
తనకు ఏమి పట్టనట్టుగా
గాయాలను విదిల్చి
జ్ఞాపకాలను మిగిల్చి
కథలను అల్లుతూ
కలతలను ఏమార్చుతూ
వెలసిన రంగుల జీవితాన్ని
కలల దారిలో కలిపేస్తూ
వాస్తవాలకు విభిన్నంగా
రూపాన్ని సంతరించుకున్న
ఆశలకు సాయంగా
కన్నీళ్ళను తోడిచ్చి
కార్చిచ్చులను ఆర్పేయమంటూ
మనసును అదిలిస్తూనే ఉంది
అవిశ్రాంతంగా పయనించే
అంతు చిక్కని కాలం...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి