1. అలుపు లేదు కాలానికెప్పుడు_మనసుతో మమేకమైన నీ జ్ఞాపకాలతో..!!
2. శేషమలాగే మిగిలిపోయింది_అనుబంధపు గుణకారాలు అర్ధం కానందుకేమెా....!!
3. కలం ఉలి నా నేస్తమైంది_మనసాక్షరాలతో భావనకి రూపమీయడానికి....!!
4. అనుబంధం అల్లుకుంది_ఆర్ద్రతకు ఆరాధన తోడై...!!
5. రాతిరి విరామమీయలేదు_కలల లెక్కలు తేలడం లేదని....!!
6. మనసు దాగుండిపోయింది_మమతలన్నీ అక్షరాల్లోకి ఒంపేస్తూ..!!
7. మరులెరుగని మమతది_అక్షరాలతో మమేకమౌతూ....!!
8. మనసుని లిఖించేది అక్షరాలే_భావాల బాధ్యతను పంచుకుంటూ...!!
9. భావ మాలికలు బారులు తీరాయి_అక్షరాల సందడికి అచ్చెరువొందుతూ....!!
10. చేజార్చుకున్న క్షణాలు కొన్ని_మరలిరాని కాలానికి ఆనవాళ్ళుగా...!!
11. అంతరాలెరుగని మనసులివి_అంతరంగాలొకటిగా మసలుతూ...!!
12. కొన్ని భావాలంతే_విశేషాలను వినిపించేస్తుంటాయలా...!!
13. కొన్ని పలకరింపులంతే_శీతకన్నేస్తాయలా మనపై....!!
14. అక్షరాలే జీవితం కొందరికి_ఊహలకు ఊపిరిపోస్తూ..!!
15. లక్షణాలన్నీ అందిపుచ్చుకున్నాయి అక్షరాలు_విలక్షణ భావాలకు నిలయంగా..!!
16. మార్పు సహజమే_కాలం వేసే మరపు మందుతో.... !!
17. ఆణిముత్యమే నువ్వు_స్వాతిచినుకు తాకిన క్షణమే...!!
18. జ్ఞాపకాలు తోడున్నాయి_మాటల్లేని మౌనాన్ని పంచుకోవడానికి....!!
19. వ్యాపకమే జ్ఞాపకమౌతోంది_మౌనం మన(సు)తోనున్నప్పుడు....!!
20. కాలాన్ని ఒడిసిపట్టేది కలమే_అక్షరాలు ఆత్రంగా హత్తుకుంటుంటే...!!
21. మౌనం వీడిన క్షణాలే అన్నీ_మాటలు నిండిన మనసులు మనవైనప్పుడు...!!
22. మనసు పలికే మౌనమిది_అక్షర భావాలు అలంకారమై మెరిసాక...!!
23. బాల్యం బతికిపోయింది_త్వరగా బాధ్యతల పెద్దరికాన్ని ఆపాదించుకుని....!!
24. శూన్యమాలపించేది నిశ్శబ్ధ రాగమే_లయబద్దమైన నీ జ్ఞాపకాలలో చేరి...!!
25. మౌనరాగం మృదువైనదే_తాళం లయ తడబడినా...!!
26. కాలానికి జాగరణే_ముగింపెరుగని ముదితల వెతలు చూస్తూ...!!
27. భావాలకెంత మక్కువో_అక్షరాల్లో అనుక్షణం నిన్నే తలపోస్తానని...!!
28. బంధాలకు బందీలే అక్షరాలు_భావాలకు గుణింతాలై గుంభనంగా ఇమిడిపోతూ...!!
29. మనసంతా నీతోనే_శూన్యాన్ని ఆవహించింది నువ్వయినప్పుడు..!!
30. కాలానికి జాగరణే_ముగింపెరుగని ముదితల వెతలు చూస్తూ...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి