4, ఏప్రిల్ 2015, శనివారం

ఇలా ఉండి పోయా.....!!

కాలం చేసిన గాయం
కలం సిరాలో ఒలుకుతోంది
మనసును తొలిచే మధనానికి
సాక్ష్యంగా అక్షరాల ఆవిష్కరణలో
భావాల పద విన్యాసం బహు ముచ్చటగా
ఒదిగి ఉన్నా...
బడలిక తీరని బంధం వ్యధగా మిగిలిపోతూ
శిలగా మారిన చేతనావస్థకు పరాకాష్ట
అస్పష్ట రూపాల్లో అటు ఇటు చుట్టేస్తూ
సంచలనం సృష్టిస్తుంటే...
తట్టుకోలేక తారాడుతూ పరుగులెత్తే
మౌనాల మాటల తాకిడి వెల్లువలా తాకి
ఉప్పొంగుతుంటే...
ఏమి తెలియని అమాయకత్వం
అద్దిన సుకుమారాన్ని తుంచేసి
ఏకాంతానికి ఏకాకిగా మిగిల్చి
నిరాశల ఆశలకు ఊపిరి పోస్తూ
ఎండమావుల స్నేహంలో
ఎడబాటైన బాంధవ్యాన్ని
ఎడద మాటునే దాచేసి
ఎగసిపడే కన్నీటికి అర్ధాలు వెదుకుతూ
ఇలా ఉండి పోయా ఎటూ పోలేక....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner