10, మే 2012, గురువారం
సమస్య....??
మనలో చాలా మంది ఆనుకుంటూ వుంటారు "నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు" "నన్నే ఇబ్బంది పెడుతున్నారు, నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు" అని....కాని పడే వాళ్లకు తెలుస్తుంది ఇబ్బంది పడుతున్నారో..!! బాద పడుతున్నారో..!! పెద్దలు లేకుండా మనం ఈరొజు లేము. పిల్లలు చూడని పెద్దల గురించే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము కాని కొంత మంది పెద్దలు కూడా పిల్లలను బాదపెట్టాలని అనుకోకుండా అంటే వాళ్లకు తెలియకుండా తెలిసి ఇబ్బంది పెడుతూనే వుంటారు...చెప్తే ఏమనుకుంటారో చెప్పక పొతే ఇంకా ఎక్కువ అవుతుందేమో..!! అని పిల్లలు...పట్టించుకోవడం లేదని పెద్దలు...అన్ని చేస్తున్నాము కదా ఇంకా ఎందుకు
అసంతృప్తి అనుకుంటూ పెద్దల అసహనానికి కారణాలు తెలియక అయోమయంలో వుంటారు.పెద్దలు పిల్లలకు మార్గ దర్శకులుగా మంచి దారిలో నడిపించాలి. పిల్లలు పెద్దలు చూపిన దారిలో నడవాలి....కాని ....సమస్య వస్తే పెద్దల సలహా తీసుకునే పిల్లలకు పెద్దలే సమస్యగా మారితే..??
ఇలా ఏమి తెలియని...ఏమి చేయలేని ఆచేతనావస్థలో కొట్టుమిట్టాడుతున్న కొన్ని జీవితాలు ఏ ముగింపుకు చేరతాయో..!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
నిజమే!కొంత మందికి వయసుతో పాటు maturity ఉండదు. నాకు కూడా అనుభవమే!
అవును వెన్నెల ఏమి చేయలేము వాళ్ళని భరించడం తప్ప..!!
మంజు గారూ ఎవరి సమస్య వారికి పెద్దదిగానే కనిపిస్తుందేమో కదా.. ఎదుటి వాళ్ళ స్థానం లో మనం వుండి ఆలోచిస్తే ఆ సమస్య మనకి అర్ధం అవుతుంది అంటారు కానీ అది సాధ్యమేనంటారా??
ఇప్పడు మీరు చెప్పిన పెద్దల్లాంటి వాళ్ళ గురించే ఒక నవల్ వచ్చిందండీ కొన్నాళ్ళ క్రితం "వూరు పొమ్మంటుంది" అని.. కానీ రైటర్ ఎవరో కొత్త వాళ్ళు..
ఆ నవల చూసినట్లే గుర్తు నాకూను రచయితా పేరు నాకు గుర్తు లేదు
మన స్థానం లో వుంది చూస్తామే కాని ఎదుటి వాళ్ళ స్థానం లోకి వెళ్లి చూడలేము.....చూడగలము అనుకుంటాము కాని ఒడ్డున వుంది సలహాలు చెప్పగాలమే కాని లోపలి దిగలేము కదా ఏదైనా మనవరకు వస్తేనే ఆ బాధ తెలుస్తుంది రాజి....
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి