నేస్తం,
నీ పుస్తకాల వలన ప్రయోజనం ఎవరికి?
ఎందుకు ఈ పుస్తకాలు,రాతలు?
దీనికి సమాధానం ఏం చెప్పాలి? ఎందుకు చెప్పాలి అని అడగవద్దు. ఓ పని చేసామంటే దానికి తగిన ఫలితం వుండాలి. అది ఏ రకంగా అన్నది మన సమాధానం.
ముందుగా నా రాతలు నా కోసమే. నా మనసు తృప్తి కోసం. వాటిని ఎవరెలా తీసుకుంటారన్నది వారిష్టం. దానితో నాకు సంబంధం లేదు. దేవుడే అందరికి మంచివాడు కాదు. అలాంటప్పుడు నేనెంత చెప్పండి. రాయడం తప్పు కాదు. తప్పుడు పని అంతకన్నా కాదు. రచన చేయడం మీరు ఎద్దేవా చేసినంత సుళువు కాదు. నాలుగు వాక్యాలు రాసి చూడండి తెలుస్తుంది ఆ కష్టం ఏమిటో, దానిలోనున్న ఇష్టమేమిటో. మనిషికి విలువ తాను వేసుకునే దుస్తులు, పెట్టుకునే ఆభరణాలు, అధికారం, డబ్బు వగైరా వాటి వలన వస్తుందనుకుంటే అది పొరబాటు. వీటి వలన మనకు విలువనిచ్చినట్టు నటిస్తారు తప్ప నిజంగా మనకు విలువనివ్వరు. ఓసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి. అక్షరానికున్న గౌరవం ఏంటన్నది తెలుస్తుంది. సొమ్ముండగానే సరి కాదు. దానిని సక్రమంగా వినియోగించినప్పుడే దానికి, మీకు విలువ, గౌరవం. రాతలను, రాసేవారిని చులకనగా చూడకండి. దాని విలువ తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి