18, డిసెంబర్ 2020, శుక్రవారం

రాయితీలు ఇవ్వబడవు...!!

కష్టంలో లేని పలకరింపు
సుఖాలలో అక్కర్లేదు 

అవసరానికి అక్కరకు రాని ఏ బంధమూ
పెంచుకోవాల్సిన అగత్యమూ లేదు

చావుపుట్టుకలకు కనీసం మాటామంచి లేని  చుట్టరికాలను వదిలించు కోవడమే మంచిది

అశుభమని భావించే శుభప్రదాయిలకు 
తులసినీళ్ళు వదిలేయడమే

బాధ ఈరోజు నాఇంటిది కావచ్చు
రేపటిరోజున నీ ఇంటి తలుపు తట్టదని లేదుగా

డబ్బు జబ్బు చుట్టుకున్న
అహంకారులెవరైనా నా దృష్టిలో లేనట్లే లెక్క

ఎవరినైనా క్షమించవచ్చు కాని
మానసిక హింసాంతకులను క్షమించేంత సుగుణమూ నాకు లేదు

అక్షరాలా ఇది నిజం
ఈ విషయాల్లో ఏ రాయితీలు ఇవ్వబడవు0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner