1, జులై 2011, శుక్రవారం

ఏం చేయను..???

నిశిరాతిరి నిద్ర ముంచుకొస్తుంటే....
కరిగిపోయిన కాలంలో నుంచి
చెరిగిపోని ఓ జ్ఞాపకం కవితలా అల్లుకుంటుంటే...
నిద్రదేవత వడిలో సేద తీరాలా!! ...లేక....
కలలోకొచ్చిన జ్ఞాపకంలో కరిగిపోవాలా!!
మదిలో పొంగే కవితావేశాన్ని ముత్యాలాక్షరాల్లో
నింపడానికి కాలమనే కాన్వాసుపై పొందుపరుద్దామంటే.... !!
నిద్రాదేవత కరుణించి నిశిధి ఒడిలో సేదదిర్చుకోమని అక్కున జేర్చుకుంది........
( ఇది నా ఫ్రెండ్ రాసిన కవిత......)

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vijay చెప్పారు...

మీ కవితలుకు తగ్గ ఫోటోలు సంపాయిస్తున్నారో, లేక ఫోటో సంపాయించిన తరువాత కవితలు వ్రాస్తున్నారో తెలియడం లేదు. రెండూ బావుంటాన్నాయి. మీ కలెక్సన్/ క్రియేషన్ చాలా అద్బుతం. ఇంతకీ మీరు ఫోటోలు ఎక్కడ సంపాయిస్తున్నారు. ఆ రహస్యం చెప్పండి ప్లీజ్.

చెప్పాలంటే...... చెప్పారు...

నా కవితలు ఫోటోలు నచ్చుతున్నందుకు చాలా చాలా సంతోషం విజయ్ గారు కవిత రాసిన తరువాతే ఫోటో వెదుకుతాను కాక పొతే నాకు కావాల్సినట్లు గా మార్చుకుంటాను అంతే అండి....

సుభ/subha చెప్పారు...

హల్లొ బాగున్నారా? మీ పేరు తెలియదు నాకు. కాని మీరు రాసే కవితలు చాలా బాగుంటాయ్. మీ కథ కూడ బాగుంటోంది. ఇంకా చదవాలి లెండి. మీ ఫ్రెండ్ కవిత కూడా బాగుంది.

జవహర్ బాబు చెప్పారు...

చాలా బాగుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు అండి శుభ గారు నా పేరు మంజు ....నా కవితలు నా ఫ్రెండ్ కవిత నచ్చినందుకు చాలా సంతోషం . కధ కుడా నచ్చినందుకు ధన్యవాదాలు

చెప్పాలంటే...... చెప్పారు...

-:) థాంక్యు జవహర్ బాబు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner