ఏకాకి మేఘమెుకటి
ఎదను గిల్లి పోయింది
రాకాసి రాగమెుకటి
రాలుగాయితో జతగూడింది
కూతవేటు దూరమైనా
చేరలేని తావిగా మారింది
మాటలెన్ని పంచుకున్నా
వినలేని మనసే అయ్యింది
గాలివాటు గాయాలెన్నో
మౌనంగానే మిగిలాయి
కాలంతోనే కలిసుంటూ
కల’వరాల పయనం సాగిస్తున్నాయి..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి