8, ఏప్రిల్ 2017, శనివారం

కొన్ని రాతలు...!!

నేస్తం,
      రాయడం మనకు వచ్చు కదా అని ఏ రాతలు పడితే ఆ రాతలు రాస్తుంటే చదవడానికి సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. రానురాను మనలోని సంస్కారం కూడా సిగ్గుతో తలా దించుకోవాల్సిన తరుణం. కొన్ని రాతలు చూస్తుంటే అసలు వీళ్ళకు అహంకారపు రాతలు తప్ప మంచి చెడు గురించి రాయడం రాదేమో అనిపించింది. రెండు కుటుంబాల్లో వచ్చిన సమస్యకు ఒక జాతినే అవహేళన చేస్తూ అసభ్యకర రాతలు రాయడం అనేది విజ్ఞులకు ఎంత వరకు సబబుగా అనిపిస్తోంది..? ఈ రోజు కొన్ని పోస్ట్స్ చూసాక వాటికి మూలమైన రాతను చూసాను అన్వర్ గారు అంట రాసింది .. మధుకర్ ఉదంతానికి అగ్ర జాతుల స్త్రీల గురించి అంత హేయంగా రాయడానికి కాస్తయినా సంస్కారం అడ్డు రాయలేదేమో(సంస్కారం లేదేమో అనిపించింది). వారిని కన్నది కూడా ఓ ఆడదే కదా. నాకు  కనిపించింది ఆ రాతల్లో మగవాడిని అన్న అహంభావం( నేను ఇలా రాయడం తప్పేమో నాకు తెలియదు కానీ అంగం, లింగం గొప్పదనం మాత్రం చెప్పారు వారి దృష్టిలో ), అగ్ర కులాల మీద తనకు ఉన్న అక్కసు. దానికి ఈ మధుకర్ పావుగా మారాడు.  ఆడది లేకుండా ఈ మగ వెధవలు మగాళ్ళు గా ఎలా అయ్యారో గుర్తుంచుకుంటే బావుంటుంది. చాలా మంది అందని ద్రాక్ష పుల్లనలా ఇలా పడి ఏడుస్తూ ఉంటారు కాబోలు. అమ్మ,ఆలి, అక్క, చెల్లి, పసిపిల్ల తేడా లేకుండా డబ్బుల కోసం తార్చినప్పుడు ఏ నా కొడుక్కి ఆడది అని గుర్తు రాలేదా. ఇంకా చాలా రాయాలనే ఉంది కానీ .. మాది స్త్రీ జాతి. అగ్ర, నిమ్న జాతి అని మాకు తేడా లేదు. మంచి చేదు అనేవి అందరిలో ఉంటాయి. తప్పుని తప్పు అని ఉప్పుని ఒప్పు అని చెప్పండి, అంతే కానీ కులాల ముసుగులు, రాజకీయపు కుతంత్రాలు, చాణక్య నీతులు వల్లించకండి మీ పేర్ల కోసం, గొప్పదనం కోసం.
మహనీయుడు అంబేద్కర్ గారి గురించి రాసిన వెంటనే ఇలాంటి పోస్ట్ రాయడానికి నేను చాలా బాధపడుతున్నాను.
మీ జాతి మగతనమే మీ ఆడవారు వేరే వాళ్ళకు దగ్గరవకుండా చేస్తోంది అన్న మీ భ్రమను కాస్త వీడి నిజాలు ఒప్పుకోవడానికి ప్రయత్నించండి.
 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner