22, డిసెంబర్ 2019, ఆదివారం
ఏక్ తారలు..!!
1. ఎప్పటి లెక్కలప్పుడే_చుట్టరికాల చిట్టాపద్దులు సరిచేయడానికి..!!
2. ఎంతకీ తేలని లెక్కలవి_శూన్యం విలువ తెలుసుకోలేక..!!
3. అక్షర నాట్యం ఆకట్టుకుంది_శూన్యంలోనూ పదాలు హొయలు పోతుంటే...!!
4. అక్షర లాస్యం హాస్యమవుతోంది_అతిశయం అహమై చేరితే...!!
5. మేలిమి ముత్యమంటి మనసది_స్వచ్ఛతను స్వాగతిస్తూ...!!
6. అలికిడెరుగని అలజడిది_మానససంచారంలో బంధమై మెసలుతూ..!!
7. ఆవాహన అవసరం లేదు_మన మనసులొకటని తెలిసాక..!!
8. పరిమళమై వ్యాపిస్తావనుకున్నా_పరిచయమై చుట్టేస్తావనుకోలేదిలా..!!
9. గగనానికి విరామమే లేదు_రేయిపగలు దాగుడుమూతల్లో...!!
10. యుగాల నిరీక్షణ క్షణాల్లో మాయమైంది_నీ రాక అలికిడికి..!!
11. పలకరిస్తూనే ఉన్నాయి జ్ఞాపకాలన్నీ_గుప్పెడు గుండెలో గువ్వల్లా ఒదిగినా...!!
12. చిరుజల్లులై మురిపిస్తుంటాయి_కన్నీరైనా పన్నీరైనా...!!
13. పలకరింతల విన్యాసాలు_మనసాక్షరాలు మౌనం వీడితే..!!
14. మనసు ఆరాటమిది_మర్మాలను విప్పి చెప్పమని అక్షరాలనర్థిస్తూ...!!
15. అపార్థమెప్పుడూ అంతే_క్షణాల్లో బంధాలను తల్లక్రిందులు చేసేస్తూ...!!
16. కలానికెప్పుడూ సంశయమే_కాలాన్ని అక్షరాలకు అంకితమిస్తున్నా...!!
17. అలక మబ్బులు తేలిపోయాయి_అసలైన ఆప్యాయత అందివచ్చాక...!!
18. కన్నీరెంత కార్చినా నిరర్థకమే_కరగని మనసు నీకెదురైనప్పుడు...!!
19. అహం అపోహకి చోటిచ్చింది_కాస్త ఆదమరచాననేమెా..!!
20. మనిషి నైజమదే మరి_ఆధిపత్యపు అహంకారంతో నిండి..!!
21. కాలంతో పోటిగా పరుగులెత్తుతూ మనం_శతాబ్దాలుగా వెనుకబడే..!!
22. ఆయువు తీరిన వాళ్ళ కోసం_యముడంపిన పల్లకీ అది..!!
23.కాలమెప్పుడూ కతలు చెప్తూనేవుంటుంది_వినగలిగే మనసుండాలంతే...!!
24. చరిత్రలో గుర్తింపు పొందుతూనే ఉన్నాయి_వెతలు వెలిసిన కతలుగా మారుతూ..!!
25. రాలుతున్న నక్షత్రాలను ఏరుకుంటున్నా_నీ ఊసులు వినిపిస్తాయని...!!
26. గుబులుగున్నాయి అక్షరాలు_కథకు ముగింపు తెలిసాక...!!
27. వెలసిన బతుకుల వెతల నవ్వులవి_జీవం లేని వెలుగు పువ్వులై...!!
28. నవ్వొక నయగారం_కలతనో కలవరింతనో దాచేస్తూ..!!
29. అద్భుతం అక్షరానిది కాదు_నెచ్చెలి అందించిన నెయ్యానిది..!!
30. ఆదమరుపే వరమయ్యింది_అనునయాలు అందని వేళ...!!
వర్గము
ఏక్ తార
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి