నాకో అనుమానం చాలా రోజుల నుంచి ఉండి పోయింది... ఈ అంతర్జాలంలో అదీ ముఖ పుస్తకంలో కనిపించే అమ్మాయిలంటే చాలామందికి చాలా తేలిక భావం ఉన్నట్లుగా ఉంది... చిన్నా పెద్దా తేడా లేకుండా కనిపించని మనసు నచ్చిందని.... లేదా ఫోటో నచ్చిందని.... ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది... ప్రేమిస్తున్నా అంటారు అసలు ఈ ప్రేమలకు అర్ధం ఏమిటో మరి... మనను సృష్టించిన ఆ సృష్టికర్తకే ఎరుక... ఎవరికి వారు తమ భావాలను పంచుకోవాలనో లేదా తమకున్న కళను మెరుగు పరచుకోవాలనో... నలుగురి మెప్పు పొందాలనో మనసుకు అనిపించిన భావనలకు తమకు చాతనైనట్లుగా అక్షర రూపాన్ని ఇస్తూ పది మంది మెచ్చుకుంటే సంతోషపడిపోతూ ఉంటారు... అంతే కాని ఏ వ్యాపకం లేక కాదు, బంధాలు బాధ్యతలు మరచి కాదు... మనకి నచ్చిన వారికి మనం నచ్చాలి అని లేదన్న చిన్న నిబంధనని మర్చిపోతున్నారు... ఎందుకో...
భగవంతుడు మనకు ఇచ్చిన ఈ జీవితం చాలా చిన్నది... అయినా దానిలోనే అన్ని అనుబంధాలను మనకు అందించాడు ఆ దేవుడు... అరి షడ్వర్గాలతో పాటు అందమైన ఆస్వాదనలను, అంతులేని అభిమాన ధనాలను కూడా అందించాడు.... ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండు ఉంటాయి... మనం చెప్పేది ఎదుటివారు మారు మాటాడక వింటున్నారు అంటే అది మన మాటల గొప్పదనం కాదు... వివే సహనం ఉన్న వారి మంచితనం...దయచేసి అంతర్జాలంలో ఆడవారిని చిన్న చూపు చూడకండి... గొప్పదనం ఎవరిలో ఉన్నా సహృదయంతో స్వాగతించండి... సహనానికి పరీక్ష పెట్టకండి...రాయకూడదనుకున్నా రాయక తప్పలేదు... ఎవరినైనా నొప్పిస్తే పెద్ద మనసుతో మన్నించండి... !!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి