19, ఫిబ్రవరి 2018, సోమవారం

ద్విపదలు..!!


1.  నీటి మీది రాతలంతే
తేలిపోతూ చులకనౌతున్న బంధాలై..!!

2.  కొన్ని మాటలంతే
మరువలేని బాసలుగా...!!

3.  మనసు మాట్లాడేస్తోంది
జీవితంలో నిర్మలత్వానికి ఓ అర్ధాన్నిస్తూ...!!

4.  నైతికత ఇస్తుందేమెా
జీవితానికి ఆత్మతృప్తిని..!!

5.  వరాలన్నీ నావే
వసంతమై నువ్వు నన్ను చేరితే...!!

6.  వర్ణాలంతటా వయ్యారాలే
హరివిల్లుకు అందుకే అన్ని అందాలు...!!

7.  కాలానికి ధీటుగా జవాబిస్తూ
మనోనిబ్బరంతో క్షణాలను ఒడిసిపడ్తూ...!!

8.  నిశ్శబ్దం నవ్వుతోంది
ఏ తలపు కదిలిందో మరి....!!

9.  మనసు సహకరించడం లేదు
మౌనసమీక్షలన్నీ నీతోనే నిండుకున్నాయని...!!

10.  మనసును గెలిచిందిగా
ఓడిన మౌనం నీ మాయకులోనై...!!

11.   నమ్మకమే నీవయ్యావు
        సమస్య వీగిపోతుంటే....!!

12.   మనసు మౌనమైంది
మాటలన్నీ నీవయ్యాక...!!

13.   ముడి విడివడదు
మాట మౌనం మనమని నీవంటే..!!

14.  ఎందరికో విశేషాన్నైన నేను
నీకెందుకు సశేషంగా మిగిలిపోతున్నానో...!!

15.   ముగింపు అవసరం లేని కథ
తరగని చెలిమికి అక్షయమైన పాత్రలుగా...!!

16.  అక్షరానికి ఎప్పుడూ ముచ్చటే
నిన్ను తనలో చూసుకుంటానని...!!

17.  భావాల బంధనాలన్నీ విడిపోయాయి
స్వేచ్ఛావిహంగాలైన అక్షరాల ధాటికి...!!

18.  విచ్చుకుందో వేకువ
మలిరాతిరి మధుర సంతసాలను వెంటేసుకుని....!!

19.  నిమజ్జనం చేసినా మళ్ళీ పుడుతోంది
నేనే నీవుగా మారిన జ్ఞాపకమైనందుకేమెా..!!

20.  ఆనందం ఆర్ణవమైంది
అద్దంలో నాలో నిన్ను చూస్తూ..!!

21.  మనదైన అంతరంగం
అంతరాలకు అందకుండా...!!

22.  చెదిరిన మనసొకటి
నా అనే ఆనవాళ్ళకై వెతుకుతూ...!!

23.   వసంతం వలసెళ్ళినట్లుంది
మరో ఉగాదికైనా వస్తుందో రాదో...!!

24.  ఓ క్షణం చాలదూ
మమతల మాధుర్యాన్ని పంచడానికి...!!

25.  గాయమూ గోప్యమైంది
మాటల గారడిలో మునిగిన మదికి... !!

26. దాయాల్సింది ఏముంది
నేను నువ్వు ఒకటిగా మారినప్పుడు...!!

27.  విశేషంగా మిగిలిపోదామిలా
సశేషాలను చెరిపేస్తూ..!!

28.  మనసులోని మమతను చూస్తున్నా
మౌనానికి మాటలను అలంకరిస్తూ...!!

29.  మాటలు మర్చిపోవాలనుకుంటున్నా
గాయాలను మాన్పుకోవాలని....!!

30.  గేయాలైన గాయాలే అన్నీ
గమనం మరచిన మదిలో....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner