6, మే 2012, ఆదివారం

నిన్నేమని పిలవాలి..??

జీవితాన్నిచ్చిన జీవికి జీవితమే లేకుండా చేస్తే..??
మనిషిగా నిలబెట్టిన మనిషిని మరణానికి దగ్గరగా చేరిస్తే..??
వెలకట్టలేని విలువను ఆపాదించిన వారిని వెలివేస్తే..??
ఏమి లేని..ఎవరు లేని నీకు అన్ని తానైతే...!!
అన్ని వున్న తనని.....
ఏమి లేకుండా...ఎవరు లేకుండా చేస్తే...??
నీ కోసం అన్ని వదులుకున్న మనిషికి
నువ్వు ఏమి లేకుండా చేస్తే...??
నీ కోసమే తను జీవిస్తుంటే.....!!
తనకోసం తప్ప అందరి కోసం పరితపించే
నిన్ను ఏమని పిలవాలి..?? ఎవరని అనుకోవాలి...??

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నా అనుకున్న వాళ్ళ నిర్లక్ష్యం నిజంగా చాలా బాధిస్తుందండీ..
కవిత చిన్నదైనా భావం బాగుంది..

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు రాజి
నిజాలు ఎప్పుడూ బాధగానే వుంటాయి కదా!!

అజ్ఞాత చెప్పారు...

painful

చెప్పాలంటే...... చెప్పారు...

అవునండి....

జలతారు వెన్నెల చెప్పారు...

మంజు గారు, విలువని గుర్తించలేని వారితో జీవితం ఒక నరకం.

Kalyan చెప్పారు...

@మంజు గారు అలా ఉండగల వ్యక్తి ఇప్పటివరకు నాకు తెలిసి అమ్మ ఒక్కటే....కాబట్టి అమ్మ అనే పిలవాలి...మనలో స్వార్ధాన్ని తన నిస్వార్ధంగా ఆస్వాదించే గొప్ప జీవి...మన సంతోషాన్నే తన నీడగా భావించే పిచ్చి తల్లి...తను కన్నీరు కారుస్తున్నా మన కన్నీరు చూడలేను బలహీనురాలు....అందుకేనేమో తనను సులువుగా మోసగించవచ్చు....ఇంక ఏ బంధమైనా తల్లిలా రాదనే నే చెప్పగలను....ఎందుకంటే ఎవరితో మనం గడిపినా సరే ఓ తొమ్మిది మాసాలు ఎక్కువనే తల్లితో గడిపుంటాము....ఇది చదివిన వెంటనే అమ్మనే గుర్తోచింది నాకు ... బాగా విశ్లేషించారు ఆ జీవిని మీ పదాలతో ....

చెప్పాలంటే...... చెప్పారు...

జలతారువెన్నెల గారు,

నరకమే అంటారా!! ఏమో మరి.....మారతారని ఆశతో జీవిస్తున్నారేమో..!!

కళ్యాణ్ గారు అమ్మకు మాత్రమే చాతనైనది....అమ్మ మాత్రమే చేయగలిగినది

థాంక్యు కళ్యాణ్, వెన్నెలా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner