కొన్ని సంతోషాలను పంచుకోకపోవడమూ తప్పే…బాబాయ్ థాంక్యూ సోమచ్
మీ పర్మిషన్ తీసుకోకుండా మీ మాటలను యథాతథంగా..🙏
నా పుస్తకం “ కాలం వెంబడి కలం “ పిడిఎఫ్ పంపించిన తర్వాత డాక్టర్ డి ప్రసాద్ గారి మాటలు..
వుండమ్మా డిస్టర్బ్ చేయకు...ఇప్పుడే మొదటి 24 పేజీలు చదివేశాను.
ఇంతలో నీ మెసేజ్ వచ్చింది.
ఎంత బాగా రాసారో. ...నీ గురించి....
చాలా చాలా ఆనందంగా ఉంది... మoజమ్మాయి...
లోగడ ఎపిసోడ్స్ గా వచ్చినప్పుడు తరువాత వచ్చేదానికోసం ఆతృతగా ఎదురు చూసే వాళ్ళం.
ఇప్పుడు ఒకే బిగిని చదివించేస్తోంది...అంత మాగ్నేటిక్ ఫోర్స్ ఉంది ...కధా కథనంలో.... చెప్పే విధానంలో...
నిజాయితీ ,ముక్కుసూటితనం అలవోకగా రాసే నైపుణ్యం ,....హృదయానికి సూటిగా తాకే అక్షరతూణీరాలు
మంజూ స్వంతం....
Proud of You Manju
ఒక జీవితంలో పది జీవితాలను అనుభవించావు.
గాంధీ గారి " సత్య శోధన " పుస్తకం తరువాత అంతటి స్థాయిలో సత్యశోధన కనిపించిన పుస్తకం ఇదే.... నా దృష్టిలో.....
చిన్నదానివైనా. .. ...(.మా అబ్బాయి వయసే
నీకు) పాదాభివందనం ...చేయాలని పిస్తోంది...మంజమ్మా..
ఇంతకన్నా ఇంకేం కావాలి..
విజయలక్ష్మి పోతేపల్లి మాటలు…
👍😊❣️ మీ రాతలు చదివి మారుతున్న వారిలో మారాలనుకొనేవారిలో నేను ముందుంటాను మంజూమేడం. ఇప్పటికీ అనుకొనేది ఒకటే మీ పరిచయం ఇంకొన్ని సంవత్సరాల ముందు జరిగిఉంటే నా జీవితం నిజంగా ఇలా మాత్రం ఉండిఉండేది కాదు.ఎంతో మార్పు జరిగేది సరైన మార్గంలో.వేరేవాళ్ళ గురించి నాకు తెలియదు నా వరకూ మంజూమేడం అంటే మంజూమేడమే.ఒక నమ్మకం ఒక ఓదార్పు ఒక ఆరాధన ఒక ఆదర్శం.వెరసి నా గురువుణిగారు.నేను ఈ పీడీఎఫ్ ఏమీ చదవలేదు.మీ మాట ఒక్కటే చదివా.అది చూసే రాశా ఇలా.🙏🙏🙏
చదివి మొత్తం పోస్ట్ పెడతా.తర్వాత.
థాంక్యూ సోమచ్ విజయా
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి