6, మే 2015, బుధవారం

మది అలజడి....!!

కాగితంపై కలంలో ఇమిడి
మనసెలా ఒలికిందో చూడు
నీ భావాలను పలికిస్తూ

అక్షరాలెంత హృద్యంగా
హత్తుకున్నాయో చూడు
నాలో నిన్ను దాచేస్తూ

పలకరింతలను తలపిస్తూ
పరవశాన్నెలా దాచేస్తున్నాయో చూడు
మరెవరైనా దోచేసుకొంటారనేమో

జ్ఞాపకాలకు గుబులై పోతూ
వెన్నంటే వస్తున్నాయి చూడు
గతంలోనే వదిలేస్తావేమోనని భయపడుతూ

ముగింపు తెలియని కథలా
మునుపెన్నడూ లేని కధనమైంది చూడు
మది అలజడి ఇలా సాగిపోతూ....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner