9, జూన్ 2011, గురువారం

ఓటమి అంటే భయం ఎందుకు???

ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయితో అన్నాడు "ఎనిమిది ఏళ్ల నుంచి లవ్ చేస్తున్నాను నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎలా?? " అని... కాని ఆ అమ్మాయికి అప్పటివరకు ఆ విష్యం తెలియదు. ఇక్కడ అర్ధం కాని విష్యం ఏంటంటే ప్రేమించడం తప్పు కాదు ఆ విష్యం చెప్పకుండా ఎదుటివాళ్ళని అనడం ఎంతవరకు సబబు? అయినా మనం ప్రేమించినంత మాత్రాన వాళ్ళు కుడా మనని ఇష్టపడాలని లేదుకదా!! ఇంత చిన్న విష్యం అర్ధంకాక ఎన్నో చావులు, విరోదాలు....ప్రేమ విఫలమైనంత మాత్రాన జీవితమే లేకుండా పోతుందా!! కోరుకున్నవాళ్ళు దొరకలేదని మనకోసం ఉన్నవాళ్ళని ఏడిపిస్తూ, అడ్డదారులు తొక్కుతూ నీ మూలంగానే నేను ఇలా ఐపోయాను అనడం ఎంత వరకు కరక్ట్??
మన తప్పులకి కారణాలు ఎదుటివాళ్ళ మీదకి నెట్టకుండా ఎక్కడ తప్పు చేసామా అని ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే అనుమానాలు, అపార్ధాలు చాలా వరకు వుండవు. ప్రేమలో ఫెయిల్ అని, వ్యాపారంలో నష్టాలని, ఉద్యోగం పోయిందని, అమ్మ తిట్టిందని, నాన్న కోప్పడ్డారని, పరీక్షలో ఫెయిల్ అని, మంచి రాంక్ రాలేదని ఇలా ప్రతి చిన్న కారణానికి కుడా చావడం సరి కాదు. ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి సవాలక్ష సమస్యలు ఎదురవుతూ వుంటాయి. సమస్య వచ్చిందని భయపడుతూ దానికి తలవంచి చావే శరణ్యం అనుకుంటే ప్రపంచంలో ఒక్కరికి కుడా బతికే అవకాశమే లేదు. పుట్టినందుకు మనకి మనం సమాధానం చెప్పుకుంటూ మనని నమ్మి మనతో వున్న వారికి, చేతనైతే కొద్దో గొప్పో సమాజానికి మేలు చేయగలిగితే అంత కన్నా మంచి పని మరొకటి వుండదు. మనకు నచ్చిన దారిలో ముందు మనం ఒక్కరమే ఉంటాము... అయ్యో ఒక్కళ్ళమే కదా ఏమి చెయ్యలేమేమో అని అనుకుంటే ఈ రోజు ఓ మదర్ తెరీసానీ గాని, ఓ మాహాత్ముని గాని... ఇలా ఎంతోమంది గొప్పవారిని చూసి వుండేవాళ్ళము కాదు. ఎన్నో ప్రయోగాలు ఫలించక పోయినా నిరంతరం సాధన చేసి ఈ రోజు మన నిత్యావసరాలలో భాగమైన కరంట్ బల్బు, గ్రామ్ ఫోన్ లాంటివి ఎడిసన్ కనుక్కొగలిగేవారా!! పడిపోయామని అలానే వుండి పొతే అక్కడే ఉంటాము లేచి నిలబడి ఎందుకు పడిపోయామో చూసుకుని మళ్ళి మన పని మొదలు పెట్టడమే!! ప్రయత్నించకుండా ఏది మన దగ్గరకు రాదు. చేతనైతే దగ్గరకు తెచ్చుకోవాలి లేదా మనమే దాని దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. సాధన, సంకల్పబలం వుంటే అసాధ్యం కుడా సుసాధ్యం అవుతుంది . ఎందుకు విఫలమయ్యామని కాకుండా ఎందుకు సఫలం కాలేమని అనుక్కుంటే అన్ని మనవే....మొన్నటి ప్రపంచకప్ లా!! కలలు కనడం తప్పు కాదు వాటిని నిజం చేసుకోడానికి ప్రయత్నించక పోవడమే జీవితంలో మనం చేసే మొదటి తప్పు అని ఎక్కడో చదివిన జ్ఞాపకం. ఓటమికి భయపడకుండా గెలవాలని తపన వుంటే అదే మన గెలుపుకి మొదటిమెట్టు అవుతుంది....విజయసోపానానికి బాటలు వేస్తుంది.

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Yagna చెప్పారు...

"ఎనిమిది ఏళ్ల నుంచి లవ్ చేస్తున్నాను నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎలా?? " అని... కాని ఆ అమ్మాయికి అప్పటివరకు ఆ విష్యం తెలియదు." This is hypocrisy. How can a gal/boy ignorant of other's feelings for such a long time?

Yagna చెప్పారు...

Very good post...

luksss meee చెప్పారు...

wish every1 could think and realise like u said......

చెప్పాలంటే...... చెప్పారు...

ఆ అమ్మాయికి చెప్తే కదా తెలిసేది చెప్పకుండా ఎలా తెలుస్తుంది? మన మనసులోది చెప్పక పొతే ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయికి అలా ఇష్టం వుంది ఉండక పోవచ్చు కదా
ఏదైనా కానివ్వండి మీ కామెంట్స్ కి నా ధన్యవాదాలు యజ్న గారు
లుక్స్స్ మీ గారు థాంక్యు అండి

vijay చెప్పారు...

మీ పోష్టు చదువుతుంటే నాకు భద్రాచలం చిత్రం లో సుద్దాల అశోక్ తేజ గారు రచించిన"కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ ఏమైన గానీ ఎదురేది రానీ ఓడిపోవద్దు రాజీపడొద్దు" పాట జ్ఞాపకం వస్తున్నది.

చెప్పాలంటే...... చెప్పారు...

మీకు అంత మంచి పాట గుర్తు వచ్చిందంటే అది నా అదృష్టం అనుకోవాలి విజయ్ చాలా థాంక్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner