
తలుపులు తీయని
మనసు సంద్రాన్ని
తాకిన అలజడిలో
జ్ఞాపకాల వింజామరలు
విసిరిన గురుతుల
గతపు సౌరభాలు
విరిసిన మౌన ఉషస్సులై
ఎదను కదిలించిన
పద లాస్యాలు పలికే
భావనల వెల్లువగా మారి
కులుకులొలికే కలానికి
కుందనపు బొమ్మలైన
అక్షర కన్నియ అందాలు
అరవిరిసిన ఆశు కవనాల
మేలిముసుగు మెరుగుల
తరగల తెర తీయగరాదా
చూడ వచ్చిన చూపరులకు......!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి