలోని అనుభూతిగా మిగిలిపోతాయి.

9 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

sivaprasad చెప్పారు...

konni parichayalu anthe :)

చెప్పాలంటే...... చెప్పారు...

అవును....మధురమైన అనుభూతి గా మిగిలిపోతాయి ఎప్పటికీ...థాంక్యు శివా!!

లత చెప్పారు...

ఎన్నేళ్ళైనా స్నేహం అలా పలకరిస్తూనే ఉంటుంది.బావున్నాయి మీ కబుర్లు

చెప్పాలంటే...... చెప్పారు...

దేవుడు ఏదో మర్చిపోయాను అనుకుంటూ స్నేహబంధాన్ని మనకిచ్చాడు అందుకు దేవుడికి థాంక్స్ చెప్పాలి...థాంక్యు లత గారు

గిరీష్ చెప్పారు...

ur right but avi andariki undatam kastam ee rojullo..

sneha చెప్పారు...

మీరుపెట్టే ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి మీ కబురలకు మల్లే

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు అన్నది నిజమేనండి గిరీష్ గారు కొందరిదే ఆ అదృష్టం

చెప్పాలంటే...... చెప్పారు...

అవునా స్నేహా...-:) థాంక్యు కాంప్లిమెంట్స్ కి

veera murthy (satya) చెప్పారు...

manju garu namste!

కవితా పోటీకి ఆహ్వానం


http://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html

i will expect a kavitha from you too maDam!

మీ సత్య.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner