28, ఆగస్టు 2011, ఆదివారం

లాంగ్ లాంగ్ ఎగో అని.....మన క్రికెట్ చరిత్ర గత చరిత్ర గానే మిగలనుందా!!

మన వాళ్ళ సత్తా ఏంటో టెస్ట్ క్రికెట్లో బాగా చూసేసాము. కనీసం ఒక మాచ్ అయినా డ్రా చేస్తారేమో అనుకున్న అభిమానుల ఆశలు అడియాశలు చేసేసారు మన క్రికెట్ దేవుళ్ళు, రాజులు, రారాజులు. ఎన్నో అవార్డులు రివార్డులు మరింకెన్నో రికార్డులు సాధించిన మన టెస్ట్ క్రికెట్ చరిత్ర ఇంగ్లాండ్ ఆటతో తుడిచిపెట్టుకు పోయింది.
ఆటలో గెలుపు ఓటములు సహజమే. ఆడిన ప్రతి ఆట గెలవలేము కాని కనీసం క్రికెట్ ఆట రానట్టుగా ఆడి ఓడిపోవటమెంత సిగ్గు చేటొ ఇప్పటికయినా అర్ధం అయితే చాలు మన వాళ్లకు. అందరూ గెలవడానికి కారణాలు వెదుక్కుంటే మన టీం ఇండియా మాత్రం టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ రాంక్ కోల్పోవడానికి సవాలక్ష కారణాలు వెదికింది.
ఆట చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది ఎంతబాగా ఓడిపోవడానికి ఆడారో మన టీం ఇండియా. ప్రతి ఒక్కరు దేశం కోసం ఆడితే గెలవాలన్న తపన, కాంక్ష వుంటుంది. డబ్బుల కోసం వ్యక్తిగత రికార్డుల కోసం ఆడితే ఇలానే ఓటమి తప్పదు.
నెంబర్ ఒన్ టీం ఆడే ఆటలా ఆడలేదు కనీసం ప్రతిఘటించలేదు. ఆటను ఆస్వాదిన్చలేనప్పుడు క్రీజులో ఉండలేనప్పుడు టీం నుంచి స్వచ్చందంగా తప్పుకోండి...అంతే కాని పరువు తీయకండి. మీరు ఆడిన ఆటను మీరే ఒక్కసారి రీప్లే లో చూసుకుని ఆత్మవంచన చేసుకోకుండా నిజాన్ని ఒప్పుకుని నిజాయితీగా ఆడండి......టెస్ట్ క్రికెట్ లో ఆడలేరు సరే కనీసం ట్వంటి ట్వంటి లానో....లేదా ఒన్ డే లానో ఆడితే కాస్త అయినా పరువు దక్కేది...మనవాళ్ళకు కుడా క్రికెట్ ఆడటం వచ్చు అని. ఆడలేనప్పుడు తప్పుకోండి స్వచ్ఛందంగా అంతే కాని గత చరిత్ర ఘన చరిత్ర వున్న భారతీయ క్రికెట్ నీ నవ్వులపాలు చేయకండి.....ఒన్డే సిరీస్ అయినా గెలిచి కాస్త క్రికెట్ అభిమానుల గుండెల్లో ఆనందం నింపండి.

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vijay చెప్పారు...

ఈ విషయములో మీతో ఏకీబవించలేను.

అజ్ఞాత చెప్పారు...

ఈ మధ్య ఒక సినిమాలో హీరో అంటాడు.."సలహాలివ్వడానికి ఇండియా అంతా ఉంది. కానీ సరిగ్గా ఆడాల్సిన వాడు పదకొండు మంది" అని! ఆడేవాళ్లకు తెలుస్తుంది ఆ ఒత్తిడి, శ్రమ, పరిస్థితిని బట్టి వ్యూహాలు మార్చుకోవడం ఇవన్నీ! మన దౌర్భాగ్యం ఏమిటంటే మన దేశంలో మనుషులు "అభిమానుల ఆశలకు అనుగుణంగా ఆడాలని" ఆశించడం ఏమిటో దౌర్భాగ్యం!

బాగానే చెప్పారు నీతులు, గట్టున కూచుని!

అజ్ఞాత చెప్పారు...

మీరు ఒక్కటి గుర్తు పెట్టుకొవాలి, ఇదే టీము మొన్నటి వరకు నెం 1 ర్యాంక్ లో వున్నది
ఆట రాకుండానే, ఆడకుండానే వచ్చిందా ఆ ర్యాంకు?

చెప్పాలంటే...... చెప్పారు...

అది మీ ఇష్టం మనవాళ్ళ ఆట తీరును చూసి అనిపించింది రాసాను...

ఆట రాక కాదు సత్తా లేక కాదు అదే కదా నా బాధ మొన్నటి వరకు నెంబర్ ఒన్. నెంబర్ ఒన్ ఆట తీరు ఎలా వుందో ఇప్పుడు చూసారా అని కనీసం పోరాడలేదు చివరి వరకు. ఆడిన ప్రతి ఆట గెలవాలని కాదు చాతకాని వాళ్ళు ఆడినట్లు ఆడారని.

అభిమానుల ఆసలకు అనుగుణంగా ఆడాలని కాదు గెలవలేక పోయినా ఓ మంచి ఆట
చూసామనిపించాలి. ప్రపంచ నెంబర్ ఒన్ టీం ఆట ఆటలా వుండాలి

చెప్పాలంటే...... చెప్పారు...

ఒత్తిడి శ్రమ లేకుండా సునాయాసంగా గెలవాలంటే పనికిరాని టీం ఏదైనా వుంటే దానితో ఆడితే సరి.

చెప్పాలంటే...... చెప్పారు...

నీతులు చెప్పలేదు ఆటని ఆటలా ఆడమని అడిగాను మీకు అలా అర్ధం అయితే నేనేం చేయలేను...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner