4, నవంబర్ 2015, బుధవారం

మీరే చెప్పండి..!!

ఏమిటోనండి ఈ కార్పోరేట్ అన్న పదం వింటుంటేనే చీదరగా అనిపిస్తోంది ఈ మధ్య కాలంలో... మొన్నీమధ్య
కార్పోరేట్ స్కూల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందో నాలుగు మాటలు చెప్పాను... ఎంత చెప్పొద్దు అనుకున్నా వెధవ మనసు ఉండబట్టి చావడం లేదు.. కార్పోరేట్ దవాఖానాల గురించి కాస్త నాలుగు మాటలు మాట్లాడాలి... ఇప్పుడు వచ్చిన ఇన్షూరెన్స్ కంపెనీల వలన నాలుగు రోజులు హాస్పటల్ లో ఉంటే పద్నాలుగు రోజులకు బిల్లులు పెట్టి ఘరానాగా దోచేస్తున్నారు.. ఒక హాస్పటల్ అని లేదు అన్ని కార్పోరేట్ హాస్పటల్స్ ఇలానే ఉన్నాయి... మనకేమో ముందు 40000 అని చెప్పి సంతకాలు అక్కడా ఇక్కడా పెట్టించేసుకుని 140000 బిల్లు తో 5 రోజులు అవసరం లేక పోయినా హాస్పటల్ లో ఉంచేసి అది వస్తే కాని పంపము అని మరో 3 రోజులు ఉంచుకుని ఆ డబ్బులు కూడా మనమీదే నవ్వుతు వేసేసి కట్టమంటుంటే ఏం చేయాలి ఈ ఘరానా మోసగాళ్ళను... చదువుతో వ్యాపారం ఒకరు... చదువు కొని ఆ కొన్న డబ్బులు రావడానికి ఈ తెలివి ఉపయోగిస్తుంటే ఇలాంటి సమాజాన్ని భరిస్తున్న మనదా తప్పు లేక ఆ తప్పుల్లో మనకు భాగముందని సరిపెట్టుకుని నలుగురితో నారాయణా అంటూ బతికేద్దామా మీరే చెప్పండి..!!
( ఇది ఓ సంఘటన మాత్రమే... ఇలాంటివి రోజు కోకొల్లల్లు )

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

కార్పోరేట్ అన్న పదం వింటుంటేనే చీదరగా అనిపిస్తోంది.
కార్పోరేట్ స్కూల్స్ లో లానే కార్పోరేట్ దవాఖానాలూనూ .... ముందు 40000 అని చెప్పి సంతకాలు పెట్టించేసుకుని 140000 బిల్లు కట్టమంటూ
ఏం చేయాలి ఈ ఘరానా మోసగాళ్ళను
చదువుతో వ్యాపారం ఒకరు
చదువు కొని ఆ కొన్న డబ్బులు రావడానికి మరొకరు
( ఇది ఓ సంఘటన మాత్రమే .... ఇలాంటివి రోజు కోకొల్లల్లు సమాజాన్ని కుళ్ళబొడుస్తూ )
వాస్తవానికి చక్కని అక్షర రూపం ఎందరో సామాన్యుల జీవితానుభవం ఈ పోస్టింగ్
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

Dhanyavadalu andi

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner