“కవన గర్బరాలు” పుస్తకంలో వంద సంవత్సరాల తెలుగు సాహిత్య సంపద నుండి ఏర్చి కూర్చిన కవితా కుసుమాలలో చోటు దక్కడమంటే మామూలు విషయం కాదు. తానా,నాటా వంటి పెద్ద పెద్ద సంస్థలు నిర్వహించిన కవితా పోటీలలో విజేతగా నిలిచి, ఏక్ తారల సమూహాన్ని స్థాపించి, మాలాంటి ఎందరికో తారల సితారలు రాయడం నేర్పించిన మా పద్మాశ్రీరాం గారి కవిత “తుది వాంగ్మూలం” ఈ మహామహుల సరసన స్థానం సంపాదించుకోవడం చాలా సంతోషం. వారికి హృదయపూర్వక అభినందనలు.
ఈ భూమి మీద చావు పుట్టుకలు జీవమున్న ప్రతి ప్రాణికి సహజమే. మనం చూడలేని మన అంతిమయాత్రను అతి సునాయాసంగా అలతి పదాలతో, ఆత్మానుభూతిని అందించడం చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యం. అంతిమదశలో అందుకున్న ఛీత్కారాలు, సత్కారాలను తలుచుకుంటూ సాగిన ఈ అంతిమ ప్రయాణపు విశేషాలను ఆత్మ దర్శనం గావించి, కొందరికి చెంపపెట్టుగా సంధించిన ఈ అక్షర స(శ)రాలు నిజం కాదని ఎవరైనా అనగలరా..!
మనిషి బతికుండగా చూపలేని ఆదరణ, ఆప్యాయత, ఆ మనిషి చనిపోయినప్పుడు మోమాటానికో, లేదా మనసు నుండో వెలువడే అభిమానం, కాస్త ఆ మనిషి జీవించినప్పుడు అవసానదశలో గుప్పెడు ఆప్యాయతను, నాలుగు ఆదరణపు పలుకులను అందించమన్న గొప్ప సందేశాన్ని, చిరుకవితగా చిన్న చిన్న తేలిక పదాలలో చెప్పిన పద్మాశ్రీరాం గారికి మనఃపూర్వక అభినందనలు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి