26, ఫిబ్రవరి 2018, సోమవారం

గెలుపు కోసం...!!

తెలుగు లోగిలి పేర్ల శ్రీనివాసరావు గారు, మల్లెతీగ కలిమిశ్రి గారి ఆధ్వర్యంలో బిక్కి కృష్ణ గారి సారధ్యంలో జరుగుతున్న సహస్ర కవి సమ్మేళనంలో నేను ఓ బిందువునైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందరో పెద్దలు వ్యయ ప్రయాసలకోర్చి నేను పుట్టిన గడ్డను పావనం చేస్తూ దివిసీమను కవిసీమగా మార్చిన ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనాలు.

కలల దుఃఖాన్ని మోస్తూ
సాగుతోంది జీవిత పయనం

అలల ఆటుపోట్లకు తడుస్తూ
మిగిలిపోతోంది కడలి తీరం

వేదనల రోదనలను భరిస్తూ
ఆశ నిరాశల్లో కొట్టుమిట్టాడుతోంది జీవం

మౌనాల్లో మాటలను దాచేస్తూ
మనసు మోహాన్ని కట్టిపడేస్తోంది హృదయం

క్షణాల కాలాన్ని గుప్పిట బంధించేయాలంటూ
ఆరాటాల పోరాటంలో పడి వాస్తవంలో అలసిపోతోంది అంతరంగం

గెలుపు కోసం నిత్యం రణం చేస్తూనే ఉంది
ఓటమిని ఒప్పుకోలేని అహం...!!  

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner