21, మే 2012, సోమవారం

మనిల్లు....!!

అందాల హరివిల్లు
ఆనందాలకు పుట్టినిల్లు
కోపతాపాలకు మెట్టినిల్లు
వలపు వయ్యారాలకు నట్టిల్లు
అనురాగానికి అభిమానానికి సొంతిల్లు
అల్లరికి ఆటపాటలకు...ఆన్నిటికి అదే అదే మన ఇల్లు ..!!
ఎంతటి వారైనా అమ్మకు...ఆమ్మ ప్రేమకు దాసానుదాసులే...!!
కష్టంలో ఓదార్పు...దుఃఖంలో స్వాంతన...!!
అపజయలో ధైర్యం... గెలుపులో గొప్పదనం...!!
ఎన్నేళ్ళైనా...ఎన్నాళ్ళైనా...అమ్మ అమ్మే..!!
అమ్మ ఒడిలోని వెచ్చదనం ఏ విలువలకు అందనిది...!!
అన్నిటికి ఊరట అమ్మ ఒడే..!!
లాలి పాడినా జోల పాడినా దెబ్బలేసి బుద్దులు చెప్పినా...
దేనికైనా చిరునామా ఈ సృష్టి లో అమ్మ ఒడి....!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"లాలి పాడినా జోల పాడినా దెబ్బలేసి బుద్దులు చెప్పినా...
దేనికైనా చిరునామా ఈ సృష్టి లో అమ్మ ఒడి....!!"

"మనిల్లు....!!" గురించి,
అమ్మ గురించి చాలా బాగా చెప్పారండీ..

చెప్పాలంటే...... చెప్పారు...

నచ్చినందుకు సంతోషం రాజి థాంక్యు

జలతారు వెన్నెల చెప్పారు...

చాలా బాగుంది మంజు గారు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner