22, ఏప్రిల్ 2017, శనివారం

నిమజ్జనం...!!

మరుగున దాయలేని గతాన్ని
మనసు నుండి తరిమేయాలని
రాలిపోతున్న అనుబంధాలను  
కనుమరుగు కానీయరాదని
కలవరాల కనుపాపలలో 
సేదదీరుతున్న స్వప్నాలను
కలత నిదురలో ఉలిక్కి పడనీయరాదని
చెదిరిపోతున్న వాస్తవాన్ని
చెంతకు చేర్చుకోవాలని
ఆరాటాల అంతర్యుద్దాలను
అట్టడుగునే అణచి వేయాలని
నిమజ్జనానికి చేరువగా చేరిన
దేహాన్ని ఆశల కొలిమిలో చేర్చి
అంపశయ్యల పంపకాలు అవలోకిస్తూ
మది అంతర్ముఖంలో ప్రతిబింబమయ్యింది...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner