
నన్ను చాలా మంది చిన్న చూపు చూశారు అలా అని నేను అమ్మ భాషనూ వదలలేదు.. అమ్మను వదులుకోలేదు... మాటలు రావన్నారని మాటలు మరచిపోలేదు .. నా ముందే వెకిలిగా నవ్వారు పట్టించుకోలేదు... ఎప్పటికయినా గెలవాలన్న తపన ఉండేది.. నా కోసం నేను రాసుకున్న నా అక్షరాలు నాకు అందించిన ఓదార్పు కానివ్వండి, ధైర్యం అనుకోండి .. దానికి ఏ పేరు పెట్టినా 500 పై చిలుకు ఉన్న కవితల్లో 135 కవితలను "అక్షరాల సాక్షిగా... నేను ఓడిపోలేదు " అన్న వచన కవితా పుస్తకంగా ఆవిష్కరిస్తే.. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆత్మీయుల అభిమానం ముందు కనీ వినీ ఎరుగని రీతిలో అక్షరానికి ఓటమే లేదని నిరూపించారు... ప్రత్యక్షంగా.. పరోక్షంగా అభినందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతా వందనాలు _/\_ ....!!
6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఎవరేమనుకున్నా మీరు అమ్మను మరువలేదు, సంతసం
Great work Manju- Pramod
బావ్హుకతంటే చిన్న చూపు, వచన కవిత్వం కూటికి గుడ్డకు రానిదని
హంసలదీవిలో ఉన్నా అమెరికాలో ఉన్నా భావాలను ఇతరులతో పంచుకునే వారధి .... భాష
చిన్న చూపు చూసినా ....
మాటలు రావన్నా ....
వెకిలిగా నవ్వినా
గెలవాలన్న తపన పట్టుదల ....
అక్షరాలు అందించిన ఓదార్పు ధైర్యం
అందుకే ఆ విశిష్టత కవయిత్రి మంజు గారిలో
అభినందనలు
థాంక్యూ
ధన్యవాదాలు అండి
ధన్యవాదాలు అండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి