26, మే 2012, శనివారం

అందని అద్భుతం..!!


ఒంటరితనం వరమో ...!!
ఏకాంతం శాపమో...!!
ఎందరున్నా ఎవరు లేని ఏకాంతం....!!
నిశి రాతిరి నిదురలో నీ తలపులు....!!
కారుమబ్బుల మాటున దాగిన ...
మసక వెన్నెల వెండి వెన్నెలలు కురిపించే క్షణాలు...!!
మనో వీక్షణం నీకై ఎదురు చూసే నిరీక్షణం....!!
నీకోసం పరితపించే ప్రాణం...!!
నిను చూడక నిలవలేనంటున్న మనసు...!!
కోల్పోయిన సాన్నిహిత్యం మళ్ళి దొరికితే..!!
అది మరో అద్భుతమే..!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

భాస్కర్ కె చెప్పారు...

మరో అద్భుతమే..!!
ilanti feeling

చెప్పాలంటే...... చెప్పారు...

:) థాంక్యు

oddula ravisekhar చెప్పారు...

ఒంటరితనం ,ఏకాంతం వేరు వేరు.ఒంటరితనం మనం ఫీల్ అయ్యేది.ఏకాంతం మనం కల్పించుకోనేది .మనిషికి అద్భుత నేస్తం తన ఏకాంతమే.ఎనీ హౌ మీ కవిత బాగుంది.

జలతారు వెన్నెల చెప్పారు...

Chaalaa baagundi manju gaaru.

చెప్పాలంటే...... చెప్పారు...

రెండు ఒకటని నేను ఏమైనా
రాశానా!!
ఒక్కోసారి ఏకాంతం కూడా భరించలేని శాపమే...!!

థాంక్యు రవి

థాంక్యు వెన్నెలా..!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner