26, మే 2012, శనివారం
జవాబు లేని ప్రశ్న..!!
మరణం....!!
జీవితానికి రాజీనామా..!!
మరో జన్మకు పయనం...!!
మరణం లో ప్రశాంతత మరెక్కడా దొరకనిది...!!
వేదన నుంచి విముక్తి...!!
బంధాల నుంచి విరక్తి....!!
అందుకేనేమో...!!
ఒక్కోసారి మరణానికి ఆహ్వానం పలుకుతాము...!!
మరణం అంచుల వరకు వెళ్లి మళ్ళి వెనక్కు వస్తే...!!
అది పునర్జన్మేమో..!!
అదృష్టమో...!!
మరి దురదృష్టమో..!!
దేవునికి మనతో పని ఉన్నదో ఏమో..!!
లేక మన ఖర్మ ఇంకా మిగిలిందేమో...!!
అనుభవించడానికి..!!
జవాబు తెలియని ప్రశ్నగానే మిగిలి పోయింది...!!
ఈ జీవితం...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మీరు మరణం గురించి వ్రాసారే .చిత్రం ఇద్దరం ఒకే సారి ఒకే అంశం పై వ్రాసాము.బాగా వ్రాసారు.
బాగుంది...
మంజు గారు, మరణం మీద కవితా? వద్దులెండి...ఇంకేదన్నా టాపిక్ మీద రాయండి ఇక పై..నాకెందుకో మనసంతా ఒక లాగ అయిపోతుంది!
రవి మీ కవిత చూసాకే నేను రాసాను....థాంక్యు మీది చాలా బావుంది
థాంక్యు సాయి గారు
అలా కాదు వెన్నెలా...!! అన్ని ఒప్పుకున్నట్లే మరణాన్ని కూడా ఆహ్వానించాలి కదా..!!
ఎందుకో రాయాలనిపించింది....చాలా సార్లు దగ్గరగా వెళ్లి వచ్చాను మరి అందుకేనేమో....అలా అనిపించింది...!!
chaavu, puttukale nijam,
madhya bhathukantha abaddam.
ekkado....
మద్య బతుకు కూడా నిజమే కాని మన చేతుల్లోనే ఉందేమో అది నిజం చేసుకోవాలన్నా అబద్దం అనుకోవాలన్నా...!!
ఎక్కడో....!! అని ఆపెసారెంటి..??
థాంక్యు అండి
అక్క చాలా బాగా రాసావు మరణం గురించి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి