15, మార్చి 2023, బుధవారం

​అవ్యక్తం ఆవిష్కరణ..!!   కొన్ని అనుబంధాలను వ్యక్తపరచడానికి మాటలు సరిపోవు. మా గోపాలరావు అన్నయ్య, శిరీష వదినలతో నా అనుబంధం అలాంటిదే. నాకు ఊహ తెలిసినప్పుడు తొలిసారిగా “వదిన” అన్న పదం మా శిరీష వదినతోనే మెుదలు. “మంజుల” అనుకున్న నా పేరుని కూడా “మంజు” అని మార్చింది కూడా మా గోపాలరావు అన్నయ్యే. వాళ్ళ మెుదటి పాప ఆరు నెలల “మమత” ను అమెరికా నుండి తీసుకువచ్చినప్పుడు హైదరాబాదు ఎయిర్ పోర్టుని మెుదటిసారి చూడటం, అక్కడే పానాసానిక్ బ్లూ కలర్ రౌండ్ రేడియో అన్నయ్య ఇవ్వడము ఇప్పటికీ గుర్తే. 

    అమెరికాలో అడుగు పెట్టడము, అన్నయ్య ఇంటికి తీసుకువెళ్ళడము, వాళ్ళ పిల్లలు సుమి, కృష్ణ నేను చికాగో వెళుతుంటే ఫ్లైట్ లోపలి వరకు వచ్చి పంపించడమూ, మా శిరీష వదినకు నేను పాలు పోసి వండిన బంగాళదుంప కూర నచ్చడము, శౌర్య పొట్టలో ఉన్నప్పుడు వదిన నా బాగోగులు కనుక్కోవడమూ ఇలా బోలెడు జ్ఞాపకాలు ఈ ఐదు పదుల కాలంలో.

     అనుకోకుండా దూరమైన మా శిరీష వదినకు నా అక్షరాలను కొన్నింటిని మా గోపాలరావు అన్నయ్య చేతి మీదుగా ఆవిష్కరించి, వాళ్ళ అమ్మాయి సుమిత్రకు, అన్నయ్య సాంబశివరావు కన్నెగంటి గార్లకు ప్రతులను అందించడము ఈరోజు జరిగింది. తక్కువ సమయంలో అయినా పుస్తకాన్ని అందంగా అందించి, ఆవిష్కరణకు వచ్చిన మల్లెతీగ కలిమిశ్రీ గారికి, రాఘవేంద్ర శేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అనుకోని అతిథులుగా వచ్చిన హరిక దంపతులకు మనఃపూర్వక ధన్యవాదాలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner