13, మే 2012, ఆదివారం
అమ్మ ఋణం....!!
అమ్మల రోజు అని సంవత్సరానికి ఒక రోజు గుర్తు చేసుకోవడం కాకుండా....
మన ప్రేమనంతా ఆ ఒక్క రోజుకే పరిమితం చేయకుండా....
మన ప్రేమను రాతలకు బొమ్మలకు పరిమితం చేయకుండా...
వెలకట్టలేని విలువైన దేవుడిచ్చిన ఎనలేని సంపద అమ్మ...
తను కరిగిపోతూ మనకు జీవితాన్నిచ్చేది అమ్మ..
ప్రతి క్షణం అమ్మను అమ్మగానే చూసుకుందాం....
ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది ఆమ్మ ఋణం...
అది ఎప్పటికీ తీరని రుణమే...!!
ప్రపంచం లోని ప్రతి తల్లికి వందనం....!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
9 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
"ప్రతి క్షణం అమ్మను అమ్మగానే చూసుకుందాం..."
మంజు గారూ.. మంచి మాట చెప్పారండీ
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
"ఎన్ని జన్మలెత్తినా తీర్చులోలేనిది అమ్మ ఋణం"
చాలా చక్కగా చెప్పారండీ
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
మా తృ దినోత్సవ శుభాకాంక్షలు..మంజు గారు
మాతృమూర్తులందరికీ వందనం.
రాజి, బోనగిరి గారికి, కాయల నాగేంద్ర గారికి, వనజ గారికి ధన్యవాదాలు మరియు అందరికి అమ్మల రోజు శుభాకాంక్షలు....
విలువ ఇచ్చి గౌరవించి అమ్మను బాగా చూసుకోవడం ఎంత ముఖ్యమో,ఒక్కోసారి నోరు విప్పి, అమ్మా..నువ్వు నాకు ఇచ్చిన ఈ జన్మ, నన్ను తీర్చిదిద్ది, నా ప్రతి కష్టంలో నేనున్నాను అని వెన్ను తట్టిన నీవంటే నాకు ఎంతో ఇష్ట్టం అని సంవత్సరానికి ఒక్కసారన్నా అందరూ మనసులో ప్రేమను వ్యక్తపరచాలేమో మంజు గారు.
ఆ ప్రేమ ఎప్పుడూ వుండాలి ఆ ఒక్క రోజే కాదు అన్నది నా ఉద్దేశ్యం వెన్నెల...
కన్నీటికి అమ్మ కనులు
నవ్వులకు అమ్మ పెదవులు
ప్రేమకు అమ్మ మనసు
వివేకానికి అమ్మ మెదడు
ఇలా మనలోనే ఎందరో మాతృ మూర్తులు దాగున్నారు
మన ప్రతి భావము యొక్క జననానికి ఒక అమ్మ ఉంటుంది
ఇందరు దాగున్న మన జన్మకు కారణమైన అమ్మ ఎంత గొప్పదో మరి
నిజమే ఆమె ఋణం తీర్చలేనిది .....
బాగా చెప్పారు మంజు గారు ఆలస్యంగా స్పందించినందుకు మర్నించాలి అయినా ఏ రోజైన ఆమెను స్మరించవచ్చు కాబట్టి మీకు మరియు అందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు !
మీరు చెప్పిన విదం బావుంది కళ్యాణ్ గారు ...నచ్చినందుకు థాంక్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి