1. మనిషైనా
మనసైనా
కష్టానికి
సుఖానికి ఒకటే
ప్రశ్న, సమాధానం
కాలమే..!!
2. గాయం చేసేది
మనిషే
మాయం చేసే నేర్పు
కాలానిది
తీరుతెన్నుల ఫలితం
మనసుదే..!!
3. ఉధృతిని భరించేది
సముద్రం
అలజడిని అనుభవించేది
మనసు
సారూప్యం
కొన్నింటిది..!!
4. దూరం పెంచడం
సుళువే
దగ్గర చేయడమే
కష్టం
మాటకున్న
విలువ..!!
5. నటించడం
మనకలవాటు
ఆడుకోవడం
పైవాడికి తెలుసు
రేపనేది ఉంటుంది
ఎవరికైనా..!!
6. బంధుత్వం
దగ్గరదే
బాంధవ్యమే
బహు దూరం
ఈనాటి
అనుబంధాల్లో..!!
7. అణుమాత్రమే
అభిమానం
నిలువెల్లా
అహంకారమే
సమన్వయమే
ప్రేమపాశం..!!
8. నీతో
నువ్వు
నీలో
నవ్వు
నెయ్యానికి
నేస్తం..!!
9. తప్పొప్పులు
సహజం
ఎత్తి చూపే నైజం
మనిషి లక్షణం
తీర్పు
కాలానిది..!!
10. నోటితో
మాట
నొసటితో
వెక్కిరింత
కొందరి
నైజమింతే..!!
11. కల
కనుమరుగౌతుంది
వాస్తవం
వద్దనే వుంటుంది
కాలం
మారదు..!!
12. అభిమానం
ఆత్మీయత
బంధం
అనుబంధం
మానవ సంబంధాలు
చరిత్ర పుటల్లో..!!
13. అర్హత
అనర్హత
అక్షరమే
తేడా
వ్యవస్థ
పు(తి)రోగతికి మూలం..!!
14. రాయలేని
లేఖ
మోయలేని
బరువు
మనసు పొరల్లో
పదిలం..!!
15. సహజత్వం
మెరుపు
అసహజత్వం
విరుపు
వెరసి
అత్యున్నత పురస్కారం..!!
16. జీవన పయనంలో
అనుభవాల పరంపరలు
భారమో బాధ్యతో
మోయక తప్పదు
భవితకు బాట
అక్షర సంపద..!!
17. బాల్యపు
గాలిపటం
తెరచిన
పంజరం
ఊహలు
స్వేచ్ఛా విహంగాలు..!!
18. దృతరాష్ట్ర ప్రేమ
కొందరిది
శకుని అభిమానం
మరి కొందరిది
ప్రేమలు
పలురకాలు..!!
19. జీతం
పనికి
జీవితం
నమ్మకానికి
చరిత్ర
చెబుతోంది సత్యం..!!
20. వెన్నెల రాక
అనివార్యం
చీకటి చుట్టం
పరామర్శకు
ప్రకృతి
సహజ లక్షణం..!!
21. అమ్మ దాచిన
తాయిలాలు
దేవుడు మిగిల్చిన
జ్ఞాపకాలు
జీవానికి జీవితానికి
నడుమన బంధాలు..!!
22. మళ్ళింపు
బహు సుళువు
మనిషి
బలహీనత తెలిస్తే
చాకచక్యం
చారిత్రాత్మకం..!!
23. దూరాన
మబ్బు తెరలు
గాలి వాలున
మనసులను తాకుతూ
లేఖల బంధాలు
అపురూప జ్ఞాపకాలు..!!
24. ముందుచూపు(విజన్)
భవిష్యత్ తరాలకు
కారాగారం(ప్రిజన్)
కనిపిస్తున్న నిజం
ఏది కావాలన్నది
మీ చేతిలోనే…!!
25. కాలం దాచే
తాయిలాలు
ఆటల్లో తగిలే
దెబ్బలు
సజీవపు
ఆనవాళ్ళు..!!
26. ఒడుపు
తెలియాలి
రాతిని
పట్టుకోవాలంటే
నేర్పరితనం
వాడకాన్ని బట్టి..!!
27. సాక్ష్యాన్ని
రూపుమాపడం
వ్యవస్థను
శాసించడం
మరణ వాంగ్మూలానికి
విలువెంతో..!!
28. గుచ్చుకునే
గులకరాళ్ళు
గుండెను చీల్చే
గులాబిముళ్ళు
మాట పదును
మహ మెత్తన..!!
29. అవసరాలకే
అనుబంధాలు
ఆత్మీయతలు
ఆమడ దూరమే
యుగాల
సత్యమిదే..!!
30. మరణ వాంగ్మూలానికి
విలువ లేదు
మతి స్థిమితం లేదని
తేల్చేస్తారు
అధికారం చేతుల్లోనే
అన్ని వ్యవస్థలు..!!