1. నవ్వులు నటించలేనంటున్నాయి_నీ నిష్క్రమణాన్ని తట్టుకోలేక...!!
2. చేరువ కాలేని జీవితమిది_తీరమెరిగిన అలల ఆటుపోట్లకు...!!
3. ఊతమవ్వదా నా చెలిమి_తీరమెుకటైన మన జీవితాలకు...!!
4. సంద్రమంటి చెలిమి నీదయ్యింది_సెలఏటిని చేరని నీ చింతని మాపడానికి....!!
5. అక్షయమే జ్ఞాపకాలు_మరుపులేని కాలపు క్షణాలకు...!!
6. అక్షరాలకే సాధ్యమది_అశ్రువులను సైతం అందమైన భావాలుగా మార్చేస్తూ...!!
7. పన్నీటి జల్లులుగా మారుతున్నాయి_మనసు భారాన్ని అక్షరాలు మెాస్తూ...!!
8. లలితమైనదే మనసు సాహిత్యం_లాలిత్యం అక్షరాల సొంతమైతే...!!
9. ఎడబాటు తప్పని మనసులు_అక్షరాలతో మమేకమౌతూ...!!
10. సేతువుగా చేరి నిలిచింది భావం_మనసాక్షరాలనొకటిగా చేస్తూ...!!
11. గెలుపు తథ్యం_భావనాత్మక అక్షరాలకు...!!
12. మురిసి ముదమందలేనా_పలకరించేవి నీ తలపుల సవ్వడులైతే....!!
13. మనసైన జీవితమైంది_నా నవ్వులన్నింటా నువ్వున్నావని...!!
14. అంతర్ముఖీనతను ఆపాదించుకున్నా_అంతర్లోచనాలు నా మనసాక్షరాలని...!!
15. ఆర్ద్రతకు చోటెక్కడిది_ఆత్మీయత అందరానిదై పోతుంటే...!!
16. మనసే అక్షరంగా మారింది_వెదికిన పెన్నిధి దొరికినందుకనుకుంటా....!!
17. గుట్టగా పోసినందుకు కాదట బెట్టు_గుట్టుగా అక్షరాన్ని దాయనందుకట...!!
18. అక్షరాలన్నీ అక్షయమైన భావాలౌతున్నాయి_గుప్పెడు గుండెలో దాగలేక...!!
19. మనసు భారాన్నంతా ఒంపేసా_అక్షరాలకు బాధ్యత గుర్తుజేయాలని...!!
20. మనసు భావాలను క్రమబద్ధం చేస్తున్నా_అక్షరాల అండదండలతో....!!
21. మౌనమెంత ముగ్ధంగా ఉందో_అలక నేర్చిన మనసు పలుకుల్లో....!!
22. తడక్షరాలు పొడిబారుతున్నాయి_మనసెడారిగా మారిందనుకుంటా....!!
23. విలాపమే మిగిలింది వాస్తవానికి_గత గాయాలు మిగిల్చిన ఆనవాళ్ళతో...!!
24. మనసెప్పుడూ ఒంటరిదే_మనిషిదనపు ముసుగుకు బలౌతూ...!!
25. అలజడిదెంత ఆరాటమెా_నీ తలపులకు వీడ్కోలివ్వలేక....!!
26. అంతిమ క్షణాలకు ఆయువు పోస్తాయి_జీవం నింపుకున్న జ్ఞాపకాలైతే...!!
27. వీడ్కోలుకు విషాదమెందుకట_మరో కలయికకు నాందిగా మారినప్పుడు...!!
28. మనసు ముచ్చట్లే ఇవి_మౌనముద్రలన్నీ పద మంజీరాలైన వేళ...!!
29. ఆలోచనెక్కువే అక్షరానికి_మనసుని పదాల్లో మలిచేందుకు....!!
30. తీరని దాహమే మరి_నెయ్యపు ఆనవాళ్ళ సామీప్యం...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి