నేస్తం,
మనకి మనం చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా వుంటున్నామని. మంచైనా, చెడైనా మనకి మనమనుకుంటే సరిపోదు. నలుగురు చెప్పాలి మన మంచి చెడుల గురించి. విమర్శకి, వ్యక్తిగత అభిప్రాయానికి తేడా తెలియని స్థితిలో మనముండి ఎదుటివారికి సూక్తిసుధలు వల్లిస్తే సరికాదు.
ఎవరి విషయమో ఎందుకు, నా విషయానికే వద్దాం . నేనెప్పుడు ఎవరి గోడల మీదైనా వారు రాసిన పోస్టులకు ప్రతిస్పందనగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పుంఖానుపుంఖాలుగా వివరించలేదు. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయం అన్న దానికన్నా వ్యక్తుల భజన అంటే సరిపోతుందేమో. నాకు నచ్చని పోస్టులకు వారి అభిప్రాయానికి విలువనిచ్చి చూసి ఊరుకుంటాను తప్పించి, ఏ విమర్శలు కాని, అభిప్రాయాలు కాని అక్కడ వివరించను. నా అభిప్రాయాలు నా గోడ మీద రాసుకుంటాను. అది రాజకీయమైన, సామాజికమైనా, కులమత పరమైనా.
నాకు నచ్చిన, నా మనసుకి తోచిన ఏదైనా నా గోడ మీద రాసుకుంటాను. నా రాతలు అందరికి నచ్చాలన్న నియమమేమి లేదు. నా ప్రతి రాతను అందరూ పొగడాలని నేను అనుకోను. మనం రాసే స్పందనబట్టే మన సంస్కారం ఏమిటన్నది నలుగురికి తెలుస్తుంది. మనం చెప్పనక్కర్లేదు. నా స్పందనలు కూడా అంతే వుంటాయి. అంతేకానీ ఎవరి గోడల మీదకో వెళ్లి అక్కడ వారి అభిప్రాయాన్ని అవహేళన చేయడమో, విమర్శించడమో చేయను. ముఖ్యంగా సూక్తిసుధలు వల్లించను. ఉచిత సలహాలు అస్సలివ్వను. కులమతాలను హేళన చేసే కుసంస్కారులను అస్సలు వదలను.
నేనేంటన్నది నా అనుకున్న వాళ్ళకు తెలుసు. కొందరి పొగడ్తలు నాకు అవసరం లేదు. ఎవడు మీకు నచ్చితే వాడిని పొగుడుకోండి. ఏ రాజకీయ నాయకుడినైనా, సినిమా నటుడినైనా, మతాన్ని, కులాన్ని ఇలా ఏదేనా అది మీ వ్యక్తిగతం. దాన్ని నామీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయకండి. వాక్యానికి, వ్యాఖ్యానానికి తేడా తెలుసుకుంటూ..విమర్శకు అభిప్రాయానికి కూడా తేడా తెలుసుకోండి.
మరోసారి చెప్తున్నా..నేను, నా రాతలు నచ్చని వారు నిరభ్యంతరంగా నా ఫ్రెండ్ లిస్ట్ నుండి వెళిపొండి లేదా బ్లాక్ చేసుకోండి. ఛాయిస్ మీకే వదిలేసా. ఇంకెప్పుడు నా కోపాన్ని కాని, నన్ను కాని వ్యక్తిగతంగా విమర్శించే పని పెట్టుకోకండి.
ఇదండి అసలు విషయం…!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి