1. ఆలోచనా ఎక్కువే అక్షరానికి_అర్ధవంతమైన భావమై ఇమడాలని...!!
2. మనసులో ప్రతిష్టించుకుంది_తలపుల అక్షరాలతో చేరువౌతూ....!!
3. సుతి మెత్తనిదే అక్షరం_చురకత్తిలా మారినా....!!
4. వేగుచుక్కగా మారి వెన్ను తట్టింది_ఓదార్పు తానైంది అక్షరం....!!
5. శాంతి సంద్రాన్ని కానుకిచ్చింది అక్షరం_కల్లోల కడలిని తాను హత్తుకుని..!!
6. తీరని మెాహమే మరి_అలవాటై అల్లుకున్న అక్షరాలపై...!!
7. ఊతమై మిగిలింది ఎందరికో_ఒంటరి అక్షరంగా తనుంటూ...!!
8. భావదాహార్తి తీరడం లేదు_తనివితీరని అక్షరానుబంధం పెనవేసుకుని..!!
9. రేపటి కోసం ఎదురుచూస్తున్నా_నన్ను వదిలుండలేని నీ రాకకై...!!
10. కన్నీరు కలత చెందినట్లుంది_చెక్కిలిని అంటిపెట్టుకుని ఉండలేనని...!!
11. కల కలత పడుతోంది_మన పరిచయం కలవరమౌతోందని...!!
12. దగ్గర కాలేనప్పుడు తెలుస్తుంది_మనసుల మధ్యన దూరమెంతని....!!
13. నేల రాలినా నిత్య పరిమళమే_పారిజాతమంటి నెయ్యానికి...!!
14. మనసే లేదంటే మారాము చేసావుగా_ఇచ్చి పుచ్చుకోవడాలు మనకెందుకంటూ...!!
15. ఆంతర్యం అలవాటైంది_నజరానాలక్కర్లేని మనసాక్షరానికి...!!
16. అక్షరాలతో అవధానమే మరి_భావ పూరణాలనంతమైనప్పుడు...!!
17. గతంగానే మిగిలిపోయా_నువ్వు తిరిగొస్తావన్న ఆశతో...!!
18. ఎన్ని అక్షరాలు గుమ్మరించాలో_మది మౌనానికి మాటలద్దాలంటే...!!
19. అక్షరారాధన అనంతమైనది_భావాలక్షయమై పొంగుతుంటే...!!
20. భావాలన్నీ అక్షరబాట పట్టాయి_నీ మౌనమేమంత్రమేసిందో....!!
21. గాలమేశాయి అక్షరాలు_నీ చిత్తరువే చిత్తంలో చేరినందుకనుకుంటా..!!
22. కనికట్టు చేయలేకపోయాయి అక్షరాలు_కంటికెదురుగా నీ రూపుంటే..!!
23. కాలమేఘం కదులుతూనే ఉంది_జీవితపు రంగులన్నీ మెాసుకెళ్తూ...!!
24. మనసే అక్షరంగా మారింది_నా భావనలన్నింటా నువ్వేనని గుర్తెరిగి..!!
25. అక్షర మేఘాలు అలముకున్నాయి_మది అలజడులను చిలకరించడానికి....!!
26. మానసాలొకటిగా చేసినది ఈ అక్షరాలే_మౌనం మనదైన తరుణాన...!!
27. సందర్భం రాలేదుగా_మేఘసందేశమివ్వడానికి...!!
28. బంధం బలమైనదే_బలహీన క్షణాలకు తిలోదకాలిస్తూ...!!
29. మౌనమూ బావుంది_అలవాటైన జ్ఞాపకాలను కాలంతో కట్టి పడేస్తుంటే...!!
30. చలించేది నీ చిరునవ్వులకే_మది గాయం మానకున్నా....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి