29, మే 2015, శుక్రవారం

నీ చెలిమి సాక్ష్యం నాతోనే....!!

ఇలకు చేరిన జాబిలి
ఎదను తాకిన సవ్వడి
మురిసిన మది మౌనములో 
మోమున మెరుపుల చాటున
చేసిన చిరునవ్వుల సంతకం
రాలిన చుక్కల జ్ఞాపకాలకై
వెదికిన హృదయానికి
తగిలిన గతపు మైమరపులు
చేసిన అలజడి కలకలంలో
అగుపడిన వెలుగుల దివ్వె
చెప్పిన సత్య సుదూరం
అనునిత్యం వెన్నాడుతున్న
నీ చెలిమి సాక్ష్యం నాతోనే....!!

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది నాలుగవ భాగం....!!

వారం వారం సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో క్రిందటి వారం నవలా సాహిత్య ప్రక్రియ గురించి కాస్త తెలుసుకున్నాం... ఈ వారం అవధానాల గురించిన వివరణ చూద్దాం...
అవధానం అనేది తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.

అవధానం స్వరూపం

కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తి (గుర్తుంచుకోగల శక్తి, memorising ability)కి పాండితీ ప్రకర్షకు అవధానం అత్యున్నత పరీక్ష. సాంప్రదాయికంగా జరిగే అష్టావధానం లో 8 మంది పృఛ్ఛకులు (ప్రశ్నలు అడిగే వారు) అవధాని చుట్టూ చేరి వివిధ రకాలైన ప్రశ్నలు (పాండిత్యాన్ని పరీక్షించేవి కొన్ని, అవధాని సహనాన్ని పరీక్షించేవి మరి కొన్ని) అడుగుతూ ఉంటారు. పృఛ్ఛకులు కూడా పాండిత్య పరంగా ఉద్దండులైన వారే ఉంటారు.
ఎందరో కవి పండితులు అవధాన ప్రక్రియను జయప్రదంగా చేసి పండితుల మన్ననలను పొందారు. అవధానం విజయవంతంగా చేసిన వారిని అవధాని అని అంటారు. ఏక కాలంలో తెలుగు, సంస్కృతం - రెండు భాషల లోనూ అవధానం చేసిన పండితులు ఉన్నారు. అవధానాలు చాలా రకాలు. ముఖ్యంగా అవధానాలను వేదసంబంధ, సాహిత్య, సాహిత్యేతర అవధానాలుగా వర్గీకరించవచ్చు.
  • సాహిత్య అవధానాలు: అష్టావధానం, శతావధానం, సహస్రావధానం... ఇలా 20దాకా ఉన్నాయి.
  • సాహిత్యేతర అవధానాలు: శతకలశావధానం, శభ్దావధానం, రామాయణ, భగవద్గీత అవధానాలు. ఇవి ధారణ సంబంధమైనవి. అంటే ఒక్కసారి చదివి లేదా విని గుర్తుంచుకోవడం ద్వారా మళ్లీ చెప్పేవి.
సంగీత నవావధానం ..ఈప్రక్రియను ప్రారంభించిన వారు మీగడ రామలింగస్వామి. ఎనమిది మంది పృఛ్ఛకులకు ,ఇరవై పద్యాలను పన్నెండు రాగాలను ఇస్తారు. వాటిలో నుండి పద్యాలు తాము కోరుకున్న రాగాలలో గానం చేయమని అడగవచ్చు. ఉదాహరణకు పాండవోద్యోగమ లో బహుళ ప్రచారం లో ఉన్న పద్యం 'జెండాపై కపిరాజు ' ఇంతవరకు పాడిన నట గాయకులందరూ దీన్ని మోహన రాగం లోనే పాడగా మనం విన్నాము. పరస్పర విరుద్ధమైన లక్షణాలు ఉన్న శివరంజని లేక ముల్తాన్ రాగాలలో పాడమని పృఛ్ఛకులు అడిగితే అవధాని ఆ రాగం లో పద్యభావం చెడకుండా పాడాలి. పృచ్చకులు దాదాపుగా పద్యాలను రాగయుక్తంగా పాడగలవారై ఉంటారు. అందువల్ల ఒక్కొక్క పద్యాన్ని పరస్పర విరుద్ధమైన ఛాయలున్న రాగాలలో వినగలుగుతాం.

అష్టావధానము

ఇందు ఎనిమిది ప్రక్రియలు ఒకేసారి చెయ్యవలెను, కనీస సమయము నాలుగు గంటలు. ఆ ఎనిమిది ప్రక్రియలు
  1. కావ్య పాఠము
  2. కవిత్వము
  3. శాస్త్రార్థము
  4. ఆకాశపురాణము
  5. లోకాభిరామాయణము
  6. వ్యస్తాక్షరి (లేదా) న్యస్తాక్షరి
  7. చదరంగము
  8. పుష్ప గణనము
ఇవే కాకుండా కొంతమంది సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం, వివర్గాక్షరి, నిర్దిష్టాక్షరి, ఘంటా గణనం, పురాణ పఠనం, సహ పఠనం, కావ్యోక్తి, ఇచ్ఛాంక శ్లోకం మొదలగు వాటిలో ఎనిమిది ప్రక్రియలు ఎన్నుకుంటారు. చివరలో "ధారణ" తో అవధానం ముగుస్తుంది. ధారణ అనగా అన్ని పద్యాలను అవధాని చివరలో చెప్పవలసి ఉంటుంది.
అష్టావధానములో ఇవ్వబడిన ఎనిమిది అంశాలలో స్వల్ప తేడాలుంటాయి. వాటిని - వాటి వివరణను గమనించండీ.
1.నిషిద్ధాక్షరి
వృచ్ఛకుడు ఒక విషయాన్ని గురించి ఫలాన చందస్సులో ఒక పద్యం చెప్పవలసినదిగా అవధాని గారిని కోరతాడు. అవధానిగారు ఆ విషయం మీడ ఒక చందస్సులో ఒక పద్యం మెదలెడతాడు ఒక పదంతో. అప్పుడు వృచ్ఛకుడు అవధాని చెప్పిన పదాన్ని బట్టి తరువాత ఏ అక్షరం రాగలదో ముందుగుగానే వూహించి ఆ అక్షరం మీద సిషేదం విధిస్తాడు. అనగా ఆ అక్షరం ఉపయోగించ కూడదని. అవధాని గారు ఆ అక్షరాన్ని వదలి వేరే అక్షరం తో పద్యాన్ని కొనసాగిస్తాడు. ఈ విధంగా ఆ పద్యం పూర్తయ్యే లోపు అనేక సార్లు నిషిద్దాక్షరాన్ని ప్రయోగిస్తాడు వృచ్ఛకుడు. అవదాని గారు పద్యభావం చేడకుండా నిషిద్దాక్షరిని వాడకుండా.... పద్యాన్ని పూర్తి చేస్తాడు. పూర్తి చేయడమంటే ఒకేసారి పూర్తి చేయడం కాదు. అవధానం పూర్తయ్యేలోపు పూరించాలి. అవధాని గారు ఆ పద్యంలో రెండు మూడు పదాలు చెప్పగానే మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు. ఇంత వరకు చెప్పిన పద్య భాగాన్ని అలాగే మనసులో ముద్రించుకొని ఇచ్చిన మరో అంశానికి వెళతారు అవదాని. ఈ అవధాన ప్రక్రియ సంస్కృతంలోను మరియు తెలుగులో మాత్రమే వునటు తెలుస్తుంది. ఇది తెలుగు భాషకు మహా భూషణము
నిషిద్ధాక్షరి విభాగంలో అవధానిని - శ, ష, స, హ - లను ఉపయోగించకుండా శివుని పై ఒక పద్యాన్ని చెప్పమనగా అవధాని గారు ఇలా చెప్పారు.
డమరుకమును మ్రోగించుచు నమరించెను మానవులకు ' అఆ ' మాలన్ కమనీయముగా వ్రాయగ నుమతోడుగ నున్న వాని నుద్ధతి గొలుతున్.
2. న్యస్తాక్షరి
వృచ్ఛకుడు ఒక విషయాన్ని గురించి ఫలాన చందస్సులో ఒక పద్యం చెప్పమని అవధానిని అడుగుతూ పద్యంలోని నాలుగు పాదాలలో ఫలాన స్తానంలో పలాన అక్షరం మాత్రమే వుండాలి అని నాలుగు అక్షరాలను నిర్దేశిస్తాడు. అవధాని గారు వృచ్ఛకుడు చెప్పిన అక్షరాలను ఉపయోగించి పద్యాన్ని పూరిస్తారు. ఆ పద్యాన్ని ఒక్కసారే చెప్పడానికి వీలు లేదు. పద్య పూరణ కొంత అవగానే మరొక వృచ్చకుడు మరో సమస్యనిస్తాడు. అవధాని గారు అప్పటి వరకు చెప్పిన పద్య భాగాన్ని గుర్తుంచుకొని మరో సమస్య మీదికి మనసును కేంద్రీక రించాలి.
3.దత్తపది
ఇది న్యస్తాక్షరి లాంటిదే. కాక పోతే అక్కడ ఒక పాదానికి ఒక అక్షరాన్నిస్తారు. ఇందులో ఒక్క పాదానికి ఒక్కొక్క పదాన్నిస్తారు. ఆ పదాలు కూడ ఒక దానికి ఒకటి పొంతన లేకుండా వుంటాయి. ఉదాహరణ గా చెప్పాలంటే. వంకాయ, అమెరికా, రాముడు, గాందీతా. ఒక్కొక్క పాదంలో ఒక పదాన్ని వుంచి ఫలాన చందస్సులో, ఫలాన విషయంపై ఒక పద్యం చెప్పమని వృచ్ఛకుడు ప్రశ్నను సందిస్తాడు. అవదానిగారు ఆయా పదాలను పయోగించి అర్థవంతమైన పద్యాన్ని చెప్పడానికి ప్రయత్నించి నాలుగు పదాలు చెప్పగానే మరొక వృచ్ఛకుడు మరో సమస్యతో అడ్డగిస్తాడు. అవదాని గారు అంతవరకు చెప్పిన పద్య భాగాని అలాగె గుర్తు పెట్టుకుని మరో సమస్యలోకి దిగాలి.
4.సమస్యా పూరణం.
వృచ్ఛకుడు లోక విరుద్ధంగా వున్న విషయాన్ని సమస్యగా చేసి ఒక పద్య పాదాన్ని ఇస్తాడు. అవదాని గారు తనకిచ్చిన పద్య పాదంలోని లోక విరుద్ధమైన భావాన్ని విరిచి లోకామోదమైన భావంతో పద్యాన్ని పూరించాలి. ఉదాహరణకు: కప్పను చూడంగ పాము గజగజ లాడెన్. ఈ పద్య పాదంలోని అర్థం లోక విరుద్ధము. అదే అర్థంతో పద్యాన్ని ఎవరైనా చెప్పగలరు. అందులోని అర్థాన్ని సజావుగా మార్చి పద్యం చెప్పాలి. అవధాని గారు ఈ సమస్యను స్వీకరించి మొదటి పద్య పాదంలో కొంత భాగము చెప్పగానే ...... అతని ధారణకు ఆంతరాయాన్ని కలిగిస్తూ మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు.
5. వర్ణన
వృచ్ఛకుడు ఏదో ఒక చందస్సులో, ఏదో ఒక విషయాన్ని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమంటాడు. అవధానిగారు ఆ నిర్థిష్టమైన చందస్సులో ఆ విషయమై వర్ణనాత్మకమైన పద్యం చెప్పాలి.
6. ఆశువు
వృచ్ఛకుడు ఒక విషయాన్నిచ్చి అడిగిందే తడవుగా , ఆలోచించుకోకుండా వెంటనే ఆసువుగా చందోభద్దమైన పద్యాన్ని ఆ విషయాన్ని గురించి చెప్పాలి అవధాని గారు.
7.పురాణ పఠనం:
వృచ్ఛకుడు పురాణం, ఇతిహాసం, ప్రబందం, కావ్యం ఇలాంటి గ్రంధాలలో ఒక ప్రథాన ఘట్టాలలో నుండి ఏదైనా ఒకటి రెండు పద్యాలను చదివి వినిపిస్తాడు అవధానిగారికి. అవధానిగారు ఆ పద్యాలను విని ..... ఆ పద్యాలు ఏ గ్రంథంలోనివి, ఆ గ్రంథ కర్త ఎవరు? ఆ సందర్బమేది వంటి విషయాలు.... పురాణ పక్కీలో చెప్పాలి... అవధాని గారు ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తుండగా....... మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు. అవదానిగారు అతన్ని 'కొంత సేపు ఆగు ' అని అనకుండా అతని ప్రశ్న వినడానికి సిద్ధ పడాలి.
8.అప్రస్తుత ప్రసంగం:
పైన చెప్పిన సమస్యలు అవధాని గారి జ్ఞాపక శక్తికి, అతని ధారణా శక్తిని పరీక్షించేవి. ఆ యా విషయాల గురించి తీవ్రంగా అలోచిస్తూ వుండగా ఈ వృచ్ఛకుడు ప్రస్తుత విషయానికి పూర్తిగా విరుద్ధమైన విషయాన్ని గురించి ఒక కొంటె ప్రశ్న సందిస్త్గాడు. ఉదాహరణకు...... అవధానిగారూ..... నిన్న ఇదే సమయానికి మీరెక్కడున్నారు..... ఏమి చేస్తున్నారు చెప్పండి అంటాడు. దానికి సమాధానంగా అవధానిగారు మామూలుగా అడిగిన దానికి సమాధానము చెప్పడము కాదు... ఆ కొంటె ప్రశ్నకి సమాధానం మరింత కొంటెగా సభాసధులందరూ ఆహా అని మెచ్చుకునే టట్లు సమాధానం చెప్పాలి.
వివరాలు
1.ఇప్పటి వరకు ఒక ఆవృతం మాత్రమే పూర్తయింది. ఏ ఒక్కరికీ పూర్తి సమాధానం ఇవ్వకనే మరో వృచ్ఛకుడు అడ్డు తగిలాడు. ఈ సారి రెండో ఆవృతంలో (రెండో రౌండు) తిరిగి మొదటి వృచ్ఛకుడు నాప్రశ్నకు సమాదానమేది అని ప్రశ్నిస్తాడు. అతనడిగిన ప్రశ్నేమిటో ఎంతవరకు సమాదాన మిచ్చాడో గుర్తు పెట్టుకొని ఆ పద్యంలో రెండో పాదం చెప్పాలి. మొదటి వృచ్చకునికొ సమాధానం పూర్తి కాక ముందే రెండో వృచ్చకుడు నాసంగతేమిటని అడుగుతాడు. అతనికి ఇంతకు ముందు ఎంతవరకు సమాధానము చేప్పారో గుర్తు పెట్టుకొని మిగతా సమాదాన భాగాన్ని పూరిచి చెప్పాలి. ఇంతలో మూడో వృచ్చకుడు.... ఇల ఒకరి తర్వాత మరొకరు తాము ఇదివరకు సంధించిన ప్రశ్నలు చెప్పకుండా తమకు రావలసిన సమాధానలను గురించే అడుగుతారు. అవధానిగారు ....... మీకు ఎంత వరకు సమాదానము చెప్పాను? అని అడగ కుండా ఆ విషయాన్ని మనసులోనే వూహించుకుని తరువాతి పద్య పాదాన్ని పూరించి సమాధానము చెప్పాలి. ఆ విధంగా నాలుగో రౌండులో మాత్రమే ప్రతి వృచ్ఛకునికి పూర్తి సమాదానము వస్తుంది. అవధానులెవరైనా వృచ్చకులు అడిగిన ప్రశ్నలకు చంధోబద్దమైన పద్యాలతో సమాధానము చెప్పడమే కాదు ఆ సమాధానాలు అత్యంత రసవత్తరంగా, మనోజ్ఞంగా. సాధారణ ప్రేక్షకుల సైతం ఆకట్టు కునే విధంగా వుటాయి. అందులోనే అవధాని గారి గొప్పతనం, ప్రజ్ఞా వుంటాయి.
ఆ విధంగా అన్ని నియమాలతో పద్యాలు చెప్పడం ఒక్ ఎత్తైతే నాలుగు రౌండ్లు పూర్తవగానే ఆ పద్యాలన్నిటినీ ధారణ చేసి అదే క్రమంలో ఏక ధాటిగా వాటిని అపొపగించడం మరో ఎత్తు. ఇదే ఈ అవధాన కార్య క్రమంలో గొప్పవిషయం. అలా అష్టావధాన కార్య క్రమం చాల కోలాహలంగా ఆనంద భరితంగా ముగుస్తుంది.
3 సమస్యా పూరణం అన్న పై విషయంలో కప్పను జూడంగ పాము గజగజ లాడేన్. ఇది అసమజమైనది. (అనగా కప్పను చూడగా పాము గజగజ లాడి భయపడు. ఆ ఆర్థాన్ని మార్పు చేసూ అక్షరాలను ఏమాత్రము మార్చకుండా పూరించాలి) అనే పద్య పాదాన్ని పూర్వం ఒక సమస్యగా ఇచ్చారు ఒక అవధాని గారికి. దానికి అవధానిగారు పూరించిన సమాదానము పూర్తి పద్యం లోని భావం చూడండి. వెంకప్ప అనే రైతు తన పొలంవద్ద నున్న కుప్పలకు కావలికై వెళుతూ ఒక కర్రను, కిర్రు చెప్పులును ధరించి వెళుతుంటే అతన్ని చూసి అనగా వెంకప్పను జూడంగ పాము గజగజ లాడెన్. ఈ పూరణ ఎంత అద్భుతంగా వుందో.......
4.పువ్వులు విసురుట: అవధాన కార్యక్రమము జరుగుతుండగా ఒకరు అవదాని పైకి అప్పుడప్పుడు ఒక్క పువ్వును విసురు తాడు. అవధానం పూర్తి కాగానే తనపైకి ఎన్ని పువ్వులు విసిరారో గుర్తు పెట్టుకొని ఖచ్చితమైన సమాధానం చెప్పాలి అవధాని గారు.
6. గంటలు కొట్టుట. అవధానం జరుగుతున్నప్పుడు ఒకరు గంట కొడుతుంటాడు. అవధానం పూర్తవగానె., అతను ఎన్ని గంటలు కొట్టాడొ గుర్తు పెట్టుకొని అవధాని గారు చెప్పాలి. పువ్వులు విసరటం , గంటలు కొట్టటం అనే రెండు అంశాలు రెండు వుండవు. ఈ రెంటి వుద్దేశం ఒక్కటే గాన ఏదో ఒక్కటే వుంటుంది. అది కూడ పైన చెప్పిన ఎనిమిది అంశాలలో ఒకదాని బదులుగా ఈ రెంటిలో ఒక్క దాన్ని వుంచు తారు. ఎలాదైనా ఎనిమిది అంశాలుండాలి అది ని భందన.

శతావధానము

వంద మంది పృచ్ఛకులను ఎదుర్కొని చేసే అవధానాన్ని శతావధానం అంటారు. సాధారణంగా శతావధానంలో సమస్య, దత్తాక్షరి, వర్ణన, అప్రస్తుత ప్రసంగం అంశాలు ఉంటాయి.

సహస్రావధానము

ద్వి సహస్రావధానము

త్రి సహస్రావధానము

నాట్యావధానము

గణితావధానము

ఘంటావధానము

నేత్రావధానము, అంగుష్టావధానము, అక్షరముష్టికావధానం

ఇందులో ఇద్దరు అవధానులు ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. పృచ్ఛకులు మొదటి అవధానికి ఒక కాగితంపై విషయం వ్రాసి ఇస్తారు. అతడు దానిని చదివి రెండవ అవధానికి తన కనుసైగల ద్వారా చెప్పాలి. దాన్ని ఆయన అర్థం చేసుకుని బయటకు చదవాలి. ఇలా చేయడానికి ఆ జంట తెలుగులో ప్రతి అక్షరానికి ఒక్కో గుర్తును పెట్టుకుంటారు. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవులు ఈ నేత్రావధానంలో సిద్దహస్తులు.
కళ్లతో కాకుండా బొటనవేలితో భావాలను చెప్పితే అది అంగుష్టావధానం, పిడికిలితో చేస్తే అక్షరముష్టికావధానం. ఇంకా పుష్పావధానం, ఖడ్గావధానం, గమనావధానం... లాంటివి 13దాకా ఉన్నాయి. వీటిని సాంకేతిక అవధానాలు అంటారు.
ఇలాంటి అవధానాలను చేయడానికి జంట అవధానులు తప్పనిసరి. అది ఆ ఇద్దరికి మాత్రమే సాధ్యమవుతుంది. వారిలో ఎవరు లేకపోయినా రెండోవారు మరొకరితో కలసి చేయలేరు.

అష్టావధానం లోని ప్రక్రియలు

పుష్ప గణనము

పుష్ప గణనము అనగా అవధానికి తగిలేలా అప్పుడప్పుడు పుష్పాలు విసురుతుంటారు. ఆయన ఆ పూల సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని పూలు విసిరారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.

ఆశువు

ఆశువు లేదా ఆశుకవిత్వం. ఇది ప్రజలను విశేషంగా ఆకర్షించే ప్రక్రియ. అగ్గిపుల్ల నుంచి అంతరిక్షం దాకా దేని మీదనైనా ఆశువు గా పద్యమో దండకమో చెప్పమంటారు పృచ్ఛకులు. అవధాని చతురత, ధార ఇక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది.

నిషిద్ధాక్షరి

నిషిద్ధాక్షరి అంటే పృచ్ఛకుడు ముందుగానే ఏయే అక్షరాలు నిషిద్ధమో నిర్దేశిస్తాడు. ఉదాహరణకు, మేడసాని మోహన్ ను ఒకసారి క, చ, ట, త, ప అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం గురించి చెప్పమన్నారు. ఆయన ఈ విధంగా చెప్పాడు.
సరసనిధిరామభద్రుడు
ధరణిజ ఎదలోన మధుర ధారణుడయ్యెన్
సురలెల్ల హర్షమందిరి
విరాజమాన సువిలాస విభవ మెసగిన్

నిర్దిష్టాక్షరి

నిర్దిష్టాక్షరి అనగా నిర్దేశించబడిన అక్షరాలు గలదని అర్థం. దీనిలో 32 గళ్లుంటాయి. పృచ్ఛకుడు బేసి స్థానాల్లో గానీ, సరి స్థానాల్లో గాని ఇష్టానుసారం అక్షరాలను వ్రాసి ఇస్తాడు. అవధాని మిగిలిన ఖాళీలను పూరించి కోరిన దేవతా స్తుతిని పూర్తి చేస్తాడు.

ఘంటా గణనం

ఘంటా గణనం అనగా అప్పుడప్పుడు గంట కొడుతుంటారు. అవధాని ఆ సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని గంటలు కొట్టారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.

అప్రస్తుత ప్రసంగం

అవధాని ఏకాగ్రతను చెడగొట్టడానికి అప్రస్తుత ప్రసంగి (పృచ్ఛకులలో ఒకరు) చేయని ప్రయత్నం ఉండదు. ఉదాహరణకు ఒక సభలో ఒకాయన "అవధాని గారూ, భర్త భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తోంది. భర్త పశువ అన్నాడు. భార్య కోతి అంది. వారి మాటల్లో ఆంతర్యమేమిటి" అని అడిగారు. దానికి అవధాని... "ళ్లెం నిండా శుభ్రంగా డ్డించవే" అని భర్త అంటే "కోరినంత తినండి" అని భార్య జవాబిచ్చింది అని చెప్పాడు. "హనుమంతుని తోక పెద్దదా-ద్రౌపది కోక పెద్దదా" వంటివి మరికొన్ని ఉదాహరణలు. అవధాని, అప్రస్తుత ప్రసంగి విసిరే ఛలోక్తులూ చెణుకులకు తడుముకోకుండా చెప్పగలిగితేనే సభ శోభిస్తుంది. ఎందుకంటే, పద్యాలూ ఛందస్సుల గురించి తెలియని వారిని ఆకట్టుకునేది ఈ అప్రస్తుత ప్రసంగమే.
శతావధాన సహస్రావధానాలలో సాధారణంగా ఉండే అంశాలలో కొన్ని....1. సమస్యాపూరణం 2.దత్త పది 3.వర్ణన 4.ఆశువు 5.నిషిద్ధాక్షరి 6.నిర్దిష్టాక్షరి 7.వ్యస్తాక్షరి 8.న్యస్తాక్షరి 9.చందోభాషణం 10.పురాణ పఠనం 11.శాస్త్రార్థము 12.ఏకసంథా గ్రహ్ణం 13.వివ్ర్గాక్షరి 14.అనువాదం 15.చిత్రాక్షరి 16.అక్షర విన్యాసం 17.స్వీయ కవితా గానం 18.వార గణనం 19.పంచాంగ గణనం 20.పుష్ప గణనం 21.ఘంటా గణనం 22.అప్రస్తుత ప్రసంగం 23.కావ్యానుకరణం 24.సంగీతం 25.మీ ప్రశ్నకు నా పాట మొదలగునవి.

కొందరు అవధానులు

ఆధునిక కాలంలో

  • డాక్టర్ గరికిపాటి నరసింహారావు . వేయి మంది పృచ్ఛకులతో అవధానం చేసి మహా సహస్రావధాని అనీ, ముందు చెప్పిన వేలాది పద్యాలు క్రమంలో మళ్ళీ చెప్పి ధారణా బ్రహ్మ రాక్షసుడు అనీ బిరుదులు పొందాడు.
  • దూపాటి సంపత్కుమారాచార్య 1932 మే 18 న ఓరుగల్లు పట్టణంలో జన్మించారు. వీరి తల్లి ప్రఖ్యాతి గాంచిన కవయిత్రి శ్రీమతి శేషమ్మ గారు. తండ్రి శేషాచార్యులు గారు. వీరు ప్రాథమిక విద్యను వరంగల్లు లోను, మచిలీపట్నం లోను పూర్తి చేసి, ఎస్.ఎస్.ఎల్.సి ని మాత్రం పాలకొల్లు లో పూర్తి చేశారు. ఆ తర్వాత 1962 లో హన్మకొండ లో బి.ఏడ్. శిక్షణను పూర్తి చేశారు. వీరు 1965 వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ప్రవేటుగా చచివి తెలుగులో ఎం.ఏ పట్టాను పొందారు. ద్విశతావధానిగా ప్రఖ్యాతి వహించిన రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి వద్ద సంపత్కుమారు గారు అవధానము చేయుటలో వున్న మెళుకువలు, రహస్యాలను నేర్చుకున్నారు. వీరు రెండు వందలకు పైగా అష్టావధానాలు చేసిన ప్రముఖులు.
  • డాక్టర్ మేడసాని కృష్ణమోహన్. (జననం ఏప్రిల్ 19, 1954) అష్టావధానాలు, శతావధానాలు, ఒక సహస్రావధానం చేశాడు. ఇటీవలే పంచసహస్రావధానం నిర్వహించి సాహితీ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని సాక్షాత్కరింపచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గా సేవలందిస్తున్నాడు.
  • కడిమెళ్ల వరప్రసాద్. పలు అష్టావధానాలు, శతావధానాలే కాక అవధాన ప్రక్రియలో శిష్యుడు కోట లక్ష్మీనరసింహంతో కలిసి జంట సహస్రావధానం కూడా నిర్వహించారు. అవధానులుగా రాణిస్తున్న కోట లక్ష్మీనరసింహం, వద్దిపత్తి పద్మాకర్ లకు అవధాన ప్రక్రియ నేర్పి తీర్చిదిద్ది "గురు సహస్రావధాని"గా పేరొందారు.
  • అష్టకల నరసింహరామ శర్మ. అవధాన ప్రక్రియపై విశేష పరిశోధన జరిపాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. 150పైగా అవధానాలు చేశాడు .
  • డాక్టర్ ఆర్.గణేష్ 17పైగా భాషలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. 8 భాషలలో 500పైగా అవధానాలు చేశాడు.
  • రాంభట్ల పార్వతీశ్వర శర్మ బాల కవి, 20 ఏళ్ళ వయసులో 12 అష్టావధానాలు చేశాడు. "శ్రీ రాంభట్ల వేంకటీయము" అనే లఘు పద్యకావ్యం వ్రాసాడు. చదివింది బియస్సీ మైక్రో బయాలజీ... చదువుతూ ఉన్నది ఎమ్మే తెలుగు, ఆంధ్ర విశ్వకళా పరిషత్.
  • నరాల రామారెడ్డి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వీరు ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు. అష్ఠావధాని. అనేక అవధానాలు చేశారు. చమత్కారం వీరి ప్రత్యేకత. అమెరికాలో అవధానాలు చేసి మన్ననలు పొందారు.
==పంచసహస్రావధానులు== 
జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి , మేడసాని మోహన్
==ద్విసహస్రావధానులు ==
మాడుగుల నాగఫణి శర్మ.
==సహస్రావధానులు== 
మేడసాని మోహన్ , మాడుగుల నాగఫణి శర్మ , వద్దిపర్తి ప్రభాకర్ , గరికపాటి నరసింహారావు.
== పంచశతావధానులు== 
మాడుగుల నాగఫణి శర్మ.
==ద్విశతావధానులు ==
రాళ్ళబండి కవితా ప్రసాద్ , కడిమిళ్ళ వరప్రసాద్ , గరికపాటి నరసింహారావు , మాడుగుల నాగఫణి శర్మ.
== --శతావధానులు 
==
చెఱువు సత్యనారాయణ శాస్త్రి ,సి.వి.సుబ్బన్న , నరాల రామారెడ్డి , గండ్లూరి దత్తాత్రేయ శర్మ ,బూరాడి గున్నేశ్వర శాస్త్రి , మేడసాని మోహన్ , గరికపాటి నరసింహారావు , రాళ్ళబండి కవితా ప్రసాద్, మాడుగుల నాగఫణి శర్మ , వద్దిపర్తి పద్మాకర్ , పల్నాటి సోదర కవులు, చల్లా పిచ్చయ్య శాస్త్రి , అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు, దోర్భల ప్రభాకర శర్మ]] , దోకూరి కోట్ల బాల బ్రహ్మచారి , జాను దుర్గా మల్లికార్జున రావు ,కొండపి మురళీ కృష్ణ , గౌరీభట్ల వెంకటరామ శర్మ ,శ్రీ రామ నరసింహమూర్తి కవులు , కడిమిళ్ళ వరప్రసాద్, సురభి శంకర శర్మ. కోట వెంకట లక్ష్మీనరసింహం , మాడుగుల వెంకట సూర్య ప్రసాదరాయ కవి , పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ , జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి , భూతపురి సుబ్రహ్మణ్య శర్మ , భూతపురి బాల సుబ్బారాయుడు , పోచిన పెద్ది సుబ్రహ్మణ్యం , పాణ్యం నరసరామయ్య , రొంపిచర్ల శ్రీనివాసా చార్యులు...
== అష్టావధానులు== 
ప్రసాదరాయ కులపతి ,దివాకర్ల వెంకటావధాని , ధూళిపాళ మహదేవమణి , గౌరీభట్ల రఘురామ శర్మ ,బేతవోలు రామబ్రహ్మం , దూపాటి సంపత్కుమారాచార్య , [[కోవెల సుప్రసన్నా చార్య [[, విఠాల చంద్రమౌళి శాస్త్రి , చిఱ్ఱావూరి శ్రీరామ శర్మ , ఆర్.అనంత పద్మనాభరావు , మాజేటి వెంకట నాగలక్ష్మీ ప్రసాద్ ,తిగుళ్ళ శ్రీహరి శర్మ , మాడుగుల అనిల్ కుమార్ , సురభి వెంకట హనుమంతు రావు , గణపతి అశోక్ శర్మ , ఇందారపు కిషన్ రావు , మేడూరు ఉమామహేశ్వరం , గాడేపల్లి కుక్కుటేశ్వర్ రావు , మరింగంటి కులశేఖరా చార్యులు , కర్రా గోపాలం , కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాద రావు , కట్టమూరు చంద్రశేఖర్ , లోకా జగన్నాధ శాస్త్రి , అయాచితం నటేశ్వర శర్మ , చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ , అష్టకాల నరసింహరామ శర్మ , వెల్లాల నరసింహ శర్మ ,కేసాప్రగడ సత్యనారాయణ , గురువేపల్లి నరసింహం ,రాళ్ళబండి నాగభూషణ శర్మ ,కురుబ నాగప్ప , పూసపాటి నాగేశ్వర రావు , అందె వెంకటరాజం , రాంభట్ల పార్వతీశ్వర శర్మ , కావూరి పూర్ణచంద్రరావు , ముటుకుల పద్మనాభ రావు , ఆశావాది ప్రకాశరావు , పేరాల భరత శర్మ , పరవస్తు ధనుంజయ , నారాయణం బాల సుబ్రహ్మణ్య శర్మ , మేడవరం మల్లికార్జున శర్మ ,సమ్మెట మాధవ రావు , అవధానం రంగనాధ వాచస్పతి , వేదాటి రఘుపతి , ఆరుట్ల రంగాచార్య ,బులుసు వెంకట రామమూర్తి ,గడియారం శేషఫణి శర్మ , ఆమళ్ళదిన్నె వెంకట రమణ ప్రసాద్,పాలపర్తి వేణుగోపాల్ ,దిట్టకవి శ్రీనివాసాచార్యులు , దోనిపర్తి రమణయ్య , శంకరగంటి రమాకాంత్ , ముద్దు రాజయ్య , తిగుళ్ళ రాధాకృష్ణ శర్మ, గౌరీభట్ల రామకృష్ణ శర్మ , కోట రాజశేఖర్ , చిలుకూరి రామభద్ర శాస్త్రి , పరిమి రామ నరసింహం , బెజుగామ రామమూర్తి , పణితపు రామమూర్తి , జోస్యుల సదానంద శాస్త్రి , మద్దూరి రమమూర్తి , చిలుకమర్రి రామానుజాచార్యులు , గౌరిపెద్ది రామసుబ్బ శర్మ , పణతుల రామేశ్వర శర్మ , పాణ్యం లక్ష్మీనరసింహ శర్మ , చక్రాల లక్ష్మీకాంత రాజారావు ,శిరిశినహళ్ శ్రీమన్నారాయణాచార్యులు , పుల్లాపంతుల వెంకట రామశర్మ , దేవులపల్లి విశ్వనాధం , వంకరాజు కాల్వ వీరభద్రాచార్యులు , పణిదపు వీరబ్రహ్మం , భద్రం వేణు గోపాలా చార్యులు ,రావూరి వెంకటేశ్వర్లు , గుమ్మా శంకర రావు , ప్యారక శేషాచార్యులు ,మామిళ్ళపల్లి సాంబశివ శర్మ , నేమాని రామజోగి సన్యాసి రావు , కొప్పరపు సీతారామ వరప్రసాద రావు , శనగల సుందరరామయ్య , అవధానం సుధాకర శర్మ , పైడి హరనాధ రావు , పమిడికాల్వ చెంచు సుబ్బయ్య , తావి కృష్ణ శర్మ ,వడిగేపల్లి నరసింహులు , మేడికుర్తి పుల్లయ్య , కె.ప్రభాకర్ , పుల్లపంతుల రాధాకృష్ణ మూర్తి , బి.శ్రీనివాసాచార్యులు , అక్కపెద్ది రామసూర్యనారాయణ , సురభి శంక శర్మ , ప్రభల సుబ్రహ్మణ్య శర్మ , ఎస్.ఎ.టి.కె. తాతాచార్య , ఫణితపు శ్రియ:పతి , సి.విజయకుమార్ , గోవర్ధనం నరసింహా చారి , ఎం.కె.ప్రభావతి , తంగిరాల ఉదయ చంద్రిక , పుల్లాభట్ల శాంతి స్వరూప , కొంపెల్ల కామేశ్వరి,బులుసు అపర్ణ , ఆకెళ్ళ దుర్గ నాగసత్య బాలభాను మున్నగువారు.

తెలుగులో అత్యంత క్లిష్టమైన అవధాన ప్రక్రియ గురించి కొంత వివరణ తెలుసుకున్నాము... ఇంతటితో ఈ వారం ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో సాహితీ ప్రక్రియతో మళ్ళి కలుద్దాం...

సేకరణ : వికీపీడియా సహకారంతో ... 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

27, మే 2015, బుధవారం

అక్షరం కూడా వద్దంటూ......!!

మౌనానికి మాటలు నేర్వాలని ఉన్నా 
భాషకు అందని భావ సంచలనాన్ని
హృదయానికి చేర్చకుండా దారి మళ్లిస్తూ
శూన్యాన్ని చుట్టంగా అప్పజెప్పి
అనంత విశ్వంలో ఆత్మని ఒంటరిని చేసి
కాలానికి కాల్పనికతను జోడిస్తూ
కదిలే చైతన్యానికి పహారా కాయాలనుకున్న
అంతర్లోచనానికి మనో విహంగ వీచికలతో
వింజామరలుగా మారిన మానస మయూరాల
మోహనపు ముగ్ధత్వాన్ని సంతరించుకున్న
మానస సరోవరాన్ని అవలోకించిన మనో నేత్రానికి
మనసుకు భారమైన భావాన్ని దూరంగా తోసేస్తూ
అక్షరం కూడా వద్దంటూ కనిపించింది ఎందుకో....!!

22, మే 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది మూడవ భాగం....!!

వారం వారం నిరాఘాటంగా సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో తెలుగు భాష, ఛందస్సు, తెలుగు సాహితీ యుగాలు, తెలుగు కవులు, తెలుగు సాహితీ ప్రక్రియల గురించి కాస్త కాస్త తెలుసుకుంటూ ఉన్నాము కదా... క్రిందటి వారం శతక సాహిత్యం గురించి తెలుసుకున్నాము ... ఈ వారం నవలా సాహిత్యం గురించి కొంత వివరణ చూద్దాం...
నవలా సాహిత్యం తెలుగు సాహిత్యంలో ప్రముఖ ప్రక్రియ. ఇది ఆధునిక కాలంలో అత్యంత ఆదరణ పొందుతున్నది... ఊహల భావావేశానికి సుదీర్ఘ కధనా కల్పనే ఈ నవలా ప్రక్రియ...

ప్రారంభ కాలం

19వ శతాబ్ది అంత్యం నుంచి తెలుగు నవలల ప్రారంభం అయింది. వీరేశలింగం కొందరు తొలి తెలుగు నవలగా, మరికొందరు పరిశోధకులు తొలినాళ్ళలోని ఒక తెలుగు నవలగా భావించే శ్రీరంగరాజ చరిత్రము వ్రాశారు. చిన్నయసూరి పంచతంత్రం వ్రాస్తూ వదిలిపెట్టిన విగ్రహతంత్రాన్ని కందుకూరి వీరేశలింగం పూర్తిచేసి ప్రచురించారు. ఆ సమయంలో మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పనిచేస్తున్న సమర్ధి రంగయ్యచెట్టి వీరేశలింగం ప్రతిభను మెచ్చుకుంటూ అభినందన లేఖ వ్రాస్తూ తెలుగులో స్వకపోలకల్పితమైన వచన ప్రబంధ రచనకు మీరు పూనుకోలేరా? అని మెచ్చుంటూనే ప్రోత్సహించే సూచనలు చేశారు. శ్రీరంగరాజ చరిత్రము ఆలోచనకు అదే మొదలు కావచ్చునని సాహిత్య విమర్శకులు భావించారు. 1892లో న్యాయవాది సుబ్బారావు సంపాదకత్వంలో వెలువడిన "చింతామణి" పత్రిక నవలను బాగా ప్రోత్సహించింది. నవలల పోటీలు నిర్వహించి నవలా సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది మరియు నవలా రచనకు కావలసిన సూత్రాలను నిర్ణయించింది. అయితే ఈ ప్రారంభకాలంలో వెలువడిన నవలలు ఎక్కువగా సంఘ సంస్కరణల ప్రాముఖ్యత కనిపిస్తుంది.

చనవల

  • నవాన్ విశేషాన్ లాతి గృహ్ణతీతి నవలా' అనగా నవీణమైన విశేషాలు తెలుపునది నవల అని కాశీభట్టబ్రహ్మయ్యశాస్త్రీ చెప్పెను.
  • నవలకు నవలా' అని పేరు పెట్టినది కాశీభట్టబ్రహ్మయ్యశాస్త్రీ.
  • చనవల :నవల అనగా స్త్రీ అని అర్థం.
  • englishలో ఉన్న novel అనే పదం ఆధారంగా నవల వచ్చింది.
  • ఇంగ్లీషులో పదాలు హలంతపదాలు.హల్లు అంతంగా ఉన్నది novel అనే పదం.
  • తెలుగు పదాలు అజంతపదాలు.అచ్చుతో అంతంగా ఉన్నది నవల అనే పదం.
  • కల్పనలతో కూడినది,సుదీర్ఘ ఊహనిర్మిత కథ నవల.
  • కథ మానవజీవిత పార్శ్వాన్ని చెపుతుంది.
  • నవల మానవ జీవితాన్ని సమగ్రంగా చెపుతుంది.
  • నవలలో కథ,కవత్వం,నాటకం ఈ మూడు ఉంటాయి.
  • నాటకం=సంభాషణ.
  • నవలను సమగ్రమైన ప్రక్రియా, సమాహార ప్రక్రియా(complete) అని అంటారు.
  • మధ్యతరగతి ఇతిహాసం అని మరొక పేరు మవలకు కలదు.
  • pocket theatre అని నవలకు ఇంకోపేరు కలదు.

నవల-లక్షణాలు

  1. వచనం కలిగినది.
  2. కథ కలిగినది.
  3. సుదీర్ఘత కలిగినది.
  4. కల్పనలు కలుగినది.

20వ శతాబ్దం

మొదటి భాగం

20వ శతాబ్దం తొలిరోజుల్లో వచ్చిన మార్పులు నవలా రచనను ప్రభావితం చేశాయి. జాతీయ భావాలు, ఆంగ్ల విద్యావ్యాప్తి, సంస్కరణోద్యమాలు, పత్రికా వ్యాప్తి, పుస్తక ప్రచురణలు, సంస్థల స్థాపన మొదలైనవన్నీ నవలా వికాసానికి తోడ్పడ్డాయి. కృష్ణాపత్రిక, దేశమాత, సరస్వతి, హిందూ సుందరి, మనోరమ, ఆంధ్రపత్రిక వంటి పత్రికలు సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలు వేశాయి. విజ్ఞాన చంద్రికా మండలి, ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల, సరస్వతీ గ్రంథ మండలి, వేగుచుక్క గ్రంథమాల వంటి ప్రచురణ సంస్థలు ఎన్నో విలువైన పుస్తకాలను ప్రచురించాయి.
మొదటగా చారిత్రక, అపరాధ పరిశోధన నవలా అనువాదాలు ఎక్కువగా జరిగాయి. దీనిని "అనువాద యుగం" అని పేర్కొనవచ్చును. బెంగాలీ భాషనుండి అనువాదితమైన నవలల్లో ఆనందమఠం (ఓ.వై.దొరస్వామయ్య), ప్రఫుల్లముఖి (కనకవల్లి భాస్కరరావు), రాధారాణి (చాగంటి శేషయ్య) వంటివి ప్రసిద్ధిపొందాయి. మలయాళం నుండి అనువాదితమైన నవల "కళావతి" (దొడ్ల వెంకటరామరెడ్డి) వచ్చింది. అప్పుడే "ఐవాన్ హో" (కేతవరపు వేంకటశాస్త్రి) వంటి ఆంగ్ల చారిత్రక నవలలు వెలువడ్డాయి.
ఈ శతాబ్దిలో తర్వాత కాలంలో స్వతంత్ర చారిత్రక నవలలు వెలువడ్డాయి. ధరణి ప్రెగ్గడ వేంకట శివరావు రచించిన "కాంచనమాల" (1908), వేంకట పార్వతీశ కవుల "వసుమతీ వసంతము" (1911), ఎ.పి. నరసింహం పంతులు వ్రాసిన "వసంతసేన" (1912), సత్యవోలు అప్పారావు వ్రాసిన "పున్నాబాయి" (1913) వంటివి ప్రసిద్ధిపొందాయి.
1900-1920 మధ్యకాలంలో సాంఘిక సమస్యలు ఇతివృత్తాలుగా వెలువడిన నవలలో వస్తు వైవిధ్యం కనిపిస్తుంది. పాశ్వాత్య ప్రభావంతో హేతువాద దృష్టి పెరిగి సమాజ సంక్లిష్టతను నవలలు చిత్రించాయి. వితంతు వివాహాలు, హరిజనాభ్యుదయం వంటి సంస్కార ప్రతిపాదకాలైన వస్తువులు కనిపిస్తాయి. నేదునూరి గణేశ్వరరావు రచించిన "సుగుణతి పరిణయము" (1903), హద్దునూరి గోపాలరావు "సుందరి" (1912), కొత్తపల్లి సూర్యారావు "కులపాలిక" (1913) వంటివి ఈ రకమైనవి. తల్లాప్రగడ సూర్యనారాయణ రచించిన "హేలావతి" (1913) ఈ కాలంలో వెలువడిన మొదటి హరిజనాభ్యుదయ నవల.
రాబోయే నవలలకు మార్గదర్శకత్వం వహించిన రచనలుగా మాతృమందిరం, గణపతి, మాలపల్లి నవలలను చెప్పుకోవచ్చును. చిలకమర్తి వారి "గణపతి" (1919) ఆ కాలంలోని బ్రాహ్మణ కుటుంబాల్లో వచ్చిన కల్లోలాలకు అద్దంపట్టిన హస్యపూరిత నవల. హరిజన సమస్యను చిత్రిస్తూ ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన నవల "మాలపల్లి" లో వ్యావహారిక భాష వాడడం విశేషం.
బారిష్టరు పార్వతీశం నవల
1920-47 మధ్య తెలుగు నవల కొత్త పోకడలు పోయింది. నవ్య సాహిత్యోద్యమం, వ్యావహారిక భాషావాదం, కాల్పనిక ఉద్యమం మొదలై నవలను ప్రభావితం చేశాయి. భాషా విప్లవం తీసుకురావాలన్న గాఢమైన తపన ఈ రచయితలలో కనిపిస్తుంది. గుడిపాటి వెంకటాచలం, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు ఈ కోవలోకి చెందుతారు. స్త్రీ స్వేచ్ఛ, స్వేచ్ఛా ప్రణయాలను చలం ప్రతిపాదిస్తే, సమాజం పటిష్టం కావాలంటే నీతి నియమాలు, కట్టుబాట్లు దృఢతరం కావాలని విశ్వనాథ భావించారు.
ఇదేకాలంలో మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు వికాసానికి తోడ్పడిన గొప్ప రచయితలు. మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం (1925) ఉత్తమ హాస్య నవల, మునిమాణిక్యం "కాంతం" అనే హాస్య ధోరణిగల తెలుగు ఇల్లాలిని సృష్టించిన ధన్యుడు. తెలుగుతనం పట్ల గాఢమైన అభినివేశంతో రచనలు చేసినవారు శ్రీపాద శాస్త్రి ఆత్మబలి, రక్షాబంధనము అనే ప్రసిద్ధ నవలలు రచించారు.

రెండవ భాగం

1947 తర్వాత కాలంలో తెలుగు నవల రాశిలోనూ, వైవిధ్యంలోను ప్రజాదరణలోను ఇది "నవలాయుగం" అనేంత ప్రాచుర్యం పొందినది. భారత స్వాతంత్ర్యానంతరం వచ్చిన నవలలను చారిత్రికాలు, సాంఘికాలు అని స్థూలంగా విభజించవచ్చును. సాంఘిక నవలల్లో ఎంతో వైవిధ్యం, భిన్న దృక్పధాలు, ధోరణులు కనిపిస్తాయి. ఈ కాలంలో నవల మధ్య తరగతి జీవితాన్ని అన్ని కోణాల్లో చూపించడానికి ప్రయత్నించింది.
కొడవటిగంటి కుటుంబరావు మధ్య తరగతి జీవితాలలోని వైరుధ్యాలను విశ్లేషాత్మకంగా చిత్రిస్తూ ఆలోచింపజేసే నవలలు రాశారు. "చదువు", "అనుభవం" మొదలైన నవలల్లో సమాజంలోని అస్తవ్యస్తత పాత్రల స్వభావాల్లో కనిపిస్తుంది. "చివరకు మిగిలేది" నవలా రచయిత బుచ్చిబాబు ది ప్రధానంగా సౌందర్య దృష్టి, అయినా సంఘమనే చట్రంలో ఇమడలేని వ్యక్తి జీవిత చిత్రణ దీనిలో కనిపిస్తుంది. చైతన్య స్రవంతి మార్గంలో మనో విశ్లేషణాత్మకంగా రచించిన గోపీచంద్ నవల "అసమర్ధుని జీవితయాత్ర" రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి "అల్పజీవి" లో కూడా ఇదే రీతి కనిపిస్తుంది. నవీన్ "అంపశయ్య"లో విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల జీవితాన్ని రచించారు. ఈ వ్యవస్థలో వర్గతత్వాన్ని చిత్రించిన బీనాదేవి "పుణ్యభూమి కళ్ళుతెరు" చాలా ప్రసిద్ధికెక్కింది.
పూర్వం నవలా రచయిత్రులు తక్కువగా ఉన్నా, ఇప్పుడు విస్తృత సంఖ్యలో స్త్రీలు రచనలు చేస్తున్నారు. వారిలో ఎక్కువమంది వాస్తవికతకు సుదూరమైన పగటి కలలను చిత్రిస్తున్నారు. జనాకర్షణ కల ప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి.
పురుష ప్రపంచంలో స్త్రీల బానిస బ్రతుకును చిత్రిస్తూ వారు తమ వ్యక్తిత్వం కొరకు పోరాడాలని ప్రబోధించే రచయిత్రి రంగనాయకమ్మ. ఆమె రచించిన "బలిపీఠం" లో సాంఘిక చైతన్యం కొరవడిన వారు వర్ణాంతర వివాహం చేసుకుంటే వచ్చే కష్టనష్టాలు చిత్రించారు. సామాజిక సమస్యలను వస్తువుగా తీసుకొని వాసిరెడ్డి సీతాదేవి రచించిన మట్టి మనిషి, అడవి మల్లి, ఇల్లిందల సరస్వతీదేవి రచించిన భవతి భిక్షాందేహి, దరిచేరిన ప్రాణులు ఇలాంటి ప్రయోజనంతో రాసిన నవలలు. స్త్రీ సెక్స్ జీవితానికి సంఘం విధించిన కట్టుబాట్లను ఎదిరిస్తూ రాసిన రచయిత్రి లత.

నవలా రచయితలు

  1. దాశరధి
  2. గుడిపాటి వెంకట చలం
  3. బుచ్చిబాబు
  4. ముప్పాళ రంగనాయకమ్మ
  5. మొక్కపాటి నరసింహశాస్త్రి
  6. అడవి బాపిరాజు
  7. విశ్వనాథ సత్యనారాయణ
  8. ఉన్నవ లక్ష్మీనారాయణ
  9. పి. లలిత కుమారి (ఓల్గా)
  10. కొడవటిగంటి కుటుంబరావు
  11. తెన్నేటి హేమలత (లత)
  12. యండమూరి వీరేంద్రనాథ్
  13. యద్దనపూడి సులోచనారాణి
  14. మధుబాబు
  15. మల్లాది వెంకటకృష్ణమూర్తి
  16. సూర్యదేవర రామమోహనరావు
  17. యర్రంశెట్టి శాయి
  18. కొమ్మూరి వేణుగోపాలరావు
  19. చల్లా సుబ్రహ్మణ్యం
  20. కవనశర్మ
  21. అర్నాద్ (హరనాధరెడ్డి)
  22. రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి)
  23. వడ్డెర చండీదాసు
  24. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
  25. చివుకుల పురుషోత్తం
ఇలా చెప్పుకుంటూ పోతుంటే నవలా సాహిత్యం గురించి ఎన్నో ఎన్నెన్నో సాహిత్యపు వింతలు మనకు నవలా సాహిత్యంలో కనిపిస్తాయి... ఈ వారం ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో సాహితీ ప్రక్రియతో కలుద్దాం...
సేకరణ : వికీపీడియా నుండి... 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

16, మే 2015, శనివారం

ఒంటరి నక్షత్రం....!!

ఎక్కడో రాలిపడుతున్న ఒంటరి నక్షత్రం
నింగికి నేలకు మధ్యన ఊగిసలాడుతూ
దశా దిశా లేని గమ్యాన్ని చేరాలనే ఆరాటంతో
ఊహల చుక్కానిని తోడుగా చేసుకుని
భవితకు భాష్యానికి చిరునామాగా నిలవాలన్న
ఆరాటాన్ని అంది పుచ్చుకుని పరుగులు పెడుతూ
అపజయాల పానుపు అనునిత్యం స్వాగతిస్తున్నా
రాళ్ళ దెబ్బలకు రాటుదేలి సూదంటు రాయిలా
చురకత్తిగా మారి అక్షరాల అస్త్ర విన్యాసంతో
అణు విస్పోటనానికి వేదికగా నిలిచి
అంతర్యుద్దాల ఆహార్యానికి అద్దం పడుతూ
మనసు మౌనానికి మాటలు నేర్పుతూ
సరి కొత్త సంకలనాల జీవితపు పుటల
బావుటాను ఎగురవేస్తూ
వేదనల నైరాశ్యాల వాదనకు స్వస్తి పలుకుతూ
తన ఉనికిని రాలిపోతున్న వేల చుక్కల లెక్కల్లో చేరనీయక
క్షణ కాలమైనా దిగంతాల వెలుగులను పరిహసిస్తూ
స్వయం ప్రకాశమై నిలవాలన్న తపనను
ఆభరణంగా చేసుకుని ఓ మెరుపై మైమరచి పోవాలన్న 
ఊహకు జీవాన్ని నింపుకుంటున్న ఒంటరైన నక్షత్రం....!!

15, మే 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ...ముప్పది రెండవ భాగం....!!

ప్రతి వారం మనం చెప్పుకుంటున్న తెలుగు సాహితీ ముచ్చట్లలో క్రినదటి వారం చంపూ సాహిత్యం గురించి కాస్త తెలుసుకున్నాము... ఈ వారం పూర్వ కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన,  ఇప్పటికీ మనం వల్లే వేస్తున్న పద్యాల సమాహారం శతక సాహిత్యం గురించి తెలుసుకుందాం..
శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.
"ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.
శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా.... అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడం లో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శతక రచనా ప్రక్రియ నాటి నుండి నేటి వరకు అవచ్చిన్నంగా కొన సాసుతూనే వున్నది. ఇక తెలుగుకు సజాతీయములైన కన్నడ, తమిళము, మళయాళము భాషలలో వెలువడిన శతకముల సంఖ్య అతి తక్కువ. కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభ మైనను ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యత ఎంత మాత్రము లేదు. తెలుగుకు మాతృక యైన సంస్కృతమున కూడ ఇన్ని శతకములు లేవు. తెలుగులో మాత్రమే శతక సాహిత్యము ప్రత్యేకతను చాటుకున్నది.

శతకం లక్షణాలు

శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని మకుటము అంటారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనునది వేమన శతకము నకు మకుటము, అలాగే సుమతీ అనునది సుమతీ శతకము నకు మకుటము, అలాగే వేంకటేశ్వరా, దాశరథీ అనునవి ఇతర ఉదాహరణములు.
సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము గురించి వేరే చెప్పాల్సిన పని లేదు.
మిగిలిన సాహిత్య ప్రక్రియలకున్న అలంకారిక, లాక్షణిక నియమాలు అనే బంధాలు శతక సాహిత్యానికి లేవు. ఛందస్సుకు అనుగుణంగా ఉంటే చాలు. విషయాన్ని ఒక పద్యంలో వెళ్ళగ్రక్కవచ్చును. లేదా 10 పద్యాలలో విస్తరింప వచ్చును. కథ చెప్పాలనీ, ముగింపు ఉండాలనీ నియమం లేదు. కనుక కవికి బోలెడంత స్వేచ్ఛ ఉంది. చదివేవాడికి కూడా రోజులతరబడి ఒకే గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిన పని బడదు. కనుక ఒక్కపద్యంతోనే కవికీ, చదువరికీ అనుబంధం ఏర్పడవచ్చును. శతకాలు క్లుప్తంగా విషయాన్ని విడమరచి చెప్పే సాధనాలు. అందుకే ఇవి ప్రజా కవిత్వముగా ఆదరణ సంతరించుకొని ఉండవచ్చును.
శతకానికుండ వలసిన లక్షణాలను ముఖ్యంగా ఐదింటిని పేర్కొన వచ్చును. అవి. 1. సంఖ్యా నియమము, 2. మకుట నియమము, 3. వృత్త నియమము, 4. రస నియమము, 5. భాషా నియమము.
1. సంఖ్యా నియమము
శతకము అనగా వంద అని అర్థము. ఏ శతకము లోనైనా వందకు పైగానె పద్యము లుండవలెను, అంతకన్న తక్కువ పద్యములతో నున్నది శతకమనిపించు కోదు. వందకు తక్కువ గానీ, ఎక్కువ గాని పద్యములున్నచో వాటి విడిగా పేర్లున్నాయి. ఉదాహరణకకు..... పది పద్యములున్నచో దశకము, ఇరవై ఐదు పద్యములతో నున్నదానిని పంచవిశంతి అనీ, ముప్పదిరెండు పద్యములు గల దానికి రాగ సంఖ్య అనీ, మూడు వందల పద్యములున్నచో త్రిశతి అనీ వాటికి ప్రత్యేకమైన పేర్లు కలవు.
2.మకుట నియమము.
శతకము లోని ప్రతి పద్యం లో చివర నున్న సంభోదనా పదమే మకుటము. ఈ మకుటము తప్పని సరిగా సంభోదన గానే వుండవలెను. ఈ సంభోదన కూడ ఒకే రీతిగా నుండ వలెను. మకుటమునకు వాడిన పదానికి సంబందించిన పదానికి పర్యాయ పదములు గానీ, సమానార్థమైన పదములు గాని వుండ కూడదు. ఒక శతకములో మకుటము. గా సర్వేశ్వరా అనే పదాన్ని వాడిన యడల అన్ని పద్యములకు అదే పదాన్ని వాడవలెను గానీ, దానికి ప్రత్యామ్నాయమైన ఇతర పదాలు అనగా విశ్వేశ్వరా., లోకేశ్వరా వంటి వాడకూడదు. కొన్ని పద్యములలో ఒక పదమే మకుటముగా నుండగా.... కొందరు కవులు ఒక పద్య పాదమంతయూ మకుటముగా నెంచుకొనిరు. ఒక పద్య పాదమంతయు మకుటము గా నున్న శతకమునకు యుధాహరణము గా వేమన శతకాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. విశ్వదాభిరామ వినుర వేమ అను మకుటము పూర్తిగా ఒక పద్య పాదము. ఆవిధంగా ఒకే పదము మకుటం నెంచుకుని వ్రాసిన శతకానికి యుధాహరణగా సుమతీ శతకాన్ని చెప్పుకోవచ్చు. సుమతీ అను ఒక పదము ఇందులోని మకుటము.
3.వృత్తనియమము
శతకము లోని మకుట నియమమును బట్టే వృత్త నియమము యేర్పడినది. తెలుగున తొలి శతకము..... మల్లికార్జున పండితారాధ్యుని శ్రీ గిరి మల్లికార్జున శతకము. ఇందలి మకుటము శ్రీగిరి మల్లికార్జునా అని యుండుట చేత నిందు చంపక మాల, ఉత్పల మాల పద్యములు తప్ప వేరు వృత్తములు ఇమడనేరవు. ఇట్లే సర్వేశ్వర అను మకుటమున్నపుడు ఆ పద్యము మత్తేభము గానీ, శార్ధూలము గాని అయి యుండవలెను. వేమన పద్యాలలోని మకుటము విశ్వదాభిరామ వినుర వేమ ఇందులో ఆటవెలది తప్ప మరొకటి వుండే అవకాశము లేదు. అలా వేరు వృత్తములను వ్రాయడాని ప్రయత్నిస్తే చందస్సు కుదరదు. కనుక శతకములో ప్రతి పద్యమూ ఒకే వృత్తంలో నుండవలెననెడి నియమమేర్పడినది.
4.రసనియమము
శతకములో యే రసము ప్రతిపాదిన రచన సాగించాలొ ముందే నిర్ణయించుకొని అందులోని పద్యములన్నియు ఆ రస ప్రధానమైనవిగానె వుండవలెను. ఉదాహరణకు భక్తి రస ప్రధానమైన శతకములో ఇతర రసాలైన, శృంగార రసము, ప్రసక్తి రాకూడదు. శతకములో ఒకరసప్రధానమైన చో అందులో ఇతర రసాల ప్రయోగముండారాదని నియమము. అలా ఆయా రసప్రధానమైన శతకములెన్నో కలవు. రసనియమముల ననుసరించి వెలువడిన శతకములలో కొన్ని ముఖ్యమైనవి....... , భక్తి శతము, శృంగార శతకము, నీతి శతకము, వేదాంత శతకము, హాస్య శతకము, కథా శతకము, సమస్యా శతకము, మొదలగునవి..
5.భాషా నియమము
శతకము లన్నియు సలక్షణమైన కావ్వ భాషలోనే యుండును. కావుననే లాక్షణికులు శతకములనుండి ప్రయోగములు వంటి వాటిని ప్రామాణికములు గా తీసుకొంటారు. కానీ తెలుగున చంద్రశేఖర శతకమని ఒకటున్నది. దానిలో చంద్ర శేఖర అనే మకుటముతో చంపక, ఉత్పలమాలిక లతోవున్నది. ఇందలి భాష అంతయూ గ్రామ్యమే.

శతక వాఙ్మయము ప్రగతి

మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారము శతక వాఙ్మయమునకు ఆద్యముగా చెప్పవచ్చును. పాల్కురికి సోమన (క్రీ.శ.1300) వృషాధిప శతకము మొట్టమొదటి సంపూర్ణ శతకము. సుమారు ఈ కాలములోనే బద్దెన సుమతీ శతకము, యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వెలువడ్డాయి. వీటి ఒరవడిలోనే తెలుగులోను, కన్నడములోను శతక వాఙ్మయము చాలాకాలం కొనసాగింది.
తరువాత తెలుగులో ఎన్ని వేల శతకాలు వచ్చాయో చెప్పడం కష్టం. ఎందరో పండితులు, కవులు, ఔత్సాహిక రచయితలు వేర్వేరు అంశాలలో శతకాలు రచించారు. భక్తి (కృష్ణ శతకము), శృంగారము (భర్తృహరి), తత్వము, వేదాంతము (బమ్మెర పోతన - నారాయణ శతకము), నీతి (సుమతీ శతకము), పొగడటం, తిట్టటం, పొగడినట్టు తిట్టడం, తిట్టినట్టు పొగడడం, వర్ణించడం, బోధించడం - అన్ని విషయాలలోనూ శతకాలు వ్రాశారు. వీటిలో చాలావరకు ముద్రణకు నోచుకొనబడలేదు.
తెలుగు వాగ్మయమున మొట్టమొదట వెలసిన శతకములన్నియి శైవమత సంప్రదాయకములు. దీనిని బట్టి తెలుగున శతక సాహిత్య ప్రక్రియకు ఆద్యులు శివ కవులే నని రూడిగా చెప్పవచ్చు.
బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వ వేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.
శతక సాహిత్యంలో ముప్ఫైకి పైగా ముస్లిం కవులు వ్రాసిన శతకాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాగే క్రైస్తవ భక్తిపరం గా కూడా చాలా శతకాలున్నాయి.

మన తెలుగులో ఇప్పటికి చెప్పుకోవాలంటే  శతకాలు సుందరంగా రాస్తున్న ఎందఱో మహానుభావులు ఉన్నారు... భాషను బ్రతికిస్తున్న వారందరికి మన తెలుగు జాతి తరపున వందనాలు
మచ్చుకి కొన్ని శతక నామాలు ... ఆ కవుల పేర్లు

  • అంతర్మథనము - కోవెల సంపత్కుమారాచార్య
  • అఘవినాశ శతకము - దాసరి అంజదాసు
  • అచ్యుతానంత గోవింద శతకములు - అద్దంకి తిరుమల సమయోద్దండకోలాహల లక్ష్మీనరసింహకుమార తిరువేంగడతాత దేశికాచార్యులు
  • అధర్మానుతాప శతకము - వేమూరి నృసింహశాస్త్రి
  • అనుగుబాల నీతి శతకము - ముహమ్మద్ హుస్సేన్
  • అన్యాపదేశ శతకము - కొమాండూరు కృష్ణమాచార్యులు
  • అభినవ వేమన శతకము - బత్తలపల్లి నరసింగరావు
  • అభినవ సుమతి శతకము - దుర్భా సుబ్రహ్మణ్యశర్మ
  • అల్లా మాలిక్ శతకము - షేక్ దావూద్
  • అశ్వత్థేశ త్రిశతి - కలుగోడు అశ్వత్థరావు

మధురమైన మన తెలుగు సాహిత్యపు నుడికారాలను, అందచందాలను ఇలా మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది... నాకు ఈ అవకాశాన్ని కల్పించిన సాహితీ సేవకు కృతజ్ఞతలు...
సేకరణ : వికీపీడియా నుండి... 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

10, మే 2015, ఆదివారం

నీ చెలిమికి సాక్ష్యంగా....!!

నేస్తం,
         ఈమద్యన పలకరింపుల భావాలు దూరమయ్యాయి మన మధ్యన ఎందుకనో... అంతరాలు, ఆంతర్యాలు ఒకటైనా పెంచుకున్న బంధం ఒక్కోసారి ఇలానే దూరంగా ఉండి పోతుంది కాబోలు పంచుకునే మౌనాలు మాటలు నేర్చితే... నిశ్చలమో, నిస్తేజమో అర్ధం కాని అయోమయం వెన్నాడుతోంది మదిని... అవిశ్రాంతంగా పని చేసే మెదడు విస్పోటనం చెందితే కలిగే వేదన ఒక్కసారిగా చుట్టుముట్టినట్టుగా అనిపిస్తోంది.... గంభీరంగా కనిపించే సాగర లోపలి స్థావరం ఎన్ని సుడిగుండాలను దాచుకుందో, ఎన్ని అగ్ని పర్వతాలను చల్లబరచడానికి నిరంతరం యత్నిస్తూ... అన్ని తనలోనే దాచుకుంటూ ... చూపరులకు తీరాన్ని అందంగా అలల సవ్వడితో సందడి చేస్తోందో నీకు తెలుసు కదా... ఏంటో ఎప్పుడు సముద్రం దగ్గరకే పోతుంది నా ఆలోచన... ఎందుకో మరి అంత ఇష్టం ఈ అనంత సాగరమంటే... ఏది మనం ఇచ్చినా మళ్ళి ఒడ్డుకే చేరవేయడం, ఎన్ని నదుల ప్రవాహాలనైనా తనలో ఒద్దికగా ఇముద్చుకొవడం, ఎప్పుడో తప్ప తనలోని బడబానలాన్ని చూపని సముద్రం ఎందుకో ఎప్పుడూ నచ్చేస్తుంది నాకు...నాకు దానికి దగ్గర పోలికలున్నాయనేమో మరి... అంతే తెలియని సాగరము, కనిపించని మది అలజడి, రెండు సారూప్యంగా అనిపిస్తాయి... చిరునవ్వు చాటున దాగిన కాలిపోయిన స్వప్నాలను చూస్తూ కన్నీటితో చెలిమి చేస్తున్నా తడి ఆరిపోయిన కళ్ళకు తెలిసిన నిర్జీవ రూపాన్ని బయట పడనీయని మనోనేత్రాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించే నీ చెలిమికి సాక్ష్యంగా ఇలా ఉండిపోతూ....
నీ
నెచ్చెలి 


8, మే 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పై ఒకటవ భాగం....!!

క్రిందటి వారం పద్య కవితా సాహిత్యం గురించిన కొన్ని వివరణలు తెలుసుకుంటున్నాము కదా... ఈ వారం మన తెలుగు సాహితీ ముచ్చట్లలో  చంపూ రీతి గురించి కొద్దిగా తెలుసుకుందాం...
చంపూ సాహిత్యం :
చంపూ రీతి అనగా  పద్య కవితలు, వచన కవితలు రెండూ కలిగి భాసిల్లుతుంది.

 చంపూ కావ్యము:
ఇందులో గద్యమూ, పద్యమూ ఉంటుంది; మనము దీనిని ప్రబంధం అనవచ్చును. ఇందులో విభాగాలు యధేష్టంగా ఉంటవి. కాండవిభాగం, గుచ్చవిభాగం, స్తబకం, ఆశ్వాసం ఇంకా ఓచిత్యానుసారంగా ఏవైనాసరే!
సిద్ధహేమచంద్రుడు తన కావ్యానుశాసనమ్ లో వేరొక విధంగా కావ్య భేధ పరిగణం చేస్తున్నాడు. ప్రేక్ష్యమనీ, శ్రవ్యమనీ. ప్రేక్ష్య కావ్యం కూడా పాఠ్యమనీ, గేయమనీ రెండు విధాలున్నవి.

 ప్రబంధము:
తెలుగు కవిత్వంలో 15వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన ప్రక్రియా భేదం ప్రబంధం. ప్రకృష్టమైన పదబంధమున్న కావ్యం ప్రబంధము.
 చరిత్ర
ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. ఎర్రనకు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉన్నది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉన్నది. నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.
పెద్దన రాసిన మనుచరిత్ర బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. వచ్చిన వసుచరిత్ర మనుచరిత్రకు మించిన కవిత్వం కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహత్మ్యం, పింగళి సూరన కళాపూర్ణోదయం, చేమకూర వెంకటకవి రాసిన విజయవిలాసం వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.

లక్షణాలు

ప్రబంధ లక్షణాలను పలువురు విమర్శకులు ఇలా వివరించారు.
  • పింగళి లక్ష్మీకాంతం: ప్రబంధమునకు ఏక నాయకాశ్రయత్వము, దానితోపాటు వస్త్వైక్యము ప్రధాన ధర్మములు. ప్రబంధము అష్టాదశ వర్ణనాత్మకమై యుండవలెను. అందు శృంగారము ప్రధాన రసము. ఆవశ్యకతను బట్టి తక్కిన రసములు గౌణములు కావచ్చును. ఆలంకారిక శైలి ప్రబంధమునకు జీవము. ప్రబంధము భాషాంతరీకరణము కాకూడదు. స్వతంత్ర రచనయై యుండవలెను. పదునారవ శతాబ్ది ఆది నుండీ వెలువడిన మనుచరిత్రాది కావ్యములన్నిటికి పైన పేర్కొన్న లక్షణములన్నియు సమగ్రముగా పట్టినను, పట్టకున్నాను, స్వతంత్ర రచనలగుట చేతను, ఆలంకారిక శైలీ శోభితములగుట చేతను అవన్నియు ప్రబంధములుగానే పరిగణింపబడినవి.
  • కాకర్ల వెంకట రామ నరసింహము: కథైక్యమును అష్టాదశ వర్ణనలును గలిగి శృంగార రస ప్రధానమై, అర్థాతిశాయియైన శబ్దమును గ్రహించి యాలంకారిక సాంకేతికములకు విధేయమై, ఆనాటి విస్తృతిగల యితివృత్తముతో, భాషాంతరీకరణముగాక, స్వతంత్రరచనయేయైన తెలుగు కావ్యము ప్రబంధము. అయితే పైని వివరించిన లక్షణములు కొన్ని ప్రబంధములందు గానరాకున్నను నాయా యుగధర్మ ప్రాధాన్యము బట్టియు, రచనా ధోరణి బట్టియు నవియు బ్రబంధనామముననే వ్యవహరింపబడుచున్నవి.
  • దివాకర్ల వేంకటావధాని: ధీరోదాత్త నాయకములును, శృంగార రస ప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములు ఆలంకారిక శైలిలో వ్రాయబడినవి- వీటికే ప్రబంధములని పేరు.
  • సి.నారాయణరెడ్డి: ప్రబంధము యొక్క లక్షణములు నాలుగు.
ఒకటి: కథానాయకుని యొక్క తృతీయ పురుషార్థమునకు(కామమునకు) చెంది ప్రాయికముగా తద్వివాహ సంబంధియగుట.
రెండు: శృంగారము అంగీరసముగా నుండుట.
మూడు: వర్ణన బాహుళ్యము కలిగియుండుట.
నాలుగు: రీతి ప్రాధాన్యము కలిగి యుండుట.
  • వేల్చేరు నారాయణరావు: పురాణామార్గం కథనమార్గం, ప్రబంధమార్గం వర్ణనమార్గం. ప్రబంధానికీ, పురానానికి తేడా కథనం వర్ణన-వీటి ఎక్కువ తక్కువలలో మాత్రమే వుందనే అభిప్రాయం బలపడింది.

చరిత్ర రచనలో

తెలుగు ప్రబంధాలకు అప్పటి స్థితిగతులను కాక కవుల ఊహాలోకాలనే అద్దంపట్టాయన్న అపప్రధ ఉన్నా చాలామంది పండితులు, చరిత్రకారులు వీటికి చరిత్ర రచనలో ఎంత ప్రాధాన్యత ఉందో, ఆనాటి స్థితిగతులు ప్రబంధాల్లో ఎలా ప్రతిబింబించాయో వివరించారు. ప్రబంధ యుగంగా వర్దిల్లిన విజయనగర సామ్రాజ్య కాలంలోని ఆచారాలు, వ్యవహారాలు, జీవనశైలి వంటివాటికి ప్రబంధాలు ప్రతిబింబాలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యంలో 15-16 శతాబ్దుల కాలంలో పర్యటించిన పలువురు విదేశీ యాత్రికులు నమోదుచేసిన చరిత్రలో ఏదైనా సంస్కృతికి సరిపోలని విషయం ఉన్నా, స్పష్టత కావాల్సివచ్చినా వారేమి సూచిస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రబంధాలు పనికివచ్చాయి. ప్రబంధాల్లో జలక్రీడల వర్ణనం, సుగంధ ద్రవ్యాల వినియోగం, వారకాంతల వివరాలు, జాతరలు - మొక్కుబళ్ళు, సైనిక ప్రయత్నాలు వంటివాటి వర్ణనలు సామాజిక చరిత్ర నిర్మాణంలో ఉపకరిస్తున్నాయి.

ఉదాహరణలు

  1. మనుచరిత్ర
  2. సంస్కృతమునందలి మాలవికాగ్నిమిత్రము
  3. ఆముక్త మాల్యద
  4. నాలాయిర దివ్య ప్రబంధము-తమిళము
  5. ముకుందవిలాసము
  6. వీరభద్ర విజయము

చంపూ సాహిత్యంలో కావ్యం, కవనం రెండు మిళితమై ఉన్నాయి .. పద్యం, గద్యం కలసినది కావ్యం... పద్యం , వచనం కలసినది కవనం... అని కొన్ని ఉదాహరణలు చూసాము...ఈ సాహితీ ముచ్చట్ల ప్రయాణంలో తెలియని ఎన్నో విషయాలను మీతో పాటుగా నాకు నేర్చుకునే అవకాశాన్ని అందిస్తున్న సాహితీ సేవకు కృతజ్ఞతలతో ....... ఈ సాహితీ సంద్రాన్ని ... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం.... 


సేకరణ : వికీపీడియా నుండి, మరికొన్ని అంతర్జాల సమూహాల నుంచి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

6, మే 2015, బుధవారం

మది అలజడి....!!

కాగితంపై కలంలో ఇమిడి
మనసెలా ఒలికిందో చూడు
నీ భావాలను పలికిస్తూ

అక్షరాలెంత హృద్యంగా
హత్తుకున్నాయో చూడు
నాలో నిన్ను దాచేస్తూ

పలకరింతలను తలపిస్తూ
పరవశాన్నెలా దాచేస్తున్నాయో చూడు
మరెవరైనా దోచేసుకొంటారనేమో

జ్ఞాపకాలకు గుబులై పోతూ
వెన్నంటే వస్తున్నాయి చూడు
గతంలోనే వదిలేస్తావేమోనని భయపడుతూ

ముగింపు తెలియని కథలా
మునుపెన్నడూ లేని కధనమైంది చూడు
మది అలజడి ఇలా సాగిపోతూ....!!

3, మే 2015, ఆదివారం

పి వి పి సిని పోలిస్ విజయవాడ ఘనకార్యం...!!

మోసం మన కళ్ళ ముందే జరుగుతున్నా.. దానికి బాధితులం మనమే అయినా కూడా నోరు మెదపని పరిస్థితి నిన్న
చూసాను... నిన్న ఉత్తమ విలన్ సినిమాకి 10.45 పి ఎమ్ షో  పి  వి పి విజయవాడలో సిని పోలిస్ స్క్రీన్ 2 కి  వెళ్ళాము.. సినిమా చూస్తూనే ఉన్నా విశ్రాంతి ముందే ఏ  సి ఆపేశారు.. విశ్రాంతి అప్పుడు కొంత మంది గొడవచేసి కాసేపు సినిమా వేయకుండా ఆపేస్తే ఏదో వేశాము అని మళ్ళి ఏ సి వేసినట్టు వేసి వెంటనే ఆపేశారు... సినిమా టికెట్ డబ్బులు మాత్రం వందలకు వందలు తీసుకుంటున్నారు.. మరి ఈ కక్కుర్తి ఎందుకో... కార్పోరేట్ లెవెల్లో మోసాలు ఇలానే ఉంటాయి కాబోలు... మా చిన్నప్పుడు టూరింగ్ టాకీస్ లో సినిమా చూసేటప్పుడు విశ్రాంతి తరువాత అది సినిమా అయిపోయే ముందు కాసేపు ఫాన్ లు ఆపెసేవాళ్ళు.. అదీ కిటికీలు తీసి మరి... కాని ఈ బడా బాబులు  కనీస జ్ఞానం లేకుండా మందు వేసవి కాలం.. కనీసం ఎక్కడా చీమలు కూడా చొరబడని ఆధునిక సినిమా హాల్లో ఇలా చేయడం.. చాలా బాధాకరం.. చర్యలు ఎలా తీసుకోవాలో మరి.. లేదా నలుగురితో నారాయణా అని ఊరుకోవాలో తెలియడం లేదు.. పేరుకి మాత్రం పెద్ద పెద్ద అత్యాధునిక సౌకర్యాలు.. కాని ఇంగిత జ్ఞానం లేని బుద్దులు ఈ పెద్ద వారివి...!!

యువతకు మార్గదర్శకుడు....!!

 ఎక్కడో తెనాలిలో పుట్టి ఈనాడు ప్రపంచంలో గుర్తింపు పొందిన అతి కొద్ది మంది మేధావుల్లో ఒకరు శ్రీ ఎమ్ ఎన్ ఆర్ గుప్త. మిడిల్ ఈస్ట్ దేశాల్లో లెక్కకు మించి పురస్కారాలు.. దేశపు రాజరికపు అధికారుల మెప్పును పొందిన ఏకైక వ్యక్తి... పురస్కారాల రికార్డుల వెనుక జీవితపు ఆటు పోట్లు ఎలా విజయానికి సోపానాలుగా మారాయో... నేటి యువ తరానికి స్పూర్తిదాయకంగా నిలిచిన యువ మేధావి శ్రీ ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారి గురించి...సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సరస్వతీ మానస పుత్రుడు చిన్నతనం నుంచి చదువులో మేటిగా ఎదిగి ఉన్నత విద్యను NIT Warangal MTech( Transportation) లో అభ్యసించి స్వదేశంలో కొన్ని రోజులు పని చేసి తరువాత తన ప్రతిభకు తగిన గుర్తింపు కోసం ఒమన్ దేశంలో Dec 2003 లో తన ప్రస్థానాన్ని పెట్రోలియం ప్రాజెక్టులో ప్రాజెక్ట్ ఇంజనీరుగా మొదలు పెట్టి ఒమన్ లో ఇన్ ప్రాస్ట్రక్చర్ రంగంలో రెసిడెంట్ ఇంజనీరుగా పనిచేస్తూ అనుకున్నది సాధించి రోజున ఎమ్ ఎన్ ఆర్ గుప్త ఆంటే తెలియనివారు లేరని నిరుపించుకున్న ఘనులు...సమస్యకు భయపడక మీ సమస్యను నాకొదిలేయండి... పరిష్కారం నేను చూపిస్తా అన్న ఆత్మ విశ్వాసం ముందు ఎంతటి సమస్యైనా తలను వంచక తప్పలేదు... అది ఎమ్ ఎన్ ఆర్ గారి ఆత్మ విశ్వాసం....

ఎప్పటికైనా భారత దేశం సూపర్ పవర్ గా ఎదగాలని నిరంతరం కష్టపడి పదిహేడు ఏళ్ళు అనేక ప్రపోజల్స్(సిద్దాంతాలు) రూపొందించి సమాజం అభివృద్ధి చెందటానికి అత్యంత కీలకమైన రంగం మౌలిక సదుపాయాలు అందించడం అని బలమైన వాదన వినిపిస్తూ..." Development of Transportation sector to reach vision 2020"  ప్రత్యేక ప్రపోజల్ రూపొందించి... అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 2002లో అందచేశారు. చంద్రబాబు ఆనాడు చాలా ఘనంగా ప్రచారం సాగించుకున్న విజన్ 2020 ప్రోగ్రాంలో గుప్త ప్రతిపాదించిన సిద్ధాంతాలను యధాతథంగా వినియోగించుకున్నారు.ఇవే కాకుండా 2003లో కర్నాటక ముఖ్యమంత్రిగా ఎస్ ఎం కృష్ణ ఉన్నప్పుడు,   ఆయన స్వయంగా గుప్తను ఆహ్వానించి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకున్నారు.తరువాత 2008లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరియు ఆర్ధిక మంత్రి రోశయ్య గారు infrastructure development మరియు project management కోసం సలహాలు సూచనలు తీసుకున్నారు...
  గుర్తింపులతో సరి పెట్టుకొనక  దేశ ఆర్ధిక పురోభివృద్ధికి ఐటి రంగం చాలా చేయూతనిస్తుందని చెబుతూనే దానికంటే ఎక్కవ ప్రాధాన్యం ఇవ్వాల్సిన రంగం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అని ఖచ్చితంగా తన వాదన వినిపిస్తూ దానికి తగిన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వాలి అన్న తన ఆలోచనను అంతర్జాతీయ, జాతీయ వేదికలపై కీ నోడ్ స్పీకర్ గా వ్యక్త పరుస్తూ.... గడచిన అరవై ఏళ్ళ కాలమంతా అభివృద్ధికి బాటలు వేయాల్సిన రంగం నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేస్తూ... అభివృద్దికి బాటలు వేసే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రహదారుల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే దేశ ఆర్ధిక పురోగతికి స్థిరమైన ప్రగతికి బాటలు వేస్తుందని... దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంథానం చేస్తూ విశాలమైన రహదారులు, అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, నౌకాశ్రయాలు, నీటి ప్రాజెక్టులు, నీటి పారుదల వ్యవస్థ, రైలు మార్గాలు ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనే దేశ భవితకు తిరుగులేని రాచమార్గాలని సోదాహరణంగా వివరిస్తున్నారు...ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి అభివృద్ధి చెందిన 160 దేశాల్లోని స్థితిగతులను అధ్యయనంచేసిన అనుభవాన్ని మేళవిస్తూ... భారతదేశ సహజ ఒనరులను, మానవ ఒనరులను, చక్కని ప్రతిభ ఉన్న యువతను కాస్త సానపట్టి, రాజకీయ, విద్యా రంగాలలో మార్పులు చేస్తూ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ....ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి తాను సమిధగా మారి నిరంతరంగా కృషి చేస్తున్న శ్రీ ఎమ్  ఎన్ ఆర్ గుప్త గారు ఈనాటి యువతకు రేపటి నవతకు దిశా నిర్దేశకులు అనడంలో అతిశయోక్తి ఏమి లేదు... 
భీమవరంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి కష్టనష్టాలను భరించి చదువులో మెండుగా రాణించి ఉన్నత శిఖరాలను అందుకుని ఈనాడు ప్రపంచ మేధావులతో శబాష్ అనిపించుకున్న అతి పిన్న వయసు అపర మేధావి మనోగతంలో తన దేశం, తన రాష్ట్రం ప్రపంచంలో ప్ర ప్రధమ స్థానంలో ఉండాలన్న చిన్న కోరిక  పెరిగి పెరిగి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బలీయమై తను ఎన్నో పరిశోధనలు చేసిన infrastructure project management రంగంలో మెళకువలు తనవారికే ఉపయోగపడాలన్న బలీయమైన కోరికతో స్వదేశానికి తన సేవలను అందించడానికి ముందుకు వచ్చిన తెలుగు తేజం... ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం అన్న నడవడితోవిదేశాల్లో సైతం తెలుగు వారికి అజాత శత్రువై తన అండ దండలు అందిస్తూ... అందరి అభివృద్ధితో పాటుగా తన దేశం, రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుండాలని ఆరాటపడుతూ... ప్రపంచానికి తెలుగువాడి సత్తా ఏంటోనిరూపించిన శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్త గారు చరిత్రలో చిరస్మరణీయులు... రాబోయే రోజుల్లో infrastructure రంగంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర సృష్టిస్తారనడంలో ఏమాత్రము సందేహం లేదు...

ఎన్నోఅత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు, సత్కారాలు విదేశీయుల చేతుల మీదుగా పొంది స్వదేశ కీర్తిని ప్రపంచానికి తెలియజెప్పి భారతీయత విలువతో పాటు తెలుగు'వాడి' మేధోసంపత్తిని తేటతెల్లం చేసి పిన్న వయసులోనేఎంతో ఎత్తుకు ఎదిగిన తెలివితేటల భాండాగారం మన తెలుగు వారిదే అని.. తెలుగు నేల పులకరిస్తోంది సంతోషంతో....ఈనాటి యువతకు రేపటి నవతకు దిశా నిర్దేశకులు, స్పూర్తిదాయకులు అయిన శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్త గారు దేశ విదేశాల్లో ప్రాజెక్ట్ మానేజ్మెంట్ పై అందుకున్న ప్రశంసలు, అవార్డుల, రివార్డుల జాబితాలు పరిశీలిస్తే వారి ప్రతిభ గురించే చెప్పడానికి మాటలు చాలని పరిస్థితి...నిజంగా చెప్పాలంటే మన దేశంలో కన్నా విదేశాల్లో ఆయన చూపిన ప్రతిభకు ఒక తెలుగు వాడిగా ఎవరికి దక్కని ప్రతిష్టాత్మక గుర్తింపు విదేశీయులు ఇచ్చారంటే వారి మేధకు మరియు 20 సంవత్సరాల అవిశ్రాంత కృషికి కొలమానం ఏమిటో మనకు తెలుస్తుంది...ఒమన్ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2200 కిలో మీటర్ల రైల్వే నెట్ వర్క్ ప్రాజెక్ట్ విజయవంతంగా నిర్వహించడం కోసం ఆగష్టు 2014 లోఅంతర్జాతీయ నిపుణులతో మస్కట్ లో జరిగిన సమావేశంలో దేశ విదేశ ప్రముఖులతో పాటు భారత దేశం నుంచి అతి చిన్న వయసులో proactive project maangement , Integrated Transportation Planning కి సంబంధించిన టెక్నికల్ key note presentation మరియు పానల్ డిస్కషన్ మెంబర్ గా అమెరికా, లండన్ నిపులులతో పాటు గుప్త గారు ఇచ్చిన సలహాలు విశేష ప్రశంసలు అందుకున్నాయిఅంతర్జాతీయ నిపుణులలో అద్వితీయ ప్రతిభను కనబరిచి అందరి మెప్పును పొంది ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్న ఏకైక భారతీయుడు తెలుగు తేజం  

మన దౌర్భాగ్యం ఏమిటంటే క్రీడలకు ఉన్న గుర్తింపు మేధస్సుకు లేకపోవడమే.. అందుకే మేధావులు అందరు వలసలు వెళ్ళిపోయారు... కాని గుప్తా గారి లాంటి కొందరు మాతృ దేశంపై మమకారాన్ని చంపుకోలేక ఎక్కడ ఉన్నా పురిటి గడ్డ గొప్పగా ఉండాలని కోరుకుంటూ తమ సాయాన్ని అందిస్తూ ముందుకి రావడం మరింత మందికి ఆదర్శప్రాయం....!! 
  
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner